iDreamPost
android-app
ios-app

పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వందల్లో పెట్టుబడితో లక్షల్లోఆదాయం!

Post Office Recurring: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో తపాల శాఖ ఒకటి. ఈ వ్యవస్థ కూడా అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా మంచి లాభాలు పొందే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.

Post Office Recurring: కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో తపాల శాఖ ఒకటి. ఈ వ్యవస్థ కూడా అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా మంచి లాభాలు పొందే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి.

పోస్టాఫీస్ ఖాతాదారులకు గుడ్ న్యూస్.. వందల్లో పెట్టుబడితో లక్షల్లోఆదాయం!

నేటికాలంలో డబ్బుకు ప్రాధాన్యత బాగా పెరిగిపోతుదిం. ఇలా ధనంకి డిమాండ్ పెరుగుతున్నా కొద్దీ ఆదాయ మార్గాల కోసం వెతకడం కూడా ఎక్కువైతుంది. ఈ క్రమంలోనే కొందరు సెకండ్ ఇన్ కమ్  కోసం పార్ట్ టైమ్ జాబ్ కూడా చేస్తున్నారు. మరికొంత మంది ఉన్నడబ్బును వివిధ రూపాల్లో ఇన్వెస్ట్ చేసి..లాభాలను పొందాలని చూస్తున్నారు. ఇలా పెట్టుబడి పెట్టేందుకు అనేక రకాల అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. చాలా మంది అనేక రకాల వాటిల్లో పెట్టుబడులు పెడుతుంటారు. అయితే భద్రతతో కూడిన గ్యారంటీ రిటర్స్న్ పొందాలనుకుంటే మాత్రం ప్రభుత్వానికి చెందిన పథకాలే బెస్టని నిపుణులు అంటున్నారు. ఈ క్రమంలోనే పోస్టాఫీస్ కస్టమర్లకు ఓ గుడ్ న్యూస్ వచ్చింది. వందల్లో పెట్టుబడితో లక్షల్లో ఆదాయం వస్తుంది. మరి.… ఆస్కీమ్ ఏమిటి, ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..

కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో అనేక రకాల వ్యవస్థలు ఉన్నాయి. అలాంటి వాటిల్లో తపాల శాఖ ఒకటి. గతంలో కేవలం సమాచారం మార్పిడి చేసేందుకు మాత్రం ఈ వ్యవస్థ ఉపయోగపడేది. అయితే ఇటీవల కాలంలో కాలంలో జరుగుతున్న మార్పులు కారణంగా బ్యాంకులకు ధీటుగా, తపాల శాఖ కూడా అనేక రకాల సేవలు అందిస్తున్నాయి. ఈ వ్యవస్థ ద్వారా మంచి లాభాలు పొందే స్కీమ్స్ అందుబాటులో ఉన్నాయి. ఈ క్రమంలోనే కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఈపోస్ట్ బ్యాంక్, బ్యాలెన్స్ ఖాతాను తెరవడం నుండి ఆర్థిక పెట్టుబడులు పెట్టడం వరకు చాలా పథకాలను కలిగి ఉంది. ఇటీవలే ఆర్థిక మంత్రి.. పోస్టాఫీసులో ఉన్న పథకాల వడ్డీ రేటును పెంచింది. 2024-2025 సంవత్సరంలో, ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రజలకు ప్రయోజనం చేకూర్చడానికి పోస్ట్ ఆఫీస్ రికవరీ డిపాజిట్ అనే స్కీమ్ పై వడ్డీ రేటును పెంచారు. పోస్టాఫీసుల ద్వారా ఎక్కవగా పేద, మధ్యతరగతి వారే లబ్ధిపొందుతున్నారు కాబట్టి ప్రస్తుత వడ్డీ రేటు పెరగడం అనేది ఖాతాదారులకు గుడ్ న్యూస్ అనే చెప్పాలి.

పోస్టాఫీస్ అందిస్తున్న స్కీమ్స్ లో పోస్ట్ ఆఫీస్ రికవరీ డిపాజిట్ పథకం ఒకటి. దీనిలో రూ.100 నుంచి గరిష్టంగా లక్షల వరకు ఇన్వేస్ట్ చేసుకోవచ్చు. ఇటీవల సవరించిన ప్రకారం.. ఈ స్కీమ్ లోని డిపాజిట్లకు 7.5 శాతం వడ్డీ అందించనున్నారు. భారతీయ పౌరుడైన ఎవరైనా ఈ పథకం కింద అకౌంట్ తెరవవచ్చు. రూ.100 కంటే ఎక్కువ మొత్తాన్ని డిపాజిట్ చేస్తే, పథకం మెచ్యూరిటీ వ్యవధి 5 ​​సంవత్సరాలు వరకు ఉంటుంది. ఈ ఐదేళ్లు పూర్తైన పొదుపు మరియు పొదుపుపై ​​వడ్డీ 7.5 శాతం వడ్డీ రేటుతో కలిసి వస్తాయి. ఏదైనా అనివార్య పరిస్థితుల్లో, ఏదైనా నెల చెల్లింపు సాధ్యం కాకపోతే, జరిమానా చెల్లించడం ద్వారా అకౌంట్ నుయాక్టివ్‌గా ఉంచవచ్చు.

అయితే ఇలా కాడ కేవలం ఆరు నెలల వరకు మాత్రమే ఉంటుంది. ఆ తరువాత ఖాతాను రుద్దు చేయబడుతుంది. 30 సంవత్సరాలు పూర్తయిన తర్వాత మీరు ఎప్పుడైనా మీ ఖాతాను రద్దు చేయవచ్చు. కానీ ఆ సమయంలో లబ్ధిదారుడు పొదుపు ఖాతాపై ఉన్న వడ్డీ రేటు 4 శాతం మాత్రమే పొందుతారు. ఇతర స్కీమ్స్ మాదిరిగానే, లబ్ధిదారుడు మరణిస్తే..ఆ మొత్తం నామినీ చేరుతాయి. ఉదాహరణకు మీరు ప్రతి నెలా రూ.840 పెట్టుబడి పెడితే,  ఏడాదికి రూ.10,080 అవుతుంది. దీని ప్రకారం 5 సంవత్సరాలకు రూ.50,400. అప్పుడు మెచ్యూరిటీ సమయంలో 7.5శాతం వడ్డీతో మొత్తం రూ.72,665 పొందవచ్చు. ఇక ఈస్కీమ్ గురించి మరింత సమాచారం తెలుసుకునేందుకు మీ సమీపంలో ఉన్న పోస్టాఫీస్ లో కనుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి