Dharani
BSNL Rs 997 Plan: కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం సరికొత్త ప్లాన్స్ తీసుకొస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ మరో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..
BSNL Rs 997 Plan: కస్టమర్లను ఆకట్టుకోవడం కోసం సరికొత్త ప్లాన్స్ తీసుకొస్తున్న బీఎస్‌ఎన్‌ఎల్ మరో అద్భుతమైన ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఆ వివరాలు..
Dharani
ప్రైవేటు టెలికాం సంస్థలు ఏమంటా రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచాయో కానీ.. అప్పటి నుంచి ప్రభుత్వ రంగ టెలికాం దిగ్గజం బీఎస్‌ఎన్‌ఎల్ పంట పండుతుంది. జియో, ఎయిర్‌టెల్ వాటి రీఛార్జ్ ప్లాన్ ధరలను పెంచడంతో.. తీవ్ర అసంతృప్తితో ఉన్న కస్టమర్లు.. బీఎస్‌ఎన్‌ఎల్‌కు మారారు. నెల రోజుల వ్యవధిలోనే లక్షల మంది బీఎస్‌ఎన్‌ఎల్ సిమ్ తీసుకోవడం, పోర్ట్ అవ్వడం వంటివి చేశారు. ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ కావడంతో.. తక్కువ ధరలకే.. అధిక ప్రయోజనాలు ఉండే ప్లాన్లను తీసుకొస్తుంది బీఎస్‌ఎన్‌ఎల్. ఈ క్రమంలో మరో అదిరిపోయే ప్లాన్‌తో వచ్చింది. తక్కువ ధరకే సుమారు 5 నెలల కన్నా ఎక్కువ వ్యాలిడిటీతో పాటు.. ఏకంగా 320 జీబీ డేటా అందించే ప్లాన్‌ను తీసుకొచ్చింది. ఈ దెబ్బతో జియో, రిలయన్స్‌లు మరింత పతనమవ్వడం పక్కా అంటున్నారు. ఆప్లాన్ వివరాలు మీ కోసం..
బీఎస్ఎన్ఎల్ తీసుకొచ్చిన ప్లాన్‌లలో అతి చౌకైన ప్లాన్ గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. అదే రూ. 997 రీఛార్జ్ ప్లాన్. దీని వ్యాలిడిటీ ఐదు నెలల కన్నా ఎక్కువ.. అంటే 160 రోజులు. ఇక దీనిలో భాగంగా ప్రతి రోజూ 2జీబీ డేటా చొప్పున మొత్తం 160 రోజులకు గాను 320జీబీ డేటా అందిస్తున్నారు. దీంతో పాటు రోజు 100 ఎస్‌ఎంఎస్‌లు, అన్‌లిమిటెడ్ కాలింగ్ ఉచితం. వినియోగదారులు ఏదైనా నెట్‌వర్క్‌తో ఉచిత అపరిమిత వాయిస్ కాలింగ్ ఆనందించవచ్చు. ఇవే కాక దేశవ్యాప్తంగా ఉచిత రోమింగ్ ప్రయోజనం కూడా పొందవచ్చు.
నిజానికి రూ. 997 ప్లాన్ అనేది ధర ఎక్కువ అనిపించినా.. 160 రోజుల వ్యాలిడిటీ కనుక పర్వాలేదు అనిపిస్తుంది. ఇతర నెట్‌వర్క్‌లలో మూడు నెలల వ్యాలిడిటీ ఉండే ప్లాన్లు అంటే 84 రోజులు మాత్రమే ఉండే ప్లాన్ల ధరలే 700 నుండి 750 రూపాయల వరకూ ఉంటున్నాయి వాటితో పోలిస్తే బీఎస్‌ఎన్‌ఎల్ ప్లాన్ చాలా బెటర్ అని చెప్పవచ్చు. ఇది ఏకంగా 160 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది.
అయితే బీఎస్‌ఎన్‌ఎల్‌లో తక్కువ ధరకే రీఛార్జ్ ప్లాన్స్ అందుబాటులో ఉన్నా కస్టమర్లు ఎందుకు ఎక్కువగా లేరంటే.. నెటవర్క్ సమస్య. ప్రైవేటు టెలికాం సంస్థలు 5జీ దాటి 6జీ దిశగా పరుగులు తీస్తుండగా.. బీఎస్‌ఎన్‌ఎల్ మాత్రం ఇప్పుడిప్పుడే 4జీపై దృష్టి సారించింది. మొన్నటి వరకు 3జీనే ఉండేది. ఇక ఈ ఏడాది పూర్తయ్యే నాటికి దేశవ్యాప్తంగా బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ సేవలను అందుబాటులోకి తేస్తామని ప్రకటించింది. అంతేకాక వచ్చే ఏడాది నాటికి 5జీ సేవలను ప్రారంభించేందుకు సన్నాహాలు చేస్తోంది. ఇప్పటికే 4జీ సేవల కోసం అన్ని టెలికాం సర్కిల్‌లలో అనేక కొత్త మొబైల్ టవర్లను ఏర్పాటు చేసింది. 5జీ నెట్‌వర్క్ పరీక్షలను ప్రారంభించింది. ఇవన్నీ అందుబాటులోకి వస్తే.. ఇక జియో, ఎయిర్‌టెల్ కంపెనీలు తీవ్ర నష్టాలు చవి చూడాల్సిందే అంటున్నారు టెలికాం రంగ నిపుణులు.