Swetha
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. పైగా అక్షయతృతీయ దగ్గరలోనే ఉంది కాబట్టి.. బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
గత రెండు రోజుల నుంచి బంగారం ధరలు దిగి వస్తున్నాయి. పైగా అక్షయతృతీయ దగ్గరలోనే ఉంది కాబట్టి.. బంగారం కొనుగోలు చేయాలనీ అనుకునే వారికి ఇదొక మంచి అవకాశం. దీనికి సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.
Swetha
బంగారం ధరలు ఎప్పుడు ఎలా ఉంటున్నాయి తెలియని పరిస్థితులు ఏర్పడుతున్నాయి. నిన్న మొన్నటి వరకు ఆకాశాన్ని తాకిన పసిడి ధరలు.. గత రెండు రోజులుగా మాత్రం దిగి వస్తున్నాయి. ప్రస్తుతం అక్షయత్రుతియ రాబోతుంది కాబట్టి.. ఇప్పుడు వరుసగా రెండవ రోజు కూడా పసిడి ధరలు తగ్గుముఖం పట్టాయి. దీనితో బంగారం కొనుగోలు చేసేవారికి ఇదొక అద్బుతమైన వార్త అని చెప్పి తీరాలి. పైగా అక్షయ తృతీయ రోజున ఎంతో కొంతైన బంగారం కొనాలని అందరు ఆశపడుతూ ఉంటారు. దీనితో సరిగ్గా ఇదే సమయంలో బంగారం ధరలు తగ్గుముఖం పట్టడంతో.. అందరి అడుగులు బంగారం షాపుల దిశగా పడుతున్నాయి. మరి ప్రస్తుతం బంగారం ధరలు ఎలా ఉన్నాయో దానికి సంబంధించిన పూర్తి విషయాలను చూసేద్దాం.
ఇక తగ్గిన బంగారం ధరల విషయానికొస్తే.. 22 క్యారెట్స్ బంగారం ధరలు.. నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు.. రూ.1000 తగ్గింది. ఇక దానిని బట్టి దేశంలోని వివిధ నగరాల్లో తగ్గిన 10 గ్రాముల పసిడి రిటైల్ ధరలను చూసినట్లయితే.. చెన్నైలో రూ.66,150, ముంబైలో రూ.66,150, ఢిల్లీలో రూ.66,300, కలకత్తాలో రూ.66,150, బెంగళూరులో రూ.66,150, కేరళలో రూ.66,150, వడోదరలో రూ.66,200, జైపూరులో రూ.66,300, నాశిక్ లో రూ.66,180, అయోధ్యలో రూ.66,300, బళ్లారిలో రూ.66,150, గురుగ్రాములో రూ.66,300, నోయిడాలో రూ.66,300 వద్ద ప్రస్తుతం బంగారం ధరలు కొనసాగుతున్నాయి.
ఇక 24 క్యారెట్ల బంగారం ధర విషయానికొస్తే.. నిన్నటితో పోల్చితే 100 గ్రాములకు.. రూ.1,100 తగ్గింది. దానిని బట్టి చూసినట్లయితే.. చెన్నైలో రూ.72,160, ముంబైలో రూ.72,160, ఢిల్లీలో రూ.72,310, కలకత్తాలో రూ.72,160, బెంగళూరులో రూ.72,160, కేరళలో రూ.72,160, వడోదరలో రూ.72,210, జైపూరులో రూ.72,310, నాశిక్ లో రూ.72,190, అయోధ్యలో రూ.72,310, బళ్లారిలో రూ.72,160, గురుగ్రాములో రూ.72,310, నోయిడాలో రూ.72,310 వద్ద ప్రస్తుతం బంగారం ధరలు కొనసాగుతున్నాయి. ఇక రెండు తెలుగు రాష్ట్రాలలోని.. ప్రధాన పట్టణాలలైన విజయవాడ, గుంటూరు, కాకినాడ, తిరుపతి, నెల్లూరు, అనంతపురం, గుంటూరు, కడప, విశాఖ, హైదరాబాద్, ఖమ్మం, కరీంనగర్, నిజాంబాద్, వరంగల్ నగరాల్లో 22 క్యారెట్ల పసిడి నేటి ధర రూ.66,150 వద్ద కొనసాగుతుండగా.. 24 క్యారెట్ల ధర రూ.72,160 వద్ద కొనసాగుతోంది. కాబట్టి బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. మరి ఈ విషయంపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.