iDreamPost
android-app
ios-app

AC కొనలా.. రెంటల్‌ AC తీసుకోవాలా.. రెండింటిలో ఏది ఉత్తమం?

  • Published Apr 23, 2024 | 12:59 PMUpdated Apr 23, 2024 | 12:59 PM

ఎండల తీవ్రతకు భయపడి ఏసీ కొనాలని భావిస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం ఆగండి.. మార్కెట్‌లో ఏసీలను అద్దెకు కూడా ఇస్తున్నారు. మరి ఏసీ కొనలా.. లేక అద్దెకు తీసుకోవాలా.. ఈ రెండింటిలో ఏది బెటర్‌ ఐడియా అంటే..

ఎండల తీవ్రతకు భయపడి ఏసీ కొనాలని భావిస్తున్నారా.. అయితే ఒక్క నిమిషం ఆగండి.. మార్కెట్‌లో ఏసీలను అద్దెకు కూడా ఇస్తున్నారు. మరి ఏసీ కొనలా.. లేక అద్దెకు తీసుకోవాలా.. ఈ రెండింటిలో ఏది బెటర్‌ ఐడియా అంటే..

  • Published Apr 23, 2024 | 12:59 PMUpdated Apr 23, 2024 | 12:59 PM
AC కొనలా.. రెంటల్‌ AC తీసుకోవాలా.. రెండింటిలో ఏది ఉత్తమం?

గత సంవత్సరాలకు భిన్నంగా ఈ ఏడాది వేసవి కాలం అప్పుడే ప్రారంభం అయ్యింది. మార్చి నుంచే భానుడి భగభగలు మొదలయ్యాయి. మే చివరి వారంలో నమోదు కావాల్సిన ఉష్ణోగ్రతలు.. ఏప్రిల్‌ తొలి వారంలోనే నమోదయ్యాయి. మండే ఎండలు, వడగాలులతో జనాలు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నారు. ఫ్యాన్లు, కూలర్లు.. వేసవి తాపాన్ని తీర్చలేకపోతున్నాయి. దాంతో చాలా మంది ఏసీ కొనేందుకు రెడీ అవుతున్నారు. కానీ కూలర్‌తో పోలిస్తే ఏసీ ధర చాలా ఎక్కువ. పైగా వేసవి కాలం కావడంతో ఏసీలకు డిమాండ్‌ ఫుల్లుగా పెరిగింది. దాంతో ధరలు పెరిగాయి. ఇక ఏసీ కొన్నాక దాని నిర్వహణ కూడా చాలా కష్టంగానే ఉంటుంది.

సొంత ఇల్లు ఉన్న వారికి అయితే ఓకే కానీ.. రెంట్‌కు ఉండే వారికి అయితే ఇల్లు మారినప్పుడల్లా ఏసీని మార్చాడం చాలా కష్టమైన పని. మరి అలా అని ఏసీ లేకపోతే.. ఈ వేడికి మాడిపోతాం. మరి ఏం చేయాలి అంటే.. అందుకోసమే ఈ ఐడియా. అదే రెంటల్‌ ఏసీ. అసలేంటి ఈ రెంటల్‌ ఏసీ.. ఏసీతో పోలిస్తే.. దీని వల్ల కలిగే లాభాలు ఏంటి.. అసలు ఈ రెండింటిలో ఏది బెటర్‌. ఒకవేళ రెంటల్‌ ఏసీ తీసుకోవాలంటే ఏం చేయాలి.. ఆ ప్రాసెస్‌ ఏంటి వంటి వివరాలు మీకోసం.

రెంటల్‌ ఏసీతో బోలేడు లాభాలు..

ఏసీ కొనడానికి బదులు అద్దెకు తీసుకోవడం వల్ల అనేక లాభాలున్నాయి అంటున్నారు. రెంటల్‌ ఏసీని సులభంగా ఆర్డర్ చేయొచ్చు. ప్రస్తుతం ఆన్‌లైన్/ఆఫ్‌లైన్ రెండింటిలోనూ రెంటల్ ఏసీ సౌకర్యాలు లభిస్తున్నాయి. వీటి ధర రూ.800 నుంచి రూ.1500 వరకు ఉన్నాయి. ఒకవేళ మీరు సొంతంగా ఏసీ కొంటే తరచుగా మార్చడానికి కష్టమవుతుంది. అదే అద్దెకు తీసుకుంటే.. మీరు ఇల్లు మారుతున్నామన్నా సమాచారం ఇస్తే చాలు.. ఆ కంపెనీ సిబ్బంది వచ్చి దాన్ని జాగ్రత్తగా తీసుకెళ్తారు.

ఈ రోజుల్లో.. కొత్త ఏసీ కొనాలంటే కనీసం రూ.30 వేలకు పైగా ఖర్చు చేయాల్సిందే. అంతేకాదు దానికి సంబంధించిన మెయింటెయినెన్స్ ఛార్జీలు కూడా ఉంటాయి. అందుకే చాలా మంది ఏసీని కొనే బదులు రెంట్‌కు తీసుకునేందుకు ఆసక్తి చూపుతున్నారు. అయితే ఏసీని అద్దెకు తీసుకోవడం ఎలా.. అసలు ఈ సౌకర్యం ఎక్కడ ఉంటుంది.. దీనిని ఎలా ఆర్డర్ చేయాలి.. రెంట్‌కు తీసుకోవాలంటే ముందుగా ఎంత మొత్తం డిపాజిట్ చేయాలనే విషయాలు చాలా మందికి తెలీదు. ఆ వివరాలు ఇప్పుడు తెలుసుకుందాం.

ఏసీని ఎలా రెంట్‌కి తీసుకోవాలంటే..

మీరు ఏసీని రెంట్‌కి తీసుకోవాలనుకుంటే.. ముందుగా ఏదైనా ఎలక్ట్రానిక్స్ షాపుకు వెళ్లి అక్కడ అలాంటి సౌకర్యం ఉందా లేదా తెలుసుకొండి. లేదంటే ఆన్లైన్‌లో వెతికితే బోలెడన్నీ ఆప్షన్స్‌ కనిపిస్తాయి. ఉదాహరణకు రెంట్‌మోజో, ఫెయిరెంట్, సిటీఫర్నీష్, రెంట్‌లోకో వంటివి అనేక మెట్రో నగరాల్లో ఏసీలను అద్దెకు ఇస్తున్నాయి. వాటి సామర్థ్యాన్ని బట్టి నెలకు రూ.800 నుంచి రూ.2 వేల వరకు వసూలు చేస్తాయి.

రెంటల్ ఏసీతో లాభాలు..

కొత్త ఏసీ.. అందునా మంచి స్టార్‌ రేటింగ్‌ది కొనాలంటే.. భారీగా ఖర్చు చేయాలి. ప్రస్తుతం బ్రాండెడ్‌ ఏసీ ధర రూ.30 వేలు కంటే ఎక్కువగానే ఉంది. మీ దగ్గర అంత బడ్జెట్ లేకపోతే, ఏసీని అద్దెకు తీసుకోవచ్చు. ఒకవేళ మీరు ఏసీని కొన్నా కూడా రెగ్యులర్‌గా మెయింటెయినెన్స్ ఖర్చులు భరించాల్సి ఉంటుంది. దాని బదులు ఏసీని రెంట్‌కు తీసుకుంటే.. సమస్యలేమీ ఉండవు. చాలా తక్కువ ఖర్చుతో సమ్మర్‌లో ఏసీని ఎంజాయ్‌ చేయవచ్చు. ఇక ఈ రెంటల్‌ ఏసీ విధానంలో మీకు విండోస్, స్ప్లిట్ ఏసీ రెండు రకాలు అందుబాటులో ఉంటాయి.

ఎలా రెంట్‌కు తీసుకోవాలి..

ఏసీ అద్దెకు తీసుకోవాలంటే పెద్దగా కష్టపడాల్సిన పని లేదు. అన్ని వివరాలు, అద్దె ఎంత, నియమ నిబంధనలు గురించి ఆన్లైన్‌లోనే వెల్లడిస్తున్నాయి. అన్నింటిని చెక్‌ చేసి.. లాభనష్టాలను బేరీజు వేసుకుని.. మీకు నచ్చిన ఏసీని అద్దెకు తీసుకోవచ్చు. ఇలా అద్దెకు తీసుకున్న ఏసీలో ఏదైనా సమస్య వస్తే.. నేరుగా సర్వీస్ సెంటర్‌కి లేదా ఏజెన్సీకి కాల్ చేస్తే, వాళ్లే వచ్చి సమస్యను పరిష్కరిస్తారు. అద్దెకు తీసుకునే వారు ఏసీ రేంజ్ బట్టి ఇన్‌స్టాలేషన్ ఛార్జీ, రిఫండబుల్ డిపాజిట్ చెల్లించాల్సి ఉంటుంది. వీటిలో పైపుల ఖర్చులు వంటివి అదనంగా ఉంటాయని గుర్తుంచుకోండి. అయితే ఈ సేవలన్నీ కేవలం మెట్రో నగరాల్లోనే అందుబాటులో ఉన్నాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి