iDreamPost
android-app
ios-app

మాల్స్ లో మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన పనిలేదు.. కేంద్రం ట్వీట్!

Customers No Need Give Mobile Number at Malls: షాపులో బిల్ కట్టేప్పుడు ఫోన్ నెంబర్ అడగడం, ఆ తర్వాతే బిల్ ప్రాసెస్ పూర్తి చేయడం లాంటివి చూస్తున్నాము. ఇకపై అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే..

Customers No Need Give Mobile Number at Malls: షాపులో బిల్ కట్టేప్పుడు ఫోన్ నెంబర్ అడగడం, ఆ తర్వాతే బిల్ ప్రాసెస్ పూర్తి చేయడం లాంటివి చూస్తున్నాము. ఇకపై అటువంటి పరిస్థితి ఎదురయ్యే అవకాశం లేదు. ఎందుకంటే..

మాల్స్ లో మొబైల్ నంబర్ ఇవ్వాల్సిన పనిలేదు.. కేంద్రం ట్వీట్!

నేటికాలంలో షాపింగ్ చేసే వారి సంఖ్య విపరీతంగా పెరిగింది. సూపర్ మార్కెట్, షాపింగ్ మాల్స్ లకు వెళ్లేందుకు జనాలు ఎక్కువ ఆసక్తి చూపిస్తుంటారు. ఇలా షాపింగ్ వెళ్లిన సందర్భంలో అనేక వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇది ఇలా ఉంటే.. బిల్లింగ్ చేసే సమయంలో రిటైలర్ ఫోన్ నెంబర్ ను అడుగుతారు. చాలా మంది తమ ఫోన్ నెంబర్లు ఇస్తుంటారు. మరికొందరు మాత్రం ఇచ్చేందుకు సందేహం వ్యక్తం చేస్తుంటారు.  ఇదే సమయంలో కచ్చితంగా ఇవ్వాలంటూ రిటైలర్స్ చెబుతుంటారు. కానీ ఇలా మాల్స్ లో ఫోన్ నెంబర్ ఇచ్చే విషయంపై కేంద్రం కీలక విషయాలను వెల్లడించింది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం….

పట్టణాల్లో, నగరాల్లో షాపింగ్ చేసే వారి సంఖ్య ఎక్కువగా ఉంది. ఇక వీకెండ్ వస్తే చాలు వివిధ రకాల షాపింగ్స్  చేస్తుంటారు. ఇక తమకు నచ్చిన వస్తువులను కొనుగోలు చేస్తుంటారు. ఇలా ఏదైనా మాల్ కు వెళ్లి షాపింగ్ చేసే బిల్ చెల్లించే సమయంలో కౌంటర్ల దగ్గర మాల్ సిబ్బంది వినియోగదారుల ఫోన్ నెంబర్లు అడుగుతారు.  సూపర్ మార్కెట్, మెడికల్ స్టోర్ వంటి పలు ప్రదేశాలకు వెళ్లినా బిల్లింగ్ టైమ్ లో ఇదే పరిస్థితి ఉంటుంది. ఏవైనా వస్తువులు కొనుగోలు చేసి… బిల్ చెల్లించడానికి ఫోన్ నెంబర్ తో ఏం పని అని అడిగినా అక్కడి సిబ్బంది ఏవేవే కారణాలు చెబుతుంటారు. కొందరు కస్టమర్లు అయితే మొబైల్ నెంబర్ చెప్పేసి, బిల్ పే చేసి వెళ్లిపోతుంటారు.

ఇలా కేవలం మాల్స్, సూపర్ మార్కెట్లోలనే కాదు వాటి బయట కూడా లక్కీ డ్రా పేరుతో జనాల ఫోన్ నెంబర్లు, ఇతర వివరాలను కొందరు సేకరిస్తుంటారు. వీరి చేతుల్లోకి  మన వివరాలు వెళ్తే మోసాలకు దారితీయొచ్చు. ఫోన్ కాల్స్, మెసేజ్​ల ద్వారా అనేక మోసాలు జరుగుతున్న ఘటనలు మనం చూస్తూనే ఉన్నాము. కస్టమర్ల ప్రైవసీకి మరింత భద్రత కల్పించేందుకు కేంద్ర వినియోగదారుల వ్యవహారాల శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఇకపై రిటైల్ దుకాణాల్లో బిల్లు జనరేట్ చేసేటప్పుడు వినియోగదారులు ఫోన్​ నంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదని తెలిపింది.

ఈ రిటైలర్ కు మొబైల్ నంబర్ ఇవ్వనని చెప్పే హక్కు వినియోగదారుకు ఉందని కేంద్రం స్పష్టం చేసింది. ఆ మేరకు అవగాహన కల్పిస్తూ ట్విట్టర్ లో పోస్ట్ చేసింది. కాబట్టి ఇక  నుంచైనా వినియోగాదారులు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి. సూపర్ మార్కెట్, మాల్స్ లేదా ఇతర షాపింగ్ సెంటర్‌, మెడికల్ షాపు వంటి వాటి వద్ద మీరు ఏదైనా కొని, బిల్లు చెల్లించే సమయంలో మీ ఫోన్ నెంబర్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ అక్కడి సిబ్బంది ఫోన్ నెంబర్ ఇవ్వాలని పట్టుబడితే వారికి కేంద్రం చెప్పిన నిబంధనలు  గుర్తు చేయండి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి