Dharani
Budget 2024- Allocation For BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం కొండంత అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది. ఈ నిర్ణయంతో.. జియో, ఎయిర్‌టెల్‌ల పని ఔట్ అంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..
Budget 2024- Allocation For BSNL: బీఎస్‌ఎన్‌ఎల్ కంపెనీకి కేంద్ర ప్రభుత్వం కొండంత అండగా ఉండేందుకు ముందుకు వచ్చింది. ఈ నిర్ణయంతో.. జియో, ఎయిర్‌టెల్‌ల పని ఔట్ అంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..
Dharani
దేశంలో గత కొన్ని రోజులుగా బీఎస్‌ఎన్‌ఎల్ పేరు మార్మొగిపోతుంది. ఇందుకు కారణం ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్‌లు రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచాయి. దీనిపై తీవ్ర అసంతృప్తితో ఉన్న కస్టమర్లు.. ప్రభుత్వరంగ టెలికాం సంస్థ బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. ఒక్క జూలై నెలలోనే ఇప్పటి వరకు సుమారు 25 లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థకు ఆదరణ పెరుగుతున్న నేపథ్యంలో.. ప్రభుత్వం కూడా బీఎస్‌ఎన్‌ఎల్‌పై ప్రత్యేక దృష్టి పెట్టింది. బీఎస్‌ఎన్‌ఎల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలు చాలా తక్కువ. కానీ జనాలు ఎందుకు దానిపై పెద్దగా ఆసక్తి చూపడం లేదు అంటే.. కనెక్టీవిటీ, ఇంకా 3జీ దగ్గరే ఉండటం ప్రధాన కారణం.
ఈ నేపథ్యంలో ఈ సమస్య పరిష్కారం కోసం.. బీఎస్‌ఎన్‌ఎల్.. కీలక నిర్ణయాలు తీసుకుంది. దీనిలో భాగంగా టీసీఎస్‌తో జత కట్టడమే కాక.. ఈ ఏడాది ఆగస్టు నుంచే 4 జీ సేవలను ప్రారంభించేందుకు రెడీ అవుతోంది. ఇందుకోసం.. యుద్ధ ప్రాతిపదకన భారీ సంఖ్యలో దేశవ్యాప్తంగా 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. వీటితో పాటు కేంద్ర ప్రభుత్వం.. తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్‌లో బీఎస్‌ఎన్‌ఎల్‌కు భారీ ఎత్తున కేటాయింపుల చేశారు. ప్రభుత్వం అండతో బీఎస్‌ఎన్‌ఎల్ దూసుకుపోతుందని.. ఫలితంగా జియో, ఎయిర్‌టెల్‌కు భారీ నష్టం వాటిల్లబోతుంది అంటున్నారు. ఇంతకు ఏం జరిగిందంటే..
కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ యూనియన్ బడ్జెట్-2024లో టెలికాం ప్రాజెక్టులు, ప్రభుత్వ రంగ కంపెనీల కోసం రూ.1.28 లక్షల కోట్లను కేటాయించారు. ఈ మొత్తంలో అత్యధిక భాగం.. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థలైన బీఎస్‌ఎన్‌ఎల్‌కే కేటాయించడం విశేషం. ఏకంగా రూ.82,916 కోట్లను కేటాయించారు. ఈ మొత్తాన్ని.. బీఎస్‌ఎన్‌ఎల్‌లో సాంకేతిక మెరుగుదల, పునర్నిర్మాణం కోసమే వినియోగించనున్నట్లు తెలుస్తోంది.
ప్రైవేటు టెలికాం సంస్థలైన జియో, ఎయిర్‌టెల్‌లకు గట్టి పోటీ ఇచ్చేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ రెడీ అవుతోంది. ఈ ఏడాది ఆగస్టులోగా 4జీ సేవలను ప్రారంభించడానికి బీఎస్‌ఎన్‌ఎల్ సిద్ధమైంది. జియో, ఎయిర్‌టెల్, వీఐ (వొడాఫోన్ ఐడియా) లాంటి ప్రైవేట్ టెలికాం సంస్థలు.. ఇటీవల తమ టారీఫ్‌లను భారీగా పెంచిన నేపథ్యంలో, చాలా మంది బీఎస్‌ఎన్‌ఎల్ వైపు వెళ్తున్నారు. ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, తమ వినియోగదారులు ఎదుర్కొంటున్న సిగ్నల్ సమస్యలను నివారించేందుకు బీఎస్‌ఎన్‌ఎల్ కీలక నిర్ణయం తీసుకుంది. ఆగస్టులో 4జీ సేవలను ప్రారంభించడానికి ముందే, యుద్ధప్రాతిపదికన భారీ సంఖ్యలో 4జీ టవర్లను ఏర్పాటు చేస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల్లో వారంలోనే సుమారు వెయ్యి 4జీ టవర్లను ఏర్పాటు చేసినట్లు బీఎస్‌ఎన్‌ఎల్ వెల్లడించింది.
4జీ, 5జీ నెట్‌వర్క్‌ల కోసం దేశవ్యాప్తంగా సుమారు 1.12 లక్షల టవర్లను ఇన్‌స్టాల్ చేయనున్నట్లు బీఎస్‌ఎన్‌ఎల్ ఇటీవలే ప్రకటించింది. ఇప్పటికే 12వేల సెల్ టవర్లను ఏర్పాటు చేసింది కూడా. అంతేకాదు 4జీ సేవలు అందించడం కోసం బీఎస్‌ఎన్‌ఎల్-టీసీఎస్, తేజస్ నెట్‌వర్క్, ప్రభుత్వ ఐటీఐతో భాగస్వామ్యం కుదుర్చుకుంది. ప్రైవేట్ టెలికాం కంపెనీలు టారిఫ్‌లు పెంచినప్పటి నుంచి దాదాపు 25 లక్షల మందికిపైగా బీఎస్‌ఎన్‌ఎల్‌కి పోర్ట్ అవ్వడం గమనార్హం.