iDreamPost

ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న వేతనాలు.. కారణమిదే

  • Published Mar 05, 2024 | 2:10 PMUpdated Mar 05, 2024 | 2:10 PM

Salaries Hike: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారి జీతాలు భారీగా పెరగనున్నాయి. ఆ వివరాలు..

Salaries Hike: ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం భారీ శుభవార్త చెప్పింది. వారి జీతాలు భారీగా పెరగనున్నాయి. ఆ వివరాలు..

  • Published Mar 05, 2024 | 2:10 PMUpdated Mar 05, 2024 | 2:10 PM
ఉద్యోగులకు శుభవార్త.. భారీగా పెరగనున్న వేతనాలు.. కారణమిదే

ఉద్యోగులకు భారీ శుభవార్త.. త్వరలోనే వారి వేతనాలు భారీగా పెరగనున్నాయి. ఎందుకంటే.. ప్రభుత్వం వారికి అందించే డీఏ, హెచ్‌ఆర్‌ఏ, గ్రాట్యుటీ, అలవెన్సులను భారీగా పెంచనుంది. దీని వల్ల ఉద్యోగుల జీతాలు ఎక్కువ మొత్తంలో పెరగనున్నాయి. అయితే ఇది కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రమే. వారు ఇప్పటికే ఎంతోకాలం నుంచి డియర్‌నెస్ అలవెన్స్ (డీఏ) పెంపు కోసం ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో ఇటీవలే.. లెబర్ బ్యూరో విడుదల చేసిన కన్జ్యూమర్ ప్రైస్ ఇండెక్స్ ఫర్ ఇండస్ట్రీయల్ వర్కర్స్ (సీపీఐ-డబ్ల్యూ) భారీగా పెరిగిన నేపథ్యంలో.. ఈసారి డీఏ పెంపు మరో 4 శాతం ఉంటుందని అధికారులు అంచానా వేస్తున్నారు. దీని వల్ల ఉద్యోగులు పొందే డీఏ 50 శాతానికి చేరనుంది.

ఇక 4 శాతం డీఏ పెంపుతో ఉద్యోగుల జీతాలు భారీగా పెరగనున్నాయి. అలాగే డీఏ 50 శాతానికి పెరగడంతో.. ఇతర అలవెన్సులు కూడా భారీగానే ఉండనున్నాయి. ఫలితంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల జీతాలు భారీగా పెరగున్నాయి. ఇప్పటికే డీఏ పెంపు, హెచ్ఆర్ఏ, గ్రాట్యుటీ వంటి అలవెన్సులకు సంబంధించి 7 వ వేతన సంఘం నిబంధనలు రూపొందించింది. డీఏ 50 శాతానికి పెరిగితే అది శాలరీపై ఎలాంటి ప్రభావం చూపిస్తుందని లెక్కలతో సహా వెల్లడించింది.

ఇక ఉద్యోగులకు ఇచ్చే డీఏ 50 శాతానికి పెరిగినప్పుడు ఇతర అలవెన్సులు అనగా.. హెచ్ఆర్ఏ, పిల్లల విద్యా అలవెన్సులు, డైలీ అలవెన్సులు, హాస్టల్ సబ్సిడీ, ట్రాన్స్‌ఫర్ పై టీఏ, గ్రాట్యుటీ సీలింగ్, డ్రెస్ అలవెన్స్, సొంత రవాణా కోసం మైలేజ్ అలవెన్సులు వంటివి భారీగా పెరుగుతాయి. అంతేకాక ఉద్యోగులు ఏ ప్రాంతంలో నివసిస్తున్నారు అనే దానిపై వారికి కేటాయించే హౌస్‌ రెంట్‌ అలవెన్స్‌ ఆధారపడి ఉంటుంది. ఇక 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు.. హెచ్‌ఆర్‌ఏ ప్రాంతాల వారీగా భిన్నంగా ఉంది. క్లాస్‌ ఎక్స్‌ సిటీలో హెచ్‌ఆర్‌ఏ 24 శాంతం ఉండగా.. క్లాస్‌ వై సీటీలో 16 శాంతం, క్లాస్‌ జెడ్‌ సిటీలో 8 శాతంగా ఉంది. అయితే ఇప్పుడు డీఏ పెంపు ఉండటంతో.. వీటిని 30, 20, 10 శాతానికి పెంచాలని భావిస్తున్నారు.

ఇక 7వ వేతన సంఘం సిఫార్సుల మేరకు డీఏ 50 శాతానికి చేరిన ప్రతిసారి పిల్లల చదువుకు సంబంధించిన అలవెన్స్‌ కూడా 25 శాతం పెరగాలి. అదే విధంగా పిల్లల సంరక్షణ కోసం స్పెషల్‌ అలవెన్సులు, గ్రాట్యూటీ సీలింగ్‌, డ్రెస్‌ అలవెన్స్‌లు, డైలీ అలవెన్స్‌లు సైతం 25 శాతం మేర పెరిగే అవకాశంది ఉంది అంటున్నారు. దీని వల్ల కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల వేతనాలు భారీగా పెరిగే అవకాశం ఉందని సమాచారం. అయితే దీనికి సంబంధించి కేంద్ర నుంచి అధికారక ప్రకటన రావాల్సి ఉంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి