Arjun Suravaram
BSNL 395 Days Prepaid Plan: ఇటీవలే చాలా టెలికాలం సంస్థలు రీఛార్జీ ధరలను పెంచిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ అయినా బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది
BSNL 395 Days Prepaid Plan: ఇటీవలే చాలా టెలికాలం సంస్థలు రీఛార్జీ ధరలను పెంచిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ అయినా బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ తీసుకొచ్చింది
Arjun Suravaram
ఇటీవల కాలంలో టెలికాం రంగంలో అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ముఖ్యంగా 4జీ, 5జీ సేవలను జియో, ఎయిర్ టెల్ వంటి టెలికాం సంస్థలు అందిస్తున్నాయి. అలానే మరికొన్ని సంస్థలు కూడా ఆ దిశగానే అడుగులు వేస్తున్నాయి. కస్టమర్లను ఆకట్టుకునేందుకు టెలికాం సంస్థలు కొత్త కొత్త నిర్ణయాలతో ముందుకు వస్తున్నాయి. ఇది ఇలా ఉంటే… ఇటీవలే చాలా టెలికాలం సంస్థలు రీఛార్జీ ధరలను పెంచిన సంగతి తెలిసింది. ఈ నేపథ్యంలోనే వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ అయినా బీఎస్ఎన్ఎల్ సూపర్ ప్లాన్ అందిస్తుంది. ఏడాది మొత్తంగా ఉపయోగపడే ప్లాన్ ను బీఎస్ఎన్ఎల్ అందిస్తుంది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం..
నేటికాలంలో ప్రతి ఒక్కరి చేతిలో ఫోన్, దానికి రీఛార్జ్ కామన్. ఈక్రమంలో టెలికాం సంస్థలో ఆఫర్లు ఇస్తున్నట్లే ఇస్తూ కస్టమర్లకు షాకిస్తున్నాయి. రీఛార్జ్ ధరలు పెంచుతూ టెలికాం సంస్థలు సంచలన నిర్ణయాలు తీసుకుంటున్న సంగతి తెలిసింది. తొలుత రిలయన్స్ జియో, భారతీయ ఎయిర్ టెల్ రీఛార్జ్ ధరలు పెంచాయి. ఆతరువాత వాటి బాటలో వొడాఫోన్ ఐడియా వెళ్లాయి. దీంతో మూడు నెలలు, ఆరునెలలు, ఏడాది వంటి రీఛార్జ్ ఫ్లాన్ ల ధరలు భారీగా పెరిగాయి. దీంతో సామాన్యులకు గట్టి షాక్ తగినట్లు అయింది. ఈక్రమంలోనే వినియోగదారులకు ప్రభుత్వ సంస్థ టెలికాం సంస్థ అయినా బీఎస్ఎన్ ఎల్ గుడ్ న్యూస్ చెప్పింది. జియో, ఎయిర్ టెల్ కంటే తక్కువ ధరకే ఓ సూపర్ రీఛార్జ్ ప్లాన్ ను ఈ సంస్థ అందిస్తుంది.
బీఎస్ ఎనల్ త్వరలో 4జీ నెట్ వర్క్ లాంఛ్ చేయనుంది. ఈ క్రమంలోనే రూ.2,399 రీఛార్జ్ తో 395 రోజుల ప్రీపెయిడ్ ప్లాన్ ను కొత్తగా తీసుకొచ్చింది. ఈ ప్లాన్ ద్వారా అపరిమిత కాల్స్, రోజూ 2జీబీ డేటా పొందొచ్చు. అలానే డేటా లిమిట్ పూర్తైనా కూడా 40కేబీపీఎస్ వేగంతో ఇంటర్నెట్ ను వినియోగించుకోవచ్చు. మొత్తంగా మిగిలిన టెలికాం సంస్థల రీఛార్జ్ ధరలతో పోలీస్తే..బీఎస్ఎన్ఎల్ చాలా తక్కువనే చెప్పొచ్చు. ఇదే సమయంలో జియోలో ఏడాది 365 రోజుల ప్లాన్ ధర రూ.3,599గా ఉంది. అలానే ఎయిర్ టెల్ లో రూ.3,999గా ఉంది.
బీఎస్ఎన్ఎల్ ఆగస్టులో ఈ సేవలను ప్రారంభించనున్న సంగతి తెలిసింది. ఈ క్రమంలోనే 4జీ సేవను సదరు కంపెనీ పరీక్షిస్తోంది. జియో, ఎయిర్‌టెల్, వొడాఫోన్-ఐడియా తర్వాత బీఎస్‌ఎన్‌ఎల్ 4జీ మార్కెట్లోకి ప్రవేశించింది. ఓ నివేదిక ప్రకారం…బీఎస్ఎన్ ఎల్ పంజాబ్ రాష్ట్రంలో తన సేవలను ప్రారంభించేందుకు సిద్ధమైంది. బీఎస్‌ఎన్‌ఎల్ పైలట్ ప్రాజెక్ట్ కింద దాదాపు 8 లక్షల మంది కొత్త వినియోగదారులు 4జీ నెట్‌వర్క్ సేవలను జోడించినట్లు ఆ సంస్థ తెలిపింది. ఈ క్రమంలోనే బీఎస్ఎన్ తీసుకొచ్చిన ఈ కొత్త పాన్ల్ అందరిని ఆకట్టుకుంటుంది.