iDreamPost

Iphone 15: మార్కెట్‌లోకి వచ్చిన గంటల్లోనే కంప్లైంట్ల వెల్లువ!

Iphone 15: మార్కెట్‌లోకి వచ్చిన గంటల్లోనే కంప్లైంట్ల వెల్లువ!

యాపిల్‌ ఐఫోన్‌ లవర్స్‌ ఎంతగానో ఎదురు చూసిన ఐ ఫోన్‌ 15 మార్కెట్‌లోకి వచ్చింది. దేశ వ్యాప్తంగా ఐఫోన్‌ 15 అమ్మకాలు మొదలయ్యాయి. జనం పెద్ద సంఖ్యలో పోటీ మరీ ఈ ఫోన్లను కొన్నారు. అయితే, ఐఫోన్‌ 15 నాణ్యత విషయంలో కస్టమర్లు నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో అమ్మకాలు మొదలైన కొన్ని గంటల్లోనే కంప్లైంట్ల వెల్లువ మొదలైంది. తాము కొన్న ఐఫోన్‌ 15 ప్రో, ఐఫోన్‌ 15 ప్రో మ్యాక్స్‌లలో నాణ్యతా లోపాలు ఉన్నాయంటూ సోషల్‌ మీడియా వేదికగా అసహనం వ్యక్తం చేస్తున్నారు.

మజిన్‌ బూ అనే ట్విటర్‌ ఖాతాదారుడు పెట్టిన పోస్టు ఈవిధంగా ఉంది.. ‘‘ ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌లోని కొన్ని ఫోన్లు నాణ్యతా లోపంతో ఉన్నట్లు కనిపిస్తోంది. ఫోన్‌ కలరింగ్‌లో లోపాలున్నాయి. ఫోన్‌ స్క్రీన్‌ను అంచులతో సరైన విధంగా కలపలేదు’’ అని పేర్కొన్నాడు. మరో ఐఫోన్‌ కస్టమర్‌.. ‘‘నేను మొదటిసారి ఐఫోన్‌ కొన్నాను. అది కూడా ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌. చెయ్యి తగలగానే ఫోన్‌ డిస్‌ కలర్‌ అవుతోంది’’ అని వాపోయాడు. మరో కస్టమర్‌.. ‘‘ ఐఫోన్‌ 15 ప్రో మోడల్‌ నిజంగానే డిస్‌ కలర్‌ అవుతోందా?.

రుద్దటం వల్లో.. దుమ్ము, దూళి కారణంగా అలా అవుతోందని అనుకోవట్లేదు’’ అని రాసుకొచ్చాడు. వీరితో పాటు చాలా మంది తమ సమస్యను ట్విటర్‌ వేదికగా చెప్పుకుని వాపోయారు. ఇక, ఐఫోన్‌ 15 ప్రో మోడల్స్‌ సమస్యపై కంపెనీ స్పందించింది. దుమ్ము, దూళి.. తడి చేతుల్తో ఐఫోన్‌ 15 ప్రో మోడల్స్‌ను వాడటం వల్ల ఈ సమస్య వస్తోందని తెలిపింది. అది తాత్కాలికం మాత్రమేనని వెల్లడించింది. మరి, ఐఫోన్‌ 15 ప్రో మోడల్స్‌ లోపాలున్నాయంటూ వస్తున్న ఫిర్యాదులపై మీ అభిప్రాయాలను కామెంట్ల రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి