iDreamPost
android-app
ios-app

వీడియో: ఉద్యోగులకు నరకం చూపిస్తున్న ఆ ప్రైవేట్ బ్యాంక్స్! టార్గెట్స్ రీచ్ కాలేదని బూ*తులు!

ప్రజలకు ఎల్లవేళలా సేవలందించేందుకు విశేషమైన కృషి చేస్తున్నాయి బ్యాంకులు. అలాగే బ్యాంక్ అభివృద్ధి చేసుకునేందుకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అలాగే వారికి టార్గెట్ ఫిక్స్ చేస్తుంటాయి.

ప్రజలకు ఎల్లవేళలా సేవలందించేందుకు విశేషమైన కృషి చేస్తున్నాయి బ్యాంకులు. అలాగే బ్యాంక్ అభివృద్ధి చేసుకునేందుకు ఉద్యోగులను నియమించుకుంటున్నాయి. అలాగే వారికి టార్గెట్ ఫిక్స్ చేస్తుంటాయి.

వీడియో: ఉద్యోగులకు నరకం  చూపిస్తున్న ఆ ప్రైవేట్ బ్యాంక్స్! టార్గెట్స్ రీచ్ కాలేదని బూ*తులు!

అమ్మకానికి నమ్మకం వంటివి బ్యాంక్స్. ఇందులో డబ్బు దాచితే.. సెక్యూర్ అని నమ్ముతుంటారు. ఇవే కాకుండా ఆర్థిక అవసరాలకు కూడా ఈ విత్త సంస్థలను ఆశ్రయిస్తుంటారు సామాన్యుల నుండి దేశంలోనే దిగ్గజ వాణిజ్య వేత్తలు. ఇక బ్యాంకులకు కూడా తమ కస్టమర్లను పెంచుకునేందుకు విపరీతంగా ప్రమోషన్లు చేయడమే కాకుండా.. ఎగ్జిక్యూటివ్స్,ఎంప్లాయిస్‌కు టార్గెట్ ఫిక్స్ చేస్తుంటాయి. సాధారణ వ్యక్తుల నుండి, సెలబ్రిటీలను ఆకర్షించేందుకు ముప్పుతిప్పలు పడుతుంటారు. ఖాతాలు ఓపెన్ చేయించడం, క్రెడిట్ కార్స్, రుణాలు ఇప్పించడం, ఇచ్చిన రుణాలు వసూలు చేయడం వంటి టార్గెట్స్ ఉంటాయి. ప్రతి రోజు కస్టమర్లను వేటాడుతూనే ఉంటారు. నెల చివరికి వచ్చేసరికి టార్గెట్ చేయాలన్న లక్ష్యంతో టెన్షన్ పడిపోతూ ఉంటారు.

ఇక టార్గెట్ పూర్తి చేయకపోతే ఉన్నతాధికారుల నుండి చీవాట్లు తప్పవు. ఇప్పుడు అలాంటి ఓ వీడియో బయటకు వచ్చింది. టార్గెట్స్ పూర్తి చేయలేదన్న ఉద్దేశంతో తమ జూనియర్ ఉద్యోగులను కెనరా బ్యాంక్, బంధన్ బ్యాంక్ ఉన్నతాధికారులు అసభ్య పదజాలంతో తిడుతున్న వీడియోలు ఇప్పుడు వైరల్ అయ్యాయి. కాన్షరెన్స్ కాల్ పెట్టి మరీ తోటి ఎంప్లాయిస్ ముందు తిడుతూ నరకం చూపిస్తున్నారు.  పిల్ల, జల్లా వదిలేసి ఎక్కువ సేపు పనిచేయాలంటూ బెదిరిస్తున్నారు. ఏప్రిల్ 24న నెట్టింట్లో ప్రత్యక్షమైన వీడియోలో.. కునాల్ భరద్వాజ్ అనే బంధన్ బ్యాంక్ అధికారి.. నిర్దేశించిన లక్ష్యాలను చేరుకోలేకపోయినందుకు జూనియర్ ఉద్యోగిపై కేకలు వేయడం కనిపిస్తుంది. సిగ్గులేదా.. అంటూ బూతులు తిట్టాడు. ఇక 4వ తేదీన మరో వీడియోలో లోకపతి స్వైన్ అనే కెమెరా బ్యాంక్ అధికారి.. పనికంటే పర్సనల్ వర్క్‌కు ప్రాధాన్యతనిస్తున్నారంటూ తిట్టడం కనిపిస్తుంది.

మీ కుటుంబం గురించి కూడా పట్టించుకోకుండా పని చేయాలని, సోమవారం నుండి శనివారం మాత్రమే కాదు..ఆదివారం, పండుగలు, పబ్బాలు ఉన్న ప్రతి రోజు కూడా పనిచేయాలంటూ కసురుకోవడం కనిపిస్తున్నాయి. కాగా, ఈ ఘటనపై రెండు బ్యాంకులు స్పందించాయి. బంధన్ బ్యాంక్ వీడియోపై ఓ ప్రకటన చేసింది. తాము విలువలకు అత్యధిక ప్రాధాన్యతనిస్తామని, ఇటువంటి ప్రవర్తనను ఖండిస్తామని, బ్యాంక్ పాలసీకి అనుగుణంగా చర్యలు తీసుకుంటామని తెలిపింది. ఇక కెనరా బ్యాంక్ కూడా స్పందిస్తూ.. ఉద్యోగులు, వారి కుటుంబాల సహకారానికి తాము ఎప్పుడూ విలువనిస్తామని, ఇది పలుమార్లు రుజువైందని తెలిపింది. వ్యక్తిగతంగా వారిని టార్గెట్ చేస్తే.. బ్యాంక్ అలాంటి చర్యలను ఆమోదించదని, ఆ ఉద్యోగిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపింది . ఇకపోతే ఈ వీడియోలపై నెటిజన్లు కూడా తీవ్రంగా స్పందిస్తారు. ఈ వీడియోలు బయటకు వచ్చాయని, బయట పడకుండా.. ఉన్నతోద్యోగుల చేతిలో తిట్టుతింటున్న ఎంతో మంది ఉద్యోగులనున్నారని, బయటపడ్డ వాటిపై ఏం చర్యలు తీసుకున్నారని ప్రశ్నిస్తున్నారు.