iDreamPost
android-app
ios-app

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది పాటు సిలిండర్ పై రూ.300 తగ్గింపు

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. మరో ఏడాది పాటు వంట గ్యాస్ సిలిండర్ పై రూ. 300 తగ్గింపు కల్పించింది. దీంతో కోట్లాది మంది కస్టమర్లకు లబ్ధి చేకూరనున్నది.

గ్యాస్ వినియోగదారులకు కేంద్రం శుభవార్తను అందించింది. మరో ఏడాది పాటు వంట గ్యాస్ సిలిండర్ పై రూ. 300 తగ్గింపు కల్పించింది. దీంతో కోట్లాది మంది కస్టమర్లకు లబ్ధి చేకూరనున్నది.

గ్యాస్ వినియోగదారులకు గుడ్ న్యూస్.. మరో ఏడాది పాటు సిలిండర్ పై రూ.300 తగ్గింపు

ప్రస్తుత కాలంలో గ్యాస్ వినియోగించే వారి సంఖ్య పెరుగుతోంది. పట్టణాలు మొదలుకుని మారుమూల పల్లెల వరకు గ్యాస్ తోనే వంటలు చేసుకుంటున్నారు ప్రజలు. గతంలో వంటచెరకుతో వంట అవసరాలను తీర్చుకునే వారు. అధిక జనాభా గల దేశంలో వంట చెరకుపై ఆధారపడితే అడవులు అంతరించిపోతాయని.. వంట చెరకు వాడకంతో మహిళలు అనారోగ్యాల భారిన పడుతున్నారని కేంద్రం ఉజ్వల పథకాన్నిప్రకటించింది. ఈ పథకం కింద ఒక్కో సిలిండర్ పై రూ. 300 సబ్సిడీని అందిస్తోంది. అయితే ఈ సబ్సిడీ గడువు మార్చి 31తో ముగియనున్నది. ఈ నేపథ్యంలో కేంద్ర కేబినెట్ ఉజ్వల లబ్ధిదారులకు తీపికబురు అందించిది. వంట గ్యాస్‌ సిలిండర్‌పై ఇస్తున్న రాయితీ (ఎల్పీజీ సబ్సిడీ) గడువును పొడిగించింది.

2016లో ఉజ్వల పథకాన్ని ప్రారంభించిన కేంద్ర ప్రభుత్వం అర్హులైన వారికి ఉచితంగా గ్యాస్ కనెక్షన్ అందిస్తోంది. అయితే మొదట్లో ఉజ్వల పథకం కింద గ్యాస్‌ కనెక్షన్‌ తీసుకున్న వారికి ఒక్కో సిలిండర్‌పై రూ.200 సబ్సిడీని కేంద్రం ప్రకటించింది. ఆ తర్వాత దీన్ని రూ. 300కు పెంచింది. ఈ పథకం కింద సంవత్సరానికి 12 సిలిండర్ల వరకు సబ్సిడీని అందిస్తోంది. అయితే ఈ సబ్సిడీ ఈ నెలాఖరుతో ముగియనుండడంతో మోడీ అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో సబ్సిడీ పొడిగింపు నిర్ణయం తీసుకున్నారు. ఏప్రిల్‌ 1 నుంచి ప్రారంభమయ్యే ఆర్థిక సంవత్సరానికీ ఈ రాయితీని వర్తింపజేసింది. ఈ నిర్ణయంతో దేశవ్యాప్తంగా దాదాపు 10 కోట్ల కుటుంబాలకు లబ్ధి చేకూరనున్నట్లు కేంద్రమంత్రి పీయూష్‌ గోయల్‌ తెలిపారు. కేంద్రం నిర్ణయంతో వంటగ్యాస్ వినియోగదారులకు ఆర్థికభారం తప్పినట్లైంది.