iDreamPost
android-app
ios-app

ఒకప్పటి సంపాదన రూ. 1200!.. కానీ నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది!

చదువు పూర్తైంది. ఆ తర్వాత వివాహం చేసుకుంది. చేస్తున్న ఉద్యోగం ఆమెకు సంతృప్తినివ్వలేదు. దాంతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఒకప్పుడు రూ. 1200 ల వేతనం అందుకున్న ఆమె నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది.

చదువు పూర్తైంది. ఆ తర్వాత వివాహం చేసుకుంది. చేస్తున్న ఉద్యోగం ఆమెకు సంతృప్తినివ్వలేదు. దాంతో ఓ సంస్థను ఏర్పాటు చేసింది. ఒకప్పుడు రూ. 1200 ల వేతనం అందుకున్న ఆమె నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని ఏర్పాటు చేసింది.

ఒకప్పటి సంపాదన రూ. 1200!.. కానీ నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది!

మనం ఏదైనా సాదించాలంటే దానికి తగిన క‌ృషి, పట్టుదల ఉంటే చాలు అనుకున్న లక్ష్యాన్ని ఛేదించొచ్చు. మీ కలల సామ్రాజ్యాన్ని నిర్మించుకునేందుకు కావాల్సింది సంకల్ప బలం. శ్రమ నీ ఆయుధం అయితే విజయం నీ బానిస అవుతుంది అన్నట్లుగానే ఖచ్చితమైన ప్లాన్ తో శ్రమిస్తే చాలు విజయం వరిస్తుంది. నేడు గొప్ప గొప్ప వ్యక్తులందరు కూడా ఆ విధంగా కష్టపడి పైకొచ్చి పేరు తెచ్చుకున్న వాళ్లే. కష్టపడకుండా ఏదీరాదు. కష్టపడితేనే ఫలితం సిద్ధిస్తుంది. ఈ విధంగానే ఓ మహిళ తాను అనుకున్న లక్ష్యం దిశగా అడుగులు వేసింది. ఒకప్పుడు రూ. 1200 వందలు వేతనం అందుకున్న ఆమె నేడు వేల కోట్ల సామ్రాజ్యాన్ని సృష్టించింది. ఇంతకీ ఆమె ఎవరు? ఆమె ఏం చేసింది? ఆమె విజయానికి కారణం ఏంటి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాం.

హర్యానాకు చెందిన గజల్ అలఘ్ మామా ఎర్త్ అనే సంస్థను స్థాపించి వేల కోట్ల సామ్రాజ్యానికి అధినేత్రి అయ్యింది. 2013లో న్యూయార్క్ అకాడమీ ఆఫ్ ఆర్ట్‌లో డిజైన్ అండ్ అప్లైడ్ ఆర్ట్స్‌లో సమ్మర్ ఇంటెన్సివ్, మోడరన్ ఆర్ట్‌లో ఫిగరేటివ్ ఆర్ట్‌లో ఇంటెన్సివ్ కోర్సును పూర్తి చేసింది గజల్ అలఘ్. ఆ తరువాత కొంత కాలం ఎన్ఐఐటీ లిమిటెడ్‌లో కార్పొరేట్ ట్రైనర్‌గా పనిచేసింది. ఈ క్రమంలో గజల్ అలఘ్ వరుణ్ అనే వ్యక్తిని వివాహం చేసుకుంది. తరువాత 2016లో తన భర్త ‘వరుణ్ అలఘ్‌’తో కలిసి ‘మామా ఎర్త్‌’ సంస్థను ప్రారంభించింది. మామా ఎర్త్‌ ద్వారా గజల్ అలఘ్‌ చిన్న పిల్లలకు పర్యావరణ అనుకూలమైన వ్యక్తిగత పరిశుభ్రత ఉత్పత్తులను తయారు చేయడం ప్రారంభించింది.

Ghazal alagh success story

వ్యక్తిగత పరిశుభ్రతను దృష్టిలో పెట్టుకుని రాష్ క్రీమ్‌లు, లోషన్లు, షాంపులు, మసాజ్ ఆయిల్‌లు, బాడీ వాష్‌లు, డైపర్‌లను తయారు చేసి విక్రయించడం ప్రారంభించారు. ఈ ప్రొడక్ట్స్ కు మార్కెట్ లో మంచి డిమాండ్ వచ్చింది. మామా ఎర్త్ స్థాపించిన తక్కువ సమయంలోనే ఆ ఉత్పత్తులు ప్రజాదారణ పొందాయి. గజల్ అలఘ్‌ ప్రస్తుతం మామా ఎర్త్‌ సంస్థ ద్వారా పిల్లల సంరక్షణలో ఉపయోగించే దాదాపు 500 వస్తువులను విక్రయిస్తూ.. ఆసియాలో సేఫ్ సర్టిఫైడ్ బ్రాండ్‌గా అవతరించింది. రూ. 25 లక్షలతో ప్రారంభమైన మామా ఎర్త్‌ సంపద రూ. 9,800 కోట్లకు ఎగబాకినట్లు తెలుస్తోంది. అయితే ఇంత ఎత్తుకు ఎదిగిన గజల్ అలఘ్ మొదటి సంపాదన మాత్రం రూ. 1200 మాత్రమే. కార్పోరేట్ ట్రైనర్‌గా పనిచేసినపుడు తనకు వచ్చిన మొదటి సంపాదన అది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి