iDreamPost
android-app
ios-app

ఈ కార్లపై 3.5 లక్షల వరకు బెనిఫిట్స్.. వచ్చే ఏడాది నుంచి పెరగనున్న ధరలు!

This Company Car Model Prices Will Rise From 2024: ప్రస్తుతం కారు కంపెనీలు పలు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇయర్ ఎండ్ కావడంతో మంచి డిస్కౌంట్స్, బెనిఫిట్స్ ని అందుబాటులో ఉంచాయి. అయితే ఈ కారు కంపెనీ మాత్రం వచ్చే ఏడాది నుంచి రేట్లు పెంచేస్తున్నాం అని చెప్పింది.

This Company Car Model Prices Will Rise From 2024: ప్రస్తుతం కారు కంపెనీలు పలు ఆఫర్లను అందిస్తున్నాయి. ఇయర్ ఎండ్ కావడంతో మంచి డిస్కౌంట్స్, బెనిఫిట్స్ ని అందుబాటులో ఉంచాయి. అయితే ఈ కారు కంపెనీ మాత్రం వచ్చే ఏడాది నుంచి రేట్లు పెంచేస్తున్నాం అని చెప్పింది.

ఈ కార్లపై 3.5 లక్షల వరకు బెనిఫిట్స్.. వచ్చే ఏడాది నుంచి పెరగనున్న ధరలు!

సాధారణంగా కారు కొనే సమయంలో అందరూ అడిగే ప్రశ్న ధర ఎంత? ఎందుకంటే ఎన్ని ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ ఉన్నా సరే కారు ధర మాత్రం బడ్జెట్లో ఉండాలని భావిస్తారు. అలాగే ఎక్కువ డిస్కౌంట్స్ కూడా కావాలని కోరుకుంటారు. కొన్ని కంపెనీలకు చెందిన కార్లు అయితే మంచి ఫీచర్స్, లుక్స్ కలిగిన కార్లు కాస్త బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ, 2024 నుంచి కొన్ని కార్ల కంపెనీలు వాటి మోడల్స్ పై ధరలను పెంచే యోచనలో ఉన్నాయి. ప్రస్తుతానికి ఆ మోడల్స్ అయితే బడ్జెట్ రేంజ్ లోనే ఉన్నాయి. కానీ, వచ్చే ఏడాది నుంచి మాత్రం ఆ కార్ల ధరలు పెరగనున్నాయి.

ప్రస్తుతం ఈ వార్త సిట్రోఎన్ కంపెనీకి వర్తిస్తుంది. ఈ కారు కంపెనీకి భారత మార్కెట్ లో మంచి రెస్పాన్స్ లభించింది. చక్కని లుక్స్, మంచి స్పెసిఫికేషన్స్ తో విడుదలైన సిట్రోఎన్ కార్లకు వినియోగదారుల నుంచి మంచి ఆదరణ దక్కింది. తాజాగా సిట్రోఎన్ కంపెనీ ఒక ఛేదు వార్తను చెప్పింది. వచ్చే ఏడాది నుంచి భారత్ లో తమ అన్ని మోడల్స్ ధరలు పెంచనున్నామని వెల్లడించింది. అన్ని మోడల్స్ పై 2.5 శాతం నుంచి 3 శాతం వరకు ధరలను పెంచనున్నట్లు తెలియజేశారు. ప్రస్తుతం సిట్రోఎన్ కంపెనీ నుంచి భారత విపణిలో సీ3, ఇ-సీ3, సీ3 ఎయిర్ క్రాస్, సీ5 ఎయిర్ క్రాస్ మోడల్స్ అందుబాటులో ఉన్నాయి. అంతేకాకుండా మీరు డిసెంబర్ లోపే ఈ కారును కొనుగోలు చేస్తే మీకు అదనపు లాభాలు కూడా ఉన్నాయి. అవేంటంటే.. ఈ కంపెనీ తమ కార్లపై రూ.3.5 లక్షల వరకు ఆఫర్స్ ప్రకటిచింది. సిట్రోఎన్ సీ3 ఎయిర్ క్రాస్ పై రూ.1.5 లక్షల వరకు, సీ3పై రూ.99 వేల వరకు, సిట్రోఎన్ సీ5 ఎయిర్ క్రాస్ పై రూ.3.5 లక్షల వరకు బెనిఫిట్స్ ని అందిస్తోంది. ఇండియాలో సిట్రోఎన్ కంపెనీ నుంచి సీ3 మోడల్ కి మంచి క్రేజ్ ఉంది. ఈ కారును కొనేందుకు చాలా మంది ఇష్టపడుతున్నారు. అలాగే ఈ కారు బడ్జెట్ రేంజ్ లోనే ఉంటుంది.

సీ3 ప్రైస్- ఫీచర్స్:

ఈ సిట్రోఎన్ సీ3 కారు ఫీచర్స్, ధర విషయానికి వస్తే.. ఇది హైదరాబాద్ లో రూ.7.41 లక్షల ఆన్ రోడ్ ప్రైస్ తో అందుబాటులో ఉంది. ఇందులో మొత్తం 13 వేరియంట్స్ ఉన్నాయి. వేరియంట్ మారే కొద్దీ ఫీచర్స్ పెరగడమే కాకుండా.. ధర కూడా పెరుగుతుంది. ఈ సీ3 టాప్ మోడల్ ఆన్ రోడ్ ధర రూ.10.66 లక్షలుగా ఉంది. ఇది 1199 సీసీ 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇందులో కేవలం పెట్రోల్ ఆప్షన్ మాత్రమే ఉంది. అలాగే ఓన్లీ మాన్యువల్ ట్రాన్సిషన్ తోనే అందుబాటులో ఉంది. ఇంక మైలేజ్ విషయానికి వస్తే.. లీటరుకు 19.3 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఈ కారులో గ్రౌండ్ క్లియరెన్స్ కూడా చాలా బాగుంటుంది.

అలాగే ఇంజిన్ కూడా ఎంతో స్మూత్ పర్ఫార్మెన్స్ ని అందిస్తుంది. మంచి హెడ్ రూమ్- లెగ్ రూమ్, సీట్ కుషన్, థై సపోర్ట్ తో ఈ కారు ఉంటుంది. ఈ కారులో ఉండే ఇంకో క్రేజీ ఫీచర్ ఏంటంటే.. ఫ్రంట్ సీట్ కంటే కూడా రేర్ సీట్ థియేటర్ స్టైల్ లో కాస్త ఎత్తుగా ఉంటుంది. అయితే దీనిలో ఎక్కువ ఫ్యూయల్- ట్రాన్సిషన్స్ కి సంబంధించి ఆప్షన్స్ లేకపోవడం ఈ కారులో మైనస్ గా చెప్పచు. ప్రస్తుతం డిసెంబర్ 2023 వరకు అయితే ఈ కారుపై రూ.99 వేల వరకు బెనిఫిట్స్ ఉన్నాయి. ఆ తర్వాత కొత్త ఏడాది నుంచి సిట్రోఎన్ కంపెనీ కార్ల ధర 2.5 శాతం నుంచి 3 శాతం వరకు పెరగనున్నాయి. మరి.. సిట్రోఎన్ కార్లపై మీ అభిప్రాయాలు కామెంట్స్ రూపంలో తెలియజేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి