Dharani
BSNL Tower Installation, Rent: బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ పొందడటమే కాక.. ఇంట్లో ఉంటూనే వేలల్లో సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
BSNL Tower Installation, Rent: బీఎస్‌ఎన్‌ఎల్ ద్వారా తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్ పొందడటమే కాక.. ఇంట్లో ఉంటూనే వేలల్లో సంపాదించుకునే అవకాశం కల్పిస్తోంది. ఆ వివరాలు..
Dharani
గత కొన్ని రోజులుగా ఎక్కడ చూసినా, విన్నా.. బీఎస్‌ఎన్‌ఎల్ పేరు మార్మోగిపోతుంది. అందుకు కారణం ప్రైవేటు టెలికాం కంపెనీలైన జియో, ఎయిర్‌టెల్, వీఐ తమ రీఛార్జ్ ప్లాన్ ధరలను భారీగా పెంచడం. దాంతో చాలా మంది కస్టమర్లు బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారుతున్నారు. అందుకు తగ్గట్టుగానే బీఎస్‌ఎన్‌ఎల్ కూడా తన సేవలను మెరుగుపర్చుకునేందుకు ముమ్మర ప్రయత్నాలు చేస్తోంది. దీనిలో దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకురావడానికి యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టింది. ఇప్పటికే దేశంలోని పలు ప్రాంతాల్లో 4జీ సేవలను తీసుకురాగా.. తాజాగా 5జీ సేవలను కూడా టెస్ట్ చేసింది. ఇదిలా ఉంచితే బీఎస్‌ఎన్‌ఎల్ మీకు మరో బంపరాఫర్ ఇస్తోంది. దీని ద్వారా.. మీరు ఇంట్లో ఉంటూనే.. ఎలాంటి పని చేయకుండా వేల రూపాయలు సంపాదించవచ్చు. ఎలా అంటే..
టెలికాం కంపెనీలు జియో, ఎయిర్‌టెల్, వీఐ తమ రీఛార్జ్ ప్లాన్‌లను పెంచినప్పటి నుండి చాలా మంది వినియోగదారులు బీఎస్‌ఎన్‌ఎల్‌కి మారుతున్నారు. ఈ ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం కూడా అందుకు తగ్గట్టుగానే చర్యలు తీసుకుంటుంది. అత్యుత్తమ సర్వీసులు అందించేందుకు రెడీ అవుతోంది. ఇదుగో ఈ నిర్ణయమే మీకు సంపాదనను తెచ్చి పెడుతుంది. ఎలా అంటే.. మీరు మీ ఇంటి పైకప్పుపై బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను ఏర్పాటు చేసేందుకు అనుమతి ఇస్తే.. మీరు ఎంతో లాభం పొందవచ్చు. ఒక్కసారి మీ మేడ మీద బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేస్తే.. మీరు ప్రతి నెలా ఆదాయం పొందవచ్చు. మీ రూఫ్‌పై బీఎస్‌ఎన్‌ఎల్ టవర్‌ను ఇన్‌స్టాల్ చేయడానికి మీరు ఏం చేయాలంటే..
ఇలా మీరు మీ ఇంటి మేడ మీద సెల్ టవర్ ఇన్‌స్టాలేషన్‌కు ఒప్పుకుంటే.. మీరు ఇంట్లో కూర్చొని డబ్బు సంపాదించవచ్చు. అంతేకాక సదరు కంపెనీ నుంచి రీఛార్జ్ సదుపాయాలను కూడా పొందవచ్చు. సాధారణంగా ఇంటి పైకప్పు మీద టవర్‌ను ఏర్పాటు చేస్తే నెలకు కనీసం రూ.20-రూ.25 వేల వరకు అందిస్తారని సమాచారం. అయితే టవర్ ఇన్‌స్టాలేషన్ వల్ల సంపాదనతో పాటు సమస్యలు కూడా ఉన్నాయి.
అవేంటంటే.. టెలికాం టవర్లు రేడియేషన్‌ను విడుదల చేస్తాయి. దీర్ఘకాలం ఇది మన మీద పడితే క్యాన్సర్ వంటి తీవ్రమైన వ్యాధులకు కారణమవుతుంది. అంతేకాక రేడియేషన్ నిద్రలో అంతరాయాన్ని కలిగిస్తుంది. ఒత్తిడి, ఆందోళనను పెంచుతుంది. కొంతమందికి రేడియేషన్ వల్ల తలనొప్పి, తల తిరగడం వంటి సమస్యలు ఎదుర్కొంటారు. కనుక అన్ని విషయాలను జాగ్రత్తగా ఆలోచించి.. ఆ తర్వాత నిర్ణయం తీసుకోవాలి.
మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ కోసం.. సదరు కంపెనీ నియమించబడిన సంస్థ నుండి నిర్మాణాత్మక భద్రతా ప్రమాణపత్రం, మునిసిపల్ అథారిటీ అనుమతితో పాటు టవర్ వల్ల ఏవైనా నష్టాలు లేదా గాయాలకు తామే బాధ్యత వహిస్తామని పేర్కొంటూ నష్టపరిహార బాండ్‌పై సంతకం చేయడంతో పాటు.. సదరు కంపెనీలకు నివాసితుల మద్దతు ఉంటే వారు జనావాసాల మధ్య మొబైల్ టవర్‌లను ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. అయితే ఇలా ఇన్‌స్టాల్ చేసిన టవర్లు ఆసుపత్రులు మరియు విద్యాసంస్థలకు 100 మీటర్ల కన్నా దూరంలో ఉండాలి.
మొబైల్ టవర్ ఇన్‌స్టాలేషన్ కోసం కంపెనీలు అటవీ ప్రాంతాలను ఎంచుకోవాలని సూచించినప్పటికీ.. సరైన నెట్‌వర్క్ కోసం జనావాసాల్లో టవర్ ఇన్‌స్టాలేషన్‌ను ప్రభుత్వాలు వ్యతిరేకించలేదు. కాకపోతే అనారోగ్య సంమస్యలను దృష్టిలో పెట్టుకుని చాలా మంది నివాసాలపై టవర్ ఇన్‌స్టాలేషన్ కోసం అంగీకరించరు.