Dharani
Ayushman Bharat PMJAY: కేంద్ర ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. దీని వల్ల ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు మేలు జరగనుంది. అది కూడా ప్రతి ఏటా. ఆ వివరాలు..
Ayushman Bharat PMJAY: కేంద్ర ప్రభుత్వం పేదలకు శుభవార్త చెప్పడానికి రెడీ అవుతోంది. దీని వల్ల ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు మేలు జరగనుంది. అది కూడా ప్రతి ఏటా. ఆ వివరాలు..
Dharani
కేంద్రంలో అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ ప్రభుత్వం పేదలు, బడుగు బలహీన వర్గాల ప్రజలను ఆకట్టుకోవడం కోసం అనేక పథకాలు అమలు చేసేందుకు రెడీ అవుతోంది. రానున్న బడ్జెట్ సమావేశాల్లో.. పైన పేర్కొన్న వర్గాల వారి సంక్షేమం కోసం అనేక నిర్ణయాలు తీసుకోనున్నట్లు తెలుస్తోంది. ఇప్పటికే పీఎం కిసాన్ యోజన నిధిని రూ.6 వేల నుంచి 8 వేల రూపాయలకు పెంచనున్నారనే వార్తలు వస్తుండగా.. మరో అంశానికి సంబంధించి కూడా కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుందని.. దీని వల్ల ఒక్కో కుటుంబానికి 10 లక్షల రూపాయల వరకు లబ్ధి చేకూరనుందని తెలుస్తోంది. ఇంతకు మోదీ ప్రభుత్వం తీసుకోబోయే ఆ నిర్ణయం ఏంటి అంటే..
పేదలు, మధ్యతరగతి వారిని ఎక్కువగా భయపెట్టెది వైద్యం ఖర్చు. ప్రభుత్వ ఆస్పత్రులకు వెళ్లలేము.. ప్రైవేటులో బిల్లు కట్టలేము. ఆరోగ్య బీమా అందరికి ఉండదు. దాంతో పేదలు, సామాన్యుల ఆరోగ్యం గాల్లో దీపంలా మారింది. ఈ క్రమంలో కేంద్ర ప్రభుత్వం ప్రతి ఒక్కరికి మెరుగైన వైద్యం అందించడం కోసం కీలక నిర్ణయం తీసుకుంది. దీనిలో భాగంగా ఆరోగ్య బీమా పథకం ఆయుష్మాన్ భారత్ పథకాన్ని తీసుకుని వచ్చింది. దీని ద్వారా కుటుంబానికి ప్రతి ఏటా 5 లక్షల రూపాయల వరకు ఆరోగ్యం బీమా వర్తించనుంది. ఈ క్రమంలో తాజాగా ఈ పథకానికి సంబంధించి కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది.
ఆయుష్మాన్ భారత్ లబ్దిని రెట్టింపు చేయనుంది అని సమాచారం. ఈ పథకం కింద ఇదివరకు ఒక కుటుంబానికి సంవత్సరానికి రూ.5లక్షల బీమా ఉండగా.. ఇప్పుడు దీన్ని రూ.10లక్షలకు పెంచబోతున్నట్లు జాతీయ ఆరోగ్య ప్రాధికార సంస్థ అధికారులు తెలిపారు. అంతేకాక.. ఈ పథకం కోసం అప్లై చేసుకునే లబ్దిదారుల సంఖ్యను కూడా రెట్టింపు చెయ్యాలని కేంద్రం టార్గెట్‌గా పెట్టుకోవడమే కాక మూడేళ్లలో దీన్ని చేరుకోవాలని లక్ష్యంగా పెట్టుకుంది. పథకంలో 70 సంవత్సరాలు దాటిన వారికి ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. వారిని వెంటనే లబ్దిదారులుగా చేర్చుతారు. ఇలాంటి వారు దేశంలో దాదాపు 5 కోట్ల మంది ఉన్నారని అంచనా.
ఆయుష్మాన్ భారత్ పథకం తెచ్చిన ప్రారంభంలో 70 ఏళ్లు దాటిన వారికి ఇది వర్తించేది కాదు. కానీ ఇప్పుడు మార్గదర్శకాలు మార్చామని.. అందువల్ల వారిని కూడా ఈ పథకంలో చేర్చుతున్నానమని రాష్ట్రపతి ద్రౌపది.. పార్లమెంట్ ప్రసంగంలో తెలిపారు. ప్రభుత్వం ఈ పెంపు ప్రతిపాదన నిర్ణయాన్ని ఆమోదిస్తే.. కేంద్రంపై ప్రతి ఏటా రూ.12,076 కోట్ల అదనపు భారం పడుతుంది అంచనా వేస్తున్నారు.
ఈ పథకం కింద అప్లై చేసుకున్నవారికి కేంద్రం ఆయుష్మాన్ కార్డు ఇస్తుంది. ఇది ఆధార్ కార్డు లాగా ఉంటుంది. ఈ స్కీమ్ లబ్దిదారుల కుటుంబం ఆస్పత్రికి వెళ్లి.. సంవత్సర కాలంలో 10 లక్షల రూపాయల వరకూ ఉచిత వైద్యం పొందగలరు. 2021లో నీతి ఆయోగ్ ఇచ్చిన నివేదికలో 30 శాతం మందికి పైగా మధ్య తరగతి ప్రజలు ఆరోగ్య బీమాకు దూరంగా ఉన్నట్లు తెలిపింది. వీరందరూ కవర్ అయ్యేలా ఆయుష్మాన్ భారత్‌ను విస్తరించాలని సూచించింది. అందుకే కేంద్రం లబ్దిని రెట్టింపు చెయ్యాలని భావిస్తోంది.దీనిపై బడ్జెట్‌లో కీలక ప్రకటన వస్తుందనే అంచనా ఉంది. ఇదే జరిగితే వైద్యం విషయంలో జనాలకు భారీ ఊరట లభించనుంది అని చెప్పవచ్చు.