iDreamPost
android-app
ios-app

చైనాపై భారత్ దీపావళి బాంబ్.. డ్రాగన్ దేశానికి రూ.50000 కోట్లు నష్టం!

  • Published Nov 10, 2023 | 5:32 PM Updated Updated Nov 10, 2023 | 5:32 PM

దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి.. టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకుంటారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థోమతను బట్టి వాళ్లు దీపావళి పండుగ జరుపుకుంటారు.

దీపావళి వచ్చిందంటే చాలు ప్రతి ఇంట్లో దీపాలు వెలిగించి.. టపాసులు కాల్చుతూ సంబరాలు జరుపుకుంటారు. పేద, ధనిక అనే తేడా లేకుండా ఎవరి స్థోమతను బట్టి వాళ్లు దీపావళి పండుగ జరుపుకుంటారు.

చైనాపై భారత్ దీపావళి బాంబ్.. డ్రాగన్ దేశానికి రూ.50000 కోట్లు నష్టం!

భారత దేశంలో దీపావళి పండుగను హిందువులు, జైనులు, సిక్కులు ఇతర నేవార్ బౌద్దులు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. నరకాసురుడు అనే రాక్షసుడిని సంహరించి.. విజయానికి గుర్తుగా ఆనందంలో ప్రజలు దీపావళి పండుగ జరుపుకుంటారని పురాణాలు చెబుతున్నాయి. అందరూ ఆనందంతో ఉత్సాహంగా జాతి, కుల, మత, వర్గ విభేదాలు విస్మరించి సమైక్యంగా జరుపుకునే పండుగ దీపావళి. చెడుపై మంచి గెలిచినందుకు ఆ రోజు దీపాలు వెలిగిస్తారు.. కోట్ల మంది భారతీయులు దీపావళి పండుగ జరుపుకుంటారు. తెలుగు రాష్ట్రాల్లో దీపావళి పండుగ సందర్భంగా బంధువులను ఇంటికి ఆహ్వానించి నోముకుంటారు. సాధారణంగా దీపావళి పండుగ ప్రత్యేకంగా దేశీయ మార్కెట్ లో భారీ స్థాయిలో బిజినెస్ జరుగుతుంది. దీపావళి పండుగ సందర్భంగా చాలా మంది కొత్త వాహనాలు, బంగారం, నిత్యావసర వస్తువులు కొనుగోలు చేస్తుంటారు. ఇక దీపావళి అనగానే వెంటనే గుర్తుకు వచ్చేది టపాసులు. ప్రతిఏడాది టపాసుల బిజినెస్ కోట్లలో జరుగుతుంది. ఈసారి భారత్ తీసుకున్న నిర్ణయంతో చైనాకు వేల కోట్ల నష్టం వాటిల్లుతుందని అంటున్నారు. వివరాల్లోకి వెళితే..

దీపావళి అనగానే చిన్నా పెద్దా అనే తేడా లేకుండా ప్రతి ఒక్కరూ టపాసులు పేల్చేందుకు ఉత్సాహం చూపిస్తుంటారు. రాత్రి వేల ఇళ్లంతా దీపాలతో అలంకరించిన తర్వాత టపాసులు పేల్చుతూ సంతోషంలో మునిగిపోతుంటారు. తమిళనాడులోని శివ కాశీలో ఎక్కువగా క్రాకర్స్ తయారు చేసే పరిశ్రమలు ఉన్నాయి. ఇక్కడ నుంచి దేశంలో వివిధ ప్రాంతాలకు క్రాకర్స్ సప్లై చేస్తుంటారు. అయితే గతంలో చైనా నుంచి క్రాకర్స్ ఎక్కువగా దిగుమతి చేసుకున్నేవాళ్లు. ఇది కాస్త స్వదేశీ వ్యాపారులపై భారీ ప్రభావం చూపించేది. దీంతో చైనా వస్తువులను భారత దేశంలోకి దిగుమతి చేయకూడదు అన్న నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. దీంతో చైనాకు ఏకంగా రూ.50,000 కోట్ల వరకు వ్యాపార నష్టం కలుగుతుందని కాన్ఫెడరేషన్ ఆఫ్ ఆల్ ఇండియా ట్రేడరర్స్ (సీఏఐటీ) తెలిపింది.

గత సంవత్సరం మాదిరిగానే ఈ సంవత్సరం కూడా చైనా ఉత్పత్తులను బహిష్కరణకు సీఏఐటీ పిలుపునివ్వడంతో దీపావళి పండుగ సందర్భంగా చైనా ఉత్పత్తుల దిగుమతులు భారీగా తగ్గిపోయాయి. ఈ క్రమంలోనే స్వదేశీ ఉత్పత్తులు వినియోగం భారీగా పెంచడానికి ‘సీఏఐటీ’ కీల్ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. ‘ఆత్మనిర్భర్ భారత్’ లో భాగాంగానే ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్లు సీఏఐటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్ ఖండేల్వాల్ తెలిపారు. సాధారణంగా దీపావళి పండుగ సందర్భంగా దేశ వ్యాప్తంగా వినియోగదారులు సుమాను రెండు లక్షల కోట్లు ఖర్చు చేసే అవకాశం ఉందని.. ఈ సమయంలో దేశీయ ఉత్పత్తులను ప్రోత్సహించడానికి చైనా ఉత్పత్తుల దిగుమతి నిలిపివేస్తున్నట్లు నిర్ణయం తీసుకున్నామని అంటున్నారు.

దేశ వ్యాప్తంగా ప్రధాన నగరాలైన ముంబై, ఢిల్లీ, ఛండీగఢ్, భువనేశ్వర్, కోల్‌కొతా, రాంచి, లక్నో, గౌహతి, పాట్నా, చెన్నై, హైదరాబాద్, మధురై, బెంగుళూరు, పాండిచ్చేరి మొదలైన ప్రాంతాల్లోని వినియోగదారులు చైనా వస్తువుల కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపించడం లేదని, భారతీయ వస్తువులు కొనుగోలు చేయడానికి సుముఖత చూపిస్తున్నారని తెలుస్తుంది. ప్రతి ఏడాది దీపావళి పండుగ సీజన్ లో భారతీ వ్యాపారులు చైనా నుంచి దాదాపు రూ.70,000 కోట్ల విలువైన వస్తువులను దిగుమతి చేసుకుంటారు. ఇటీవల భారత్ తీసుకుంటున్న నిర్ణయం తో చైనా.. రాఖీ పండుగ సందర్భంగ రూ.5వేల కోట్లు, వినాయక చవితి సందర్భంగా రూ.500 కోట్ల వరకు నష్టాన్ని చవిచూడాల్సి వచ్చిందని అంటున్నారు. కొంతకాలంగా ‘ఆత్మనిర్భర్ భారత్’లో భాగంగా స్వదేశీ వస్తువుల వినియోగం బాగా పెరిగిపోయింది.