iDreamPost
android-app
ios-app

BSNL నుంచి బెస్ట్‌ ప్లాన్‌.. రూ.94 రీఛార్జ్‌తో 30 రోజులు వ్యాలిడిటీ.. డేటా, ఫ్రీకాల్స్‌ అన్నీ

  • Published Jul 16, 2024 | 5:05 PMUpdated Jul 16, 2024 | 5:05 PM

BSNL Rs 94 Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. వంద రూపాయల లోపు రీఛార్జ్‌ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో పాటుగా డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌ అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

BSNL Rs 94 Recharge Plan: బీఎస్‌ఎన్‌ఎల్‌ సరికొత్త ప్లాన్‌ను తీసుకొచ్చింది. వంద రూపాయల లోపు రీఛార్జ్‌ ప్లాన్‌తో 30 రోజుల వ్యాలిడిటీతో పాటుగా డేటా, ఉచిత వాయిస్‌ కాల్స్‌ అందుబాటులోకి తెచ్చింది. ఆ వివరాలు..

  • Published Jul 16, 2024 | 5:05 PMUpdated Jul 16, 2024 | 5:05 PM
BSNL నుంచి బెస్ట్‌ ప్లాన్‌.. రూ.94 రీఛార్జ్‌తో 30 రోజులు వ్యాలిడిటీ.. డేటా, ఫ్రీకాల్స్‌ అన్నీ

టెలికాం కంపెనీలు అన్ని జూలై నెల ఆరంభం నుంచి రీఛార్జ్‌ ప్లాన్స్‌ ధరలను పెంచుతూ నిర్ణయం తీసుకున్నాయి. ఒక్కో ప్యాక్‌ మీద 20 శాతం వరకు పెంచాయి. ఎయిర్‌టెల్‌, జియో, వోడాఫోన్‌ ఇలా అన్ని కంపెనీలు ధరలను పెంచి.. కస్టమర్ల జేబుకు చిల్లు పెడుతున్నాయి. జూలై 4 నుంచి పెరిగిన రీఛార్జ్‌ ధరలు అమల్లోకి వచ్చాయి. రీఛార్జ్‌ ధరల పెంపుపై జనాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయితే దేశంలో అన్ని టెలికాం కంపెనీలు తమ రీఛార్జ్‌ ధరలు పెంచాయి. ఒక్క బీఎస్‌ఎన్‌ఎల్‌ తప్ప. అది మాత్రమే పాత రేట్లలోనే రీఛార్జ్‌ టారిఫ్‌ను అందుబాటులో ఉంచింది. మిగతా వాటితో పోలిస్తే.. బీఎస్‌ఎల్‌లోనే బెస్ట్‌ ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి. మిగతా వాటికి భిన్నంగా ఇక్కడ 100 రూపాయల లోపే నెల వారీ రీఛార్జ్‌ ప్లాన్‌ అందుబాటులో ఉంది.  94 రూపాయల ప్లాన్‌.. 30 రోజుల వ్యాలిడిటీని కలిగి ఉంది.

ఇంత తక్కువ ధరకే రీఛార్జ్‌ ప్లాన్‌ అంటే.. అన్ని సౌకర్యాలు ఉండవేమో అనుకుంటున్నారా.. అయితే మీరు డేటాలో కాలేసినట్లే. ఎందుకంటే.. ఈ రీఛార్జ్‌ ప్లాన్‌లో భాగంగా మీరు మొబైల్‌ డేటా, ఫ్రీకాల్స్‌ అన్ని సర్వీసులు పొందవచ్చు. ఇప్పుడు ఏ కంపెనీ చూసినా 28 రోజులు వ్యాలిడిటీ ఇస్తుంది. కానీ బీఎస్‌ఎన్‌ఎల్‌ మాత్రం వాటికి భిన్నంగా 30 రోజులు వ్యాలిడిటీని ఇస్తుంది.

94 రీఛార్జ్‌తో డేటా, ఫ్రీ కాలింగ్‌..

బీఎస్‌ఎన్‌ఎల్‌ 30 రోజుల చెల్లుబాటుతో రూ.94 రీఛార్జ్ ప్లాన్‌ను తీసుకువచ్చింది. ఈ రీఛార్జ్ ప్లాన్‌లో 3 జీబీ హై స్పీడ్ ఇంటర్నెట్ అందుబాటులో ఉంటుంది. 200 నిమిషాల లోకల్, ఎస్టీడీ కాల్స్ కూడా అందుబాటులో ఉన్నాయి. ఇంత తక్కువ ధరలో ఇన్ని ప్రయోజనాలను అందించే ప్లాన్స్‌ ఏవి జియో, ఎయిర్‌టెల్‌ నుంచి అందుబాటులో లేవు. వోడాఫోన్‌-ఐడియా, ఎయిర్‌టెల్ 4జీబీ డేటాను అందించే రూ.95 రీఛార్జ్ ప్లాన్‌ను కలిగి ఉంది. అయితే దీని వాలిడిటీ 14 రోజులు మాత్రమే. ఇవే కాక బీఎస్‌ఎన్‌ఎల్‌ నుంచి చాలా మంచి ప్లాన్స్‌ అందుబాటులో ఉన్నాయి.

1999 రూ ప్లాన్..

అదే కాకుండా రూ.1999 ప్లాన్‌ కూడా తీసుకువచ్చింది బీఎస్‌ఎన్‌ఎల్‌. ఈ ప్లాన్‌లో వ్యాలిడిటీ ఏడాది ఉంది. ఇది అపరిమిత కాలింగ్, 600జీబీ 4జీ డేటాను అందిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి