iDreamPost
android-app
ios-app

80 లక్షల మంది ఖాతాలో డబ్బలు జమ.. మీ అకౌంట్‌ చెక్‌ చేసుకొండి!

  • Published Jul 25, 2023 | 1:42 PM Updated Updated Jul 25, 2023 | 1:42 PM
  • Published Jul 25, 2023 | 1:42 PMUpdated Jul 25, 2023 | 1:42 PM
80 లక్షల మంది ఖాతాలో డబ్బలు జమ.. మీ అకౌంట్‌ చెక్‌ చేసుకొండి!

కేంద్రం కీలక ప్రకటన చేసింది. దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఖాతాలో డబ్బులు జమ చేసింది. మీ అకౌంట్‌లో కూడా డబ్బులు పడ్డాయో లేదో చెక్‌ చేసుకొండి. అవును కేంద్రం ఎందుకు డబ్బులు జమ చేస్తోంది.. ఏ పథకం కింద ఈ డబ్బులు పంపిణీ చేస్తుంది.. దీని గురించి ఎప్పుడు ప్రకటించింది.. లబ్ధిదారులు ఎవరు వంటి  అనుమానాలు తలెత్తుతున్నాయి. అయితే ఆగండి.. ఇవి సంక్షేమం పథకం కింద చేసే నగదు పంపిణీ కాదు. రీఫండ్‌ డబ్బులు. దేశవ్యాప్తంగా సుమారు 80 లక్షల మంది ఖాతాలో ఈ రీఫండ్‌ మొత్తాన్ని జమ చేశారు. ఇంతకు ఎవరు అంటే ఆదాయ పన్ను శాఖ అధికారులు.

దేశవ్యాప్తంగా ఇప్పటి వరకు 4 కోట్ల మంది ఐటీ రిటర్న్స్ దాఖలు చేశారని.. వాటిని వేగంగా ప్రాసెస్‌ చేస్తున్నట్లు సీబీఐటీ డైరెక్టర్‌ నితిన్‌ గుప్తా వెల్లడించారు. వీరిలో అర్హులైన 80 లక్షల మందికి ఇప్పటికే రిఫండ్ మొత్తాన్ని వారి ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. రీఫండ్‌ మొత్తం జమ కానీ వారు.. తమ స్టేటస్‌ను అప్‌డేట్‌ చేసుకోవాలని సూచించారు. సోమవారం ఆదాయపు పన్ను శాఖ 164వ వార్షికోత్సవ సందర్భంగా నితిన్ గుప్తా కీలక వ్యాఖ్యలు చేశారు.

వ్యక్తిగత, కార్పొరేట్ ప్రత్యక్ష పన్నులు కలిపి 2022- 23 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి మొత్తం రూ. 16,51,000 కోట్లు వసూలైనట్లు వెల్లడించారు. 2021 ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే.. ఈ ఏడాది వసూలైన మొత్తం 17.67 శాతం అధికమని తెలిపారు. సాధ్యమైనంత త్వరగా దాఖలైన రిటర్నులను ప్రాసెసి చేసి రిఫండ్ అందిస్తున్నట్లు వెల్లడించారు. 2022-23 ఆర్థిక ఏడాదిలో గరిష్ఠంగా 16 రోజుల్లోనే ఐటీ రిటర్న్స్ ప్రాసెస్ పూర్తిచేస్తున్నామని, గతంలో దీనికి చాలా రోజులు పట్టేదని చెప్పారు. దాదాపు 42 శాతం ఐటీ రిటర్న్స్ ఒక రోజులోనే ప్రాసెస్ చేసినట్లు తెలిపారు

దేశంలో ఆదాయపు పన్ను ప్రవేశపెట్టిన జులై 24ని ప్రతి ఏటా ఇన్‌కమ్ ట్యాక్స్ డేగా కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తోంది.  ఈ క్రమంలో  10 రోజుల పాటు దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలు నిర్వహించింది. పన్నుల కట్టాల్సిన ఆవశ్యకత, పన్నుల గురించి ప్రజల్లో అవగాహన కల్పించే కార్యక్రమాలు చేపట్టింది.