iDreamPost
android-app
ios-app

దీపావళికి ముందే రానున్న రిలయన్స్- SBI క్రెడిట్ కార్డులు!

ప్రతి దీపావళికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా రిలయన్స్ సంస్థ అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీపావళికి ముందే తమ క్రెడిట్ కార్డులను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ప్రతి దీపావళికి రిలయన్స్ ఇండస్ట్రీస్ ఏదో ఒక సరికొత్త నిర్ణయం తీసుకుంటూనే ఉంటుంది. ఈ ఏడాది కూడా రిలయన్స్ సంస్థ అలాంటి ఒక నిర్ణయాన్ని తీసుకుంది. దీపావళికి ముందే తమ క్రెడిట్ కార్డులను తీసుకురావాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

దీపావళికి ముందే రానున్న రిలయన్స్- SBI క్రెడిట్ కార్డులు!

ప్రతి దీపావళికి రిలయన్స్ సంస్థ ఏదొక కొత్త నిర్ణయం తీసుకుంటూనే ఉంటుంది. ఈ దీపావళి పర్వదినాన్ని పురస్కరించుకుని ఎస్బీఐ బ్యాంకుతో సంయుక్తంగా క్రెడిట్ కార్డును తీసుకురాబోతున్నట్లు సమాచారం. అయితే దీపావళికి ముందే ఈ క్రెడిట్ కార్డులను తీసుకురాబోతున్నట్లు తెలుస్తోంది. మొత్తం రెండు రకాల కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను విడుదల చేయనున్నారు. వీటిలో ఇంకో విశేషం ఏంటంటే.. వీటిని వందశాతం రీసైకిల్ ప్లాస్టిక్ తో తయారు చేస్తున్నారు. మరి.. ఈ క్రెడిట్ కార్డుల ప్రయోజనాలు ఏంటో చూద్దాం.

ప్రస్తుతం క్రెడిట్ కార్డుల వాడకం బాగా పెరిగిపోయింది. కొన్ని సంస్థలు బ్యాంకులతో కలిసి కో బ్రాండెడ్ క్రెడిట్ కార్డులను తయాలు చేయడం కూడా పరిపాటిగా మారిపోయింది. ఈ నేపథ్యంలోనే రిలయన్స్ సంస్థ ఎస్బీఐ బ్యాంకుతో కలిసి సంయుక్తంగా క్రెడిట్ కార్డులను తీసుకురానుంది. ఇందులో రెండు రకాల క్రెడిట్ కార్డులను తీసుకొస్తున్నారు. రిలయన్స్ ఎస్బీఐ కార్డు, రిలయన్స్ ఎస్బీఐ కార్డు ప్రైమ్ ని తీసుకొస్తున్నారు. ఈ క్రెడిట్ కార్డులపై ప్రత్యేక ప్రయోజనాలు ఉంటాయని చెబుతున్నారు. ముఖ్యంగా కిరాణా, ఫార్మా, ఎలక్ట్రానిక్స్ చెల్లింపులపై ఆకర్షణీయ ఆఫర్స్ ఉంటాయంటున్నారు.

రిలయన్స్ ఎస్బీఐ కార్డ్ ప్రయోజనాలు చూస్తే.. ఈ కార్డుకు మీరు ఏడాదికి రూ.499 ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఒకవేళ ఏడాదిలో రూ.లక్షకు పైగా ఖర్చు చేస్తే వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ కార్డు ద్వారా మీరు చేసే కొనుగోళ్లపై ప్రతి రూ.100కి 1 రివార్డ్ పాయింట్ వస్తుంది. అయితే ఫ్యూయల్, రెంట్, వాలెట్ అప్ లోడ్ పై రివార్డు పాయింట్లు ఉండవు. జానియింగ్ ఫీజు చెల్లింపుపై రూ.500 విలువైన రిలయన్స్ రిటైల్ వోచర్ ని అందిస్తున్నారు. మీరు ఈ రిలయన్స్ ఎస్బీఐ కార్డు ద్వారా రిలయన్స్ రిటైల్ స్టోర్స్, డైనింగ్, సినిమాలపై ఖర్చు చేస్తో ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు లభిస్తాయి. అన్ని పెట్రోల్ బంక్స్ లో 1 శాతం ఫ్యూయల్ సర్ ఛార్జ్ మినహాయింపు కూడా ఉంటుంది. రూ.3,200 విలువైన రిలయన్స్ రిటైల్ స్టోర్ ల నుంచి డిస్కౌంట్ వోచర్స్ కూడా లభిస్తాయి.

Ambani credit card details

ఇంక రిలయన్స్ ఎస్బీఐ ప్రైమ్ కార్డును తీసుకోవడం వల్ల కలిగే ప్రయోజనాలు చూస్తే.. ఈ కార్డుకు వార్షిక రుసుము రూ.2,999గా ఉంది. మీరు ఏడాదిలో రూ.3 లక్షలకు పైగా లావాదేవీలు చేస్తే.. వార్షిక రుసుము చెల్లించాల్సిన అవసరం ఉండదు. ఈ కార్డుతో రిలయన్స్ రిటైల్ స్టోర్లలో చేసే చెల్లింపులపై ప్రతి రూ.100కి 10 రివార్డు పాయింట్లు లభిస్తాయి. సినిమా, డైనింగ్, డొమెస్టిక్ ఫ్లైట్స్, ఇంటర్నేషనల్ ఎక్స్ పెండేచర్ పై ప్రతి రూ.100కి 5 రివార్డు పాయింట్లు అందుతాయి. రెంట్, ఫ్యూయల్, వాలెట్ అప్ లోడ్ మినహా ఇతర రిటైల్ చెల్లింపులకు ప్రతి రూ.100కి 2 రివార్డు పాయింట్లు అందుతాయి. అన్ని పెట్రోల్ బంక్స్ చెల్లింపులపై 1 శాతం ఫ్యూయల్ సర్ ఛార్జ్ మినహాయింపు ఉంటుంది. బుక్ మై షోలో నెలకు రూ.250 విలువైన ఒక టికెట్ పొందవచ్చు. జాయినింగ్ ఫీజు చెల్లించిన తర్వాత రూ.3 వేల విలువైన డిస్కౌంట్ వోచర్స్ లభిస్తాయి.