Tirupathi Rao
కారు అనగానే లగ్జరీ కంటే కూడా బడ్జెట్ కార్లవైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తూ ఉంటారు. మరి కొంతమంది కారు మైలేజ్ విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అయితే బడ్జెట్, మైలేజ్ అనగానే అందరికీ మారుతీ సుజుకి కంపెనీనే గుర్తొస్తుంది. ఇప్పుడు వారి రికార్డునే వాళ్లు బద్దలు కొట్టేందుకు సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.
కారు అనగానే లగ్జరీ కంటే కూడా బడ్జెట్ కార్లవైపే ఎక్కువ మంది మొగ్గు చూపిస్తూ ఉంటారు. మరి కొంతమంది కారు మైలేజ్ విషయంపై కూడా ప్రత్యేక శ్రద్ధ చూపిస్తారు. అయితే బడ్జెట్, మైలేజ్ అనగానే అందరికీ మారుతీ సుజుకి కంపెనీనే గుర్తొస్తుంది. ఇప్పుడు వారి రికార్డునే వాళ్లు బద్దలు కొట్టేందుకు సిద్ధమైపోయినట్లు తెలుస్తోంది.
Tirupathi Rao
ప్రస్తుతం కారు అనేది లగ్జరీ కాకుండా.. అవసరం అయిపోయింది. అయితే ఏ కారు కొనాలి? ఎంత బడ్జెట్ లో కొనాలి? అనేది మాత్రం చాలా మందికి తెలియదు. కారు కొనేసమయంలో తెలుసుకోవాల్సిన ముఖ్యమైన విషయాల్లో ఒకటి కారులో ఉండే ఫీచర్స్ ఏంటి? రెండు కారు ఎంత మైలేజ్ ఇస్తుంది? ఈ విషయాల గురించి తెలుసుకున్నాకే నిర్ణయం తీసుకోవాలి. ఇప్పుడు ఈ ప్రశ్నలకు సమాధానంగా ఒక కారు పేరు బాగా వినిపిస్తోంది. అది మరేదో కాదు.. మారుతి సుజుకి స్విఫ్ట్ నాలుగో జెనరేషన్ మోడల్. ఫీచర్లు మాత్రమే కాదు.. మైలేజ్ విషయంలో కూడా ఈ కారుకే ఓట్లు పడుతున్నాయి.
బడ్జెట్ కార్లలో మారుతి సుజుకి స్విఫ్ట్ మోడల్ కు చాలా మంచి క్రేజ్, వినియోగదారుల ఆదరణ ఉంది. అయితే ఎంత ఉన్నా కూడా ఈ కారుపై కాస్త వెనకడుగు వేసేందుకు కొన్ని పాయింట్లు ఉన్నాయి. అవేంటంటే.. ఫీచర్లు, సేఫ్టీకి సంబంధించి వినియోగదారులు కాస్త వెనక్కి తగ్గుతూ ఉంటారి. కానీ, రాబోతున్న నాలుగో జనరేషన్ స్విఫ్ట్ లో మాత్రం ఆ లోటు కూడా ఉండదు అని చెబుతున్నారు. ప్రస్తుతం మార్కెట్ లో మారుతి సుజుకీ మూడో తరం స్విఫ్ట్ కారు అందుబాటులో ఉంది. తాజాగా జపాన్ లో జరుగుతున్న ఆటో మొబిలిటీ షోలో స్విఫ్ట్ నాలుగో జనరేషన్ మోడల్ కారుని ఆవిష్కరించారు. స్విఫ్ట్ నాలుగో జనరేషన్ కారు ఈ తరహాలో ఉండబోతోంది అంటూ మోడల్ ని చూపించారు. ప్రొడక్షన్ కు సిద్ధం చేసిన మోడల్ అంటూ ఈ కారుని చూపించారు.
ఈ మోడల్ స్విఫ్ట్ ని.. ఆసియా, యూరప్ లో పరీక్షించనున్నారు. ఈ మోడల్, వినిపిస్తున్న ఫీచర్లకు సంబంధించి ఆటో మొబైల్ రంగంలో అందరూ నోరెళ్లబెడుతున్నారు. నాలుగో జనరేషన్ మారుతి సుజుకి స్విఫ్ట్ డిజైన్ పరంగా మెరుగైన లుక్స్ రాబోతోంది అనిపిస్తోంది. ప్రస్తుత ప్రదర్శించిన డిజైన్ చూస్తే కాస్త గ్రాండ్ వితారా పోలికలు కనిపిస్తూ ఉంటాయి. ఈ హ్యాచ్ బ్యాక్ మోడల్ లో ఎదురు గ్రిల్, బంపర్, బ్యాక్ సైడ్ డిజైన్ ని కూడా మార్పులు చేసినట్లు కనిపిస్తోంది. ఇంక సేఫ్టీ పరంగా కూడా మెరుగైన మార్పులు తీసుకొస్తున్నట్లు చెబుతున్నారు. మల్టిబుల్ ఎయిర్ బ్యాగ్స్ ఈ మోడల్ లో ఉండబోతున్నాయి. స్టైలిష్ LED హెడ్ ల్యాంప్, డైటైమ్ రన్నింగ్ లైట్స్ ఉంటాయి.
డ్యాష్ బోర్డుని కూడా మరింతి స్టైలిష్ లుక్ లో తీసుకురాబోతున్నారు. ఇన్ఫైటైన్మెంట్ కూడా ఆకట్టుకునే విధంగా ఉండబోతోంది. 9 అంగుళాల టచ్ స్క్రీన్, సెమీ డిజిటల్ ఇన్ స్ట్రుమెంట్ క్లస్టర్, పుష్ బటన్ ఆన్/ఆఫ్ విధానం ఉంటుందని చెబుతున్నారు. క్రూయిజ్ కంట్రోల్, ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్ కూడా ఉంటుందని చెబుతున్నారు. అలాగే ఏబీఎస్, ఈబీడీ, హిల్ హోల్డ్ కంట్రోల్, అడ్వాన్స్డ్ డ్రైవర్ అసిస్టెన్స్ సిస్టమ్ ఫీచర్స్ కూడా ఉండే ఆస్కారం ఉంటుందని చెబుతున్నారు. ఈ మోడల్ 2024 ఏడాది మిడిల్ ఇయర్ లో రిలీజ్ అయ్యే అవకాశం కనిపిస్తోంది. డిజైన్ విడుదల విషయంపై మాత్రం మారుతి సుజుకి అధికారికంగా ప్రకటన చేయాల్సి ఉంటుంది. మరి.. మారుతి సుజుకి నాలుగో జనరేషన్ మోడల్, వినిపిస్తున్న ఫీచర్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.
We’re at the Japan Mobility Show in Tokyo, Japan with @Suzuki_ZA checking out their new Suzuki Swift Concept. It’s set to bring excitement in the automotive space.#japan #japanmobilityshow #suzuki #suzukiswift #jdm #jdmcars #swiftconcept #suzukijapantour23 #lovejapan #Concept pic.twitter.com/ms4XUPAkrq
— AutoTrader (@AutoTraderSA) October 25, 2023