iDreamPost
android-app
ios-app

ఈ పథకం గురించి మీకు తెలుసా.. కేంద్రం నుంచి ప్రతి నెల చేతికి రూ.5వేలు!

  • Published Jul 18, 2023 | 3:20 PMUpdated Jul 18, 2023 | 3:20 PM
  • Published Jul 18, 2023 | 3:20 PMUpdated Jul 18, 2023 | 3:20 PM
ఈ పథకం గురించి మీకు తెలుసా.. కేంద్రం నుంచి ప్రతి నెల చేతికి రూ.5వేలు!

కేంద్రం పథకాలు నిరుద్యోగ యువతీ యువకుల కోసం, మహిళలు ఆర్థిక స్వాలంభన సాధించడం కోసం.. విద్యార్థులు చదువుకు సాయం చేయడం కోసం ఎన్నో రకాల పథకాలను తీసుకువస్తాయి. వీటిలో చాలా వాటి గురించి సామాన్య ప్రజలకు తెలియవు. అలాంటి ఒక పథకం గురించి ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాం. ఈ పథకంలో చేరిన వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల రూ.5వేల రూపాయలు అందిజేస్తోంది. ఇంతకు ఆ పథకం ఏంటి అంటే.. నేషనల్‌ యూత్‌ వాలంటీర్‌ స్కీం. సమాజానికి తమ వంతు సేవ చేయాలనుకునే యువతీయువకులకు తమ ప్రాంతంలో వాలంటీర్‌గా కొంతకాలం పని చేసేందుకు అవకాశం కల్పించే స్కీమే నేషనల్‌ యూత్‌ వాలంటీర్‌ పథకం. దీనిలో చేరి తమ ప్రాంతాల్లో వాలంటీర్‌గా పని చేసే వారికి కేంద్ర ప్రభుత్వం ప్రతి నెల 5 వేల రూపాయల గౌరవ వేతనం అందజేస్తోంది. మరి ఈ పథకంలో చేరాలంటే ఏం చేయాలి.. ఎలాంటి అర్హతలు ఉండాలి వంటి పూర్తి వివరాలు..

ఈ పథకంలో చేరి పని చేసేవారికిన నేషనల్‌ యూత్‌ కాప్స్‌ అని పిలుస్తారు. 2011 నుంచి ఈ పథకం కేంద్ర యువజన, క్రీడల శాఖ నేతృత్వంలోని నెహ్రూ యువ కేంద్రా సంఘటన్‌ దీన్ని పర్యవేక్షిస్తోంది. ఈ పథకంలో చేరిన వారు గరిష్టంగా రెండేళ్ల పాటు వాలంటీర్లుగా పని చేయవచ్చు. కేంద్రం ప్రతి ఏటా ఈ పథకం కోసం దేశవ్యాప్తంగా 12 వేల మంది వాలంటీర్లను ఎంపిక చేస్తోంది. అలా సెలక్ట్‌ చేసిన వారిని ఆయా రాష్ట్రాల్లో బ్లాక్‌ లెవల్‌ స్థాయి ప్రాంతాలకు పంపి అక్కడ వారి సేవలు వినియోగించుకుంటుంది.

ఎవరు అర్హులు..

  • 18-29 ఏళ్ల లోపు యువతీయువకులు ఈ పథకంలో చేరడానికి అర్హులు.
  • ఈ పథకంలో చేరి వాలంటీర్లుగా పని చేయాలంటే పదో తరగతి కచ్చితంగా పూర్తి చేయాలి.
  • గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి, సాంకేతిక నైపుణ్యాలు కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తారు.
  • ఆండ్రాయిడ్‌ ఫోన్‌తో పాటు భిన్నరకాల యాప్‌ల వినియోగం మీద అవగాహన ఉన్న వారికి కూడా అధిక ప్రాధాన్యం ఇస్తారు.

ఎలా అప్లై చేయాలి..

ఈ పథకంలో చేరాలనుకునేవారు.. ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. దీనికి సంబంధించి ఆయా జిల్లాల క‌లెక్ట‌ర్లు యూత్ వాలంటీర్ల నియామ‌కానికి నోటిఫికేష‌న్ జారీ చేస్తారు. అప్పుడు ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌చ్చు. ఎలాంటి అప్లికేషన్‌ ఫీజు చెల్లించాల్సిన అవసరం లేదు.

ఏం పత్రాలు కావాలి..

  • ద‌ర‌ఖాస్తుదారు ఫోటో
  • ఆధార్ కార్డు
  • 10వ త‌ర‌గ‌తి మార్క్స్ లిస్ట్‌
  • క్యాస్ట్‌ సర్టిఫికెట్‌త్రం (ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ)
  • ఉన్న‌త విద్యార్హ‌త‌ల‌కు సంబంధించి ఏవైనా స‌ర్టిఫికెట్లు ఉంటే
  • అడ్రెస్‌ ప్రూఫ్‌ కోసం ( ఓట‌రు గుర్తింపు కార్డు, ఆధార్ కార్డ్‌/డ్రైవింగ్ లైసెన్సు/రేష‌న్ కార్డు)

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి