iDreamPost
android-app
ios-app

మహీంద్రా THAR ROXX లుక్స్ రివీల్.. 5 డోర్ లో ఉన్న ప్రత్యేకతలివే!

Difference Between Mahindra Thar Roxx 5 Door And 3 Door: మహీంద్రా కంపెనీ నుంచి ఉన్న బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అనగానే థార్ అనేస్తారు. అయితే ఇప్పుడు థార్ లో 5 డోర్ జనరేషన్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే 3 డోర్ థార్ కి.. 5 డోర్ థార్ కి ఉన్న తేడాలు ఏంటో చూద్దాం.

Difference Between Mahindra Thar Roxx 5 Door And 3 Door: మహీంద్రా కంపెనీ నుంచి ఉన్న బెస్ట్ ఆఫ్ రోడ్ వెహికల్ అనగానే థార్ అనేస్తారు. అయితే ఇప్పుడు థార్ లో 5 డోర్ జనరేషన్ వస్తున్న విషయం తెలిసిందే. అయితే 3 డోర్ థార్ కి.. 5 డోర్ థార్ కి ఉన్న తేడాలు ఏంటో చూద్దాం.

మహీంద్రా THAR ROXX లుక్స్ రివీల్.. 5 డోర్ లో ఉన్న ప్రత్యేకతలివే!

ఆటోమొబైల్ ఇండస్ట్రీలో మహీంద్రా కంపెనీకి ఒక ప్రత్యేక గుర్తింపు, ఆదరణ ఉన్నాయి. ఏ సెగ్మెంట్ తీసుకున్నా వారి నుంచి అత్యుత్తమ ప్రమాణాలతో ఒక కారు కచ్చితంగా ఉంటుంది. అలాంటి కారే ఈ థార్ కూడా. ఇది గతంలో కేవలం 3 డోర్ మోడల్ మాత్రమే ఉండేది. కానీ, ఇప్పుడు దానిని అప్ గ్రేడ్ చేసి 5 డోర్ మోడల్ తీసుకొస్తున్న విషయం తెలిసిందే. ఆ వర్షన్ కు THAR ROXX అని పేరు పెట్టారు. ఇప్పటికే ఈ ఆఫ్ రోడ్ బీస్ట్ కి సంబంధించి చాలానే విషయాలు రివీల్ చేశారు. ఆగస్టు 15న అధికారికంగా లాంఛ్ అవుతున్న సందర్భంగా ఇంటీరియర్ టీజర్ కూడా విడుదల చేశారు. తాజాగా ఈ కారుకి సంబంధించి లేటెస్ట్ లుక్స్ ని వినియోగదారుల ముందుకు తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో అసుల 3 డోర్ కి.. 5 డోర్ థార్ రోక్స్ కి ఉన్న తేడాలు ఏంటో చూద్దాం.

మహీంద్రా కంపెనీ థార్ ని మొదట 2010 అక్టోబర్ 4న లాంఛ్ చేసింది. ఆ తర్వాత సెకండ్ జనరేషన్ ని మాత్రం పదేళ్ల తర్వాత ఆగస్టు 15, 2020న లాంఛ్ చేసింది. కానీ, ఇప్పుడు తర్వాతి జనరేషన్ ని మాత్రం ఇండియాలో కేవలం నాలుగేళ్లకే తీసుకొచ్చింది. సరిగ్గా నాలుగేళ్ల తర్వాత అదే పంద్రాగస్టున థార్ రోక్స్ ని లాంఛ్ చేస్తున్నారు. లుక్స్ పరంగా కూడా ఈ 5 డోర్ థార్ లో భారీగానే మార్పులు జరిగాయి అని చెప్పచ్చు. 3 డోర్ తో పోలిస్తో 5 డోర్ ఫ్రంట్ లుక్స్ లో 7 స్లాట్ డిజైన్ ని సిక్స్ స్లాట్ డిజైన్ గా మార్చేశారు. హెడ్ ల్యాంప్స్ ని ఎల్ఈడీ ప్రొజక్టర్స్ గా మార్చారు. అలాగే C షేప్ తో డీఆర్ఎల్స్ ని అమర్చారు. గతంతో పోలిస్తే ఇంకాస్త స్లీక్ డిజైన్ తో ఇండికేటర్స్, ఫాగ్ ల్యాంప్స్ ని అమర్చారు. డోర్ మౌంటెడ్ డ్యూయల్ టోన్ ఓవీఆర్ఎంస్ వస్తున్నాయి. అలాగే సైడ్ న మీకు థార్ రోక్స్ బ్యాడ్జింగ్ లభిస్తుంది. ఫ్రంట్ బంపర్ డిజైన్ చూస్తే కొన్ని మార్పులు కనిపిస్తున్నాయి. అలాగే ఫాగ్ ల్యాంప్స్, బంపర్ కనెక్టివిటీ చూస్తే ల్యాంప్స్ లో కూడా C షేప్ హైలెట్ చేశారు. అలాగే 5 డోర్ కి తగినట్లు 18 ఇంచెస్ వీల్స్ ని తీసుకొచ్చారు. అలోయ్ వీల్ డిజైన్ కూడా మెప్పించే విధంగానే ఉంది.

ఇంటీరియర్:

ఇంటీరియర్ విషయానికి వస్తే.. దాదాపుగా 3 డోర్ థార్ లో ఉన్న ఫీచర్స్, ఇంటీరియర్ నే కంటిన్యూ చేస్తున్నారు. కొన్ని చిన్న చిన్న మార్పులు అయితే చేశారు. ఈ రోక్స్ లో న్యూ స్టీరింగ్ వీల్, మౌంటెడ్ కంట్రోల్స్, అందరూ ప్యాసెంజెర్స్ కి అడ్జస్టబుల్ హెడ్ రెస్ట్, రేర్ ఆర్మ్ రెస్ట్, స్ప్లిట్ సెంటర్ ఆర్మ్ రెస్ట్, త్రీ పాయింట్ సీట్ బెల్ట్ తో పాటుగా.. రూఫ్ మౌంటెడ్ స్పీకర్స్ ఇస్తున్నారు. అలాగే పానరోమిక్ సన్ రూఫ్ కూడా లభిస్తోంది. ఇందులో డిజిటల్ ఇన్ స్ట్రుమెంటల్ క్లస్టర్ లభిస్తుంది. రివీల్ చేసిన వీడియోలో కూడా అదే హైలెట్ గా నిలిచింది.

ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్, టచ్ స్క్రీన్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, హర్మన్ కార్డన్ మ్యూజిక్ సిస్టమ్, వెంటిలేషన్ కలిగిన లెథ్రెట్ సీట్స్ వస్తున్నాయి. ఇంక ఈ థార్ రోక్స్ లో మీకు డ్యాష్ బోర్డ్ లో సాఫ్ట్ టచ్ ఫినిష్ తో ఉన్న స్టిచ్చింగ్ అయితే కచ్చితంగా నచ్చుతుంది. ఇందులో లెవల్ 2 ADAS సేఫ్టీ ఫీచర్స్ ఉంటాయి. ఇంక ఇంజిన్ విషయానికి వస్తే.. రోక్స్ లో కూడా 128hp 2.2 లీటర్ డీజిల్ ఇంజిన్, 150hp 2.0 లీటర్ టర్బో పెట్రోల్ ఇంజిన్ ఆప్షన్స్ లభిస్తాయి అంటున్నారు. 6 స్పీడ్ గేర్ బాక్స్ తో ఆటోమేటిక్, మాన్యువల్ ట్రాన్స్ మిషన్స్ లభిస్తాయి. మరి.. మహీంద్రా థార్ రోక్స్ లుక్స్, ఫీచర్స్ మీకు ఎలా అనిపించాయి? మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.