Arjun Suravaram
Air India: దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్ ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. మరోసారి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా విధిస్తూ ఝలక్ ఇచ్చింది.
Air India: దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్ ఎయిరిండియాకు భారీ షాక్ తగిలింది. మరోసారి డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా విధిస్తూ ఝలక్ ఇచ్చింది.
Arjun Suravaram
దేశీయ దిగ్గజ ఎయిర్ లైన్స్ ఎయిరిండియాకు డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ (డీజీసీఏ) ఝలక్ ఇచ్చింది. ఎయిర్ ఇండియాకు భారీ జరిమానా విధించింది. రూ.98 లక్షల భారీ జరిమానా విధించినట్లు డీజీసీఏ ఓ ప్రకటనలో తెలిపింది. అర్హత లేని సిబ్బందితో విమానాలు నడుపుతున్నందుకు గాను ఈ జరిమానా విధించినట్లు తెలిపింది. ఎయిర్ ఇండియా డైరెక్టర్ ఆపరేషన్స్, డైరెక్టర్ శిక్షణపై రూ. 6 లక్షలు, రూ. 3 లక్షల జరిమానా విధించింది. అలానే మొత్తంగా రూ.98 లక్షల జరిమానాను డీజీసీఏ ఎయిర్ ఇండియాకు విధించింది.
గతంలో కూడా ఎయిర్ ఇండియాకు జరిమానాలు పడ్డాయి. దేశీయ దిగ్గజ భద్రతా పరమైన నిబంధనలు పాటించనందుకు గానూ రూ.1.10 కోట్లు జరిమానా విధించారు. అప్పట్లో దూర ప్రాంతాలు, ముఖ్యమైన మార్గాల్లో ప్రయాణించే విమానాల్లో భద్రతాపరమైన నిబంధనలను ఎయిర్ ఇండియా నింబంధనలు పాటించడం లేదని ఆ సంస్థకు చెందిన ఓ ఉద్యోగి డీజీసీఏకు రిపోర్ట్ ఇచ్చాడు. ఆ ఫిర్యాదు మేరకు విచారణ జరిపి.. సదరు ఎయిర్ లైన్స్ సంస్థకు జరిమానా విధించారు. అలానే మరోసారి ఈ ఏడాది మార్చిలో రూ.80 లక్షల జరిమానాను విధించింది. ఆ జరిమానా విధించిన సమయంలో పలు కారణాలను డీజీసీఏ పేర్కొంది. ఫ్లైట్ డ్యూటీ టైమ్ నిబంధనలు, పైలట్లు, సిబ్బందికి సంబంధించిన భద్రతా మార్గదర్శకాలు ఉల్లంఘించినందుకు జరిమానా విధించింది.
తాజాగా అర్హత లేని వారితో విమానాలు నడిపిస్తున్నారని జరిమానా విధించడనట్లు డీజీసీఏ పేర్కొంది. ఈసారి ఏకంగా 98 లక్షల రూపాయలను జరిమానాగా విధించింది. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు జరగకుండా జాగ్రత్త వహించాలని సంబంధిత పైలట్‌ని డీజీసీఏ హెచ్చరించింది. ఎయిర్ ఇండియా లిమిటెడ్ నాన్-లైన్-రిలీజ్డ్ ఫస్ట్ ఆఫీసర్‌తో జతగా నాన్-ట్రైనర్ లైన్ కెప్టెన్ నేతృత్వంలోని విమానాన్ని నడిపిందని ప్రకటనలో తెలిపింది. మొత్తంగా అర్హతలేని వారితో విమానం నడపినట్లు తమ రిపోర్ట్ లో తేలిందని పేర్కొంది. జూలై 10న ఎయిర్ ఇండియా సమర్పించిన నివేదిక ద్వారా ఈ ఘటన డీజీసీఏ దృష్టికి వచ్చిందని రెగ్యులేటర్ తెలిపింది. దీని తరువాత, డీజీసీఏ విచారణ చేపట్టింది. ఈ క్రమంలోనే అనేక పోస్ట్ హోల్డర్లు , సిబ్బంది ద్వారా నియంత్రణ నిబంధనలకు లోపాలు, బహుళ ఉల్లంఘనలు ఉన్నాయని అథారిటీ గుర్తించింది. మరి..ఎయిర్ ఇండియాకు జరిమానా విధించిన ఘటనపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.