iDreamPost

Paytm సంచలన నిర్ణయం.. వారందరికి ఇది బ్యాడ్ న్యూస్!

  • Published May 24, 2024 | 7:57 PMUpdated May 24, 2024 | 7:57 PM

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ అయిన Paytm సంస్థ ఉద్యోగులకు భారీ షాకివ్వనుంది. కాగా, ఇటీవలే ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంస‍్థ ప్రస్తుతం ఖర్చు తగ్గంచుకునే పనిలో ఉద్యోగులపై వేటు విధించింది.

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ అయిన Paytm సంస్థ ఉద్యోగులకు భారీ షాకివ్వనుంది. కాగా, ఇటీవలే ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంస‍్థ ప్రస్తుతం ఖర్చు తగ్గంచుకునే పనిలో ఉద్యోగులపై వేటు విధించింది.

  • Published May 24, 2024 | 7:57 PMUpdated May 24, 2024 | 7:57 PM
Paytm సంచలన నిర్ణయం.. వారందరికి ఇది బ్యాడ్ న్యూస్!

పేటీఎం.. గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసిన ఈ సంస్థ గురించే ఎక్కువగా చర్చ నడుస్తునే ఉంది. ప్రముఖ ఫిన్‌టెక్‌ సంస్థ పేటీఎంపై ఇటీవలే రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్ని ఆంక్షలు విధించినప్పటి నుంచి హాట్‌ టాపిక్‌ గా మారిపోయింది. కాగా, కేవైసీ నియమాలను పాటించనందుకు, ట్రాన్సాక్షన్ల విషయంలో నిబంధనలు ఉల్లంఘించినందుకు పేటీఎం పేమెంట్ బ్యాంకుపై ఆర్బీఐ ఆంక్షలు విధించింది. ఇక ఆర్బీఐ నిషేధంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న పేటీఎం తాజాగా ఉద్యోగ్యులకు భారీ షాకివ్వనుంది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ప్రముఖ డిజిటల్‌ పేమెంట్స్‌ సంస్థ అయిన Paytm సంస్థ ఉద్యోగులకు భారీ షాకివ్వనుంది. కాగా, ఇటీవలే ఆర్బీఐ విధించిన ఆంక్షల కారణంగా ఉక్కిరిబిక్కిరి అవుతున్న సంస‍్థ ప్రస్తుతం ఖర్చు తగ్గించుకునే పనిలో పడింది. ఈ క్రమంలోనే అందులో పనిచేస్తున్న ఉద్యోగులపై వేటు వేయాలని భావిస్తోంది. ఈ క్రమంలోనే మొత్తం వర్క్ ఫోర్స్‌లో 15 – 20 శాతం ఉద్యోగులను ఇళ్లకు పంపాలని భావించిదట. ఇక త్వరలోనే పేటీఎం సంస్థలో ఉద్యోగుల తొలగింపు ఉంటుందని ఆ సంస్థ సీఈఓ విజయ్‌ శేఖర్‌ శర్మ తన కంపెనీలోని షేర్‌ హోల్డర్లకు రాసిన లేఖలో పేర్కొన్నట్లు సమాచారం. అయితే టెక్, ఫైనాన్షియల్ సర్వీసెస్‌లో పెట్టుబడులు పెట్టడం, ఉద్యోగులకు చెల్లించే జీతాల ఖర్చులు గణనీయంగా పెరిగాయని, అందుకే సంస్థ తమ ఖర్చులను తగ్గించేందుకు ఉద్యోగులకు వేటు వేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ క్రమంలోనే పేటీఎం సుమారు 5,000 నుంచి 6,300 మందిని తొలగించడానికి రెడీగా ఉన్నట్లు సమాచారం. ఇక ఉద్యోగులకు తగ్గించడం ద్వారా రూ. 400-500 కోట్లను ఆదా చేయవచ్చని సంస్థ లక్ష్యంగా పెట్టుకుంది. ఇదిలా ఉంటే.. పేటీఎం పేమెంట్స్ బ్యాంక్‌కు సంబంధించిన లావాదేవీలపై RBI విధించిన నిషేధంతో 2023-24 ఆర్థిక సంవత్సరం నాలుగో త్రైమాసికంలో రూ.550 కోట్ల నష్టం వచ్చిందని ఆ కంపెనీ పేర్కొంది. కాగా, ఫైనాషలియర్ 23లో కంపెనీ సగటున 32,798 మంది ఉద్యోగులను పేరోల్‌లో కలిగి ఉంది. అందులో 29,503 మంది యాక్టివ్‌ గా పని చేస్తున్నారు.

ఇలా ఒక ఉద్యోగికి సగటు జీతం రూ.7.87 లక్షలు. FY24 కోసం మొత్తం ఉద్యోగి ఖర్చులు సంవత్సరానికి 34 శాతం పెరిగి రూ. 3,124 కోట్లకు చేరాయి. ఒక్కో ఉద్యోగి సగటు ఖర్చు రూ. 10.6 లక్షలకు పెరిగింది. ఇప్పటికే గతేడాది డిసెంబర్‌లో 1,000 మంది ఉద్యోగులను తొలగించారు. FY24లో తొలగించే ఉద్యోగుల సంఖ్య ఇంకా వెల్లడి కాలేదు. ఇది 20శాతంగా ఉండొచ్చని ప్రముఖ బిజినెస్ అనాలసిస్ట్స్ చెబుతున్నారు. మరి, పేటీఎం సంస్థ ఉద్యోగుల పై వేటు వేయడం పై మీ అభిప్రాయాలను కామెంట్స్‌ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి