Vinay Kola
Lexus LM 350h Luxury MPV: లెక్సస్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి చాలా సౌకర్యంగా వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆటోమొబైల్ రంగంలో తమకంటూ లెక్సస్ కంపెనీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Lexus LM 350h Luxury MPV: లెక్సస్ కార్ల గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. ఇవి చాలా సౌకర్యంగా వాహనదారులను ఎంతగానో ఆకట్టుకుంటున్నాయి. ఆటోమొబైల్ రంగంలో తమకంటూ లెక్సస్ కంపెనీ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది.
Vinay Kola
Lexus LM 350h Luxury MPV .. ఈ సూపర్ లగ్జరీ కార్ ప్రస్తుతం సెలెబ్రెటీస్ హాట్ ఫేవర్ అయ్యింది. ట్రెండ్‌కి తగ్గట్లు అపర కుబేరుడు అంబానీ గ్యారేజీలో ప్రపంచంలోని కొత్త కొత్త లగ్జరీ కార్లన్నీ ఉంటాయి. తాజాగా ఈ లెక్సస్ ఎంపీవీ కూడా అయన గ్యారేజ్ లో చేరిందంటే దీని రేంజ్ ఏంటో అర్ధం చేసుకోవచ్చు. రణ్‌బీర్ కపూర్,హార్దిక్ పాండ్యా లాంటి ప్రముఖులు కూడా ఈ కార్ వాడుతున్నారు. ఇంకా ఎందరో సెలెబ్రెటీస్ , వ్యాపారవేత్తలు ఈ కార్ కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు.ఇందులోని లగ్జరీ ఫీచర్లు టాప్ రేంజ్‌లో ఉంటాయి. లెక్సస్ ఎల్ఎం 350హెచ్ లగ్జరీ ఎంపీవీ లేటెస్ట్ జనరేషన్ వెర్షన్ మార్చిలో ఇండియన్ మార్కెట్లో లాంచ్ అయింది. లెక్సస్ ఈ లగ్జరీ ఎంపీవీ బుకింగ్స్‌ని గత సంవత్సరం ప్రారంభించింది. ఈ కార్ ని 7-సీటర్ లేదా 4-సీటర్ ఆప్షన్లలో కొనుగోలు చేయవచ్చు. దీని ధర విషయానికి వస్తే, ఎక్స్ షోరూమ్ ధర రూ.2 కోట్ల నుంచి రూ.2.5 కోట్ల రేంజిలో ఉంటుంది.
ఇక ఈ లెక్సస్ ఎంపీవీ సూపర్ కార్ ని GA-K మాడ్యులర్ ప్లాట్‌ఫామ్‌పై నిర్మించారు. ఈ కార్ కి క్యాబిన్ స్పేస్ ఎక్కువగా అందించేలా బాక్సీ డిజైన్‌ని అందించారు. 4-సీటర్ వెర్షన్ క్యాబిన్ అయితే చాలా విశాలంగా సౌకర్యంగా ఉంటుంది. ఇది ముందు అలాగే వెనుక కూర్చునే ప్రయాణీకుల మధ్య గ్యాప్ ఉండేలా చేస్తుంది. సూపర్ రోడ్ ప్రెజెన్స్, విమానంలో ఉండే ఫస్ట్ క్లాస్ క్యాబిన్లకు సరిపోయే ఇంటీరియర్ ఈ కార్ సొంతం. ఈ కార్ ఇంటీరియర్స్‌లో ఎయిర్ క్రాఫ్ట్ లాంటి రెక్లైనర్ సీట్లు, 23 స్పీకర్ల సరౌండ్ సౌండ్ సిస్టమ్, కుషన్ లాంటి హెడ్ రెస్ట్, 48 ఇంచెస్ టీవీతో పాటు ఫ్రిడ్జ్ కూడా ఉంది.ఇంకా అంతే కాక ఇన్‌ఫ్రారెడ్ సెన్సార్‌తో కూడిన ఏసీ, పవర్ సీట్ లాంగ్ స్లైడ్ రైల్, అనేక రకాలుగా ఆపరేట్ చేయగల టిల్ట్-అప్ సీటు, వైబ్రేషన్లను గ్రహించే పిస్టన్ వాల్వ్ వంటి ఫీచర్లు ఈ కారులో ఉన్నాయి. ఫాల్ట్ అవుట్ టేబుల్స్, హీటెడ్ ఆర్మ్‌రెస్ట్, USB B పోర్టులు, వైర్‌లెస్ ఛార్జర్లు, రీడింగ్ లైట్లు, వ్యానిటీ అద్దాలు, హోల్డర్స్ లాంటి సూపర్ ఫీచర్లు కూడా ఇందులో ఉన్నాయి.
ఇందులో ప్యాసెంజర్లు తమ బాడీకి అనుగుణంగా టెంపరేచర్ ని కూడా సెట్ చేసుకోవచ్చు. అందుకు గాను కొత్త సెన్సార్ తో కూడిన క్లైమేట్ కంట్రోల్ కూడా ఈ కారులో లభిస్తుంది. ఇందులో ఉండే అడాప్టివ్ సస్పెన్షన్ ప్రయాణాలను సౌకర్యంగా చేయడానికి సహాయపడుతుంది. నాయిస్ రిడక్షన్ టైర్లు, యాక్టివ్ నాయిస్ కంట్రోల్, డిజిటల్ రియర్ వ్యూ మిర్రర్ వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి.ఈ కార్ హైబ్రిడ్ పవర్ట్రెయిన్ సిస్టమ్‌తో వస్తుంది. ఇందులోని 2.5-లీటర్ 4-సిలిండర్ పెట్రోల్ హైబ్రిడ్ ఇంజిన్ 246bhp పవర్, 239nm టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇంకా ఎక్కువ పవర్ కోసం ఇంజిన్.. నికెల్-మెటల్ హైడ్రైడ్ బ్యాటరీతో కలిసి పనిచేస్తుంది. ఈ ఇంజిన్ సీవీటీ గేర్ బాక్స్‌తో యాడయ్యి ఉంటుంది. ఈ లెక్సస్ ఎల్ఎమ్ 350 హెచ్ ఎంపీవికి కంఫర్ట్ విషయంలో దేశంలో ఏ కార్ కూడా పోటీ లేదు.