P Krishna
BSNL 4G: ఇటీవల జియో, ఎయిర్ టెల్, వీఐ టెలికాం సంస్థలు వరుసగా తమ రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మొబైల్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
BSNL 4G: ఇటీవల జియో, ఎయిర్ టెల్, వీఐ టెలికాం సంస్థలు వరుసగా తమ రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచి మొబైల్ వినియోగదారులకు భారీ షాక్ ఇచ్చారు. ఇలాంటి క్లిష్ట సమయంలో ప్రభుత్వ రంగానికి చెందిన బీఎస్ఎన్ఎల్ వైపు కస్టమర్లు ఎక్కువ మొగ్గు చూపుతున్నట్లు తెలుస్తుంది.
P Krishna
టెక్నాలజీ పెరిగిన తర్వాత కమ్యూనికేషన్ రంగంలో ఎన్నో మార్పులు సంభవించాయి. ఇప్పడు పెద్ద పెద్ద నగరాలే కాదు.. గ్రామీణ స్థాయిలో కూడా స్మార్ట్ ఫోన్లు వాడుతున్నారు. స్మార్ట్ ఫోన్ల వాడకం టెలికాం సంస్థలకు మంచి లాభసాటి బేరం అవుతుంది.వినియోగదారులు అవసరాలు పెరుగుతున్నా కొద్ది టెలికాం సంస్థలు రీచార్జీల ధరలు కూడా పెంచుకుంటూ పోతున్నారు. ఇటీవల జియో చార్జీలు పెంచడం పెంచడం మొదలు పెడితే.. అదే బాటలో ఎయిర్ టేల్, వొడా ఫోన్ ఐడియా సంస్థలు వెళ్లాయి. దీంతో వినియోగాదారులకు ఆయా సంస్థలపై అసంతృప్తి మొదలైనట్లు తెలుస్తుంది. అదే సమయంలో ప్రభుత్వ రంగానికి చెందిన టెలికాం సంస్థ త్వరలో 4G నెట్ వర్క్ లోకి వెళ్తుంది.. దీంతో లక్షలాది మంది బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. తాజాగా బీఎస్ఎన్ఎల్ గురించి మరో ఇంట్రెస్టింగ్ న్యూస్ వైరల్ అవుతుంది. వివరాల్లోకి వెళితే..
ఈ మధ్య కాలంలో దేశీయ టెలికాంలో సంస్థల్లో భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. ముఖ్యంగా జియో, ఎయిర్ టెల్, వీఐ రీఛార్జ్ ధరలను పెంచడంతో వినియోగదారులకు మూలిగే నక్కమీద తాటికాయ పడ్డట్టయ్యింది. దీంతో అందరి దృష్టి BSNL పై పడింది. ఎందుకంటే ఇది ప్రభుత్వ రంగ సంస్థ, డేటా గోప్యత ఎక్కువగా ఉంటుంది. దాంతో పాటు ప్లాన్ ధరలు కూడా చాలా తక్కువ.. అందుకే వినియోగదారులు ఇప్పుడు బీఎస్ఎన్ఎల్ వైపు చూస్తున్నారు. అంతేకాదు ప్రైవేటే కంపెనీలు 5జీ సేవలు అందిస్తుంటే.. బీఎస్ఎన్ఎల్ మాత్రం 4 జీ సేవలు అందించలేక ఇబ్బందులు పడింది. మొన్న జరిగిన బడ్జెట్ సమావేశాల్లో బీఎస్ఎన్ఎల్ కి రూ.82,916 కోట్లు కేటాయించారు.
కేంద్రం బీఎస్ఎన్ఎల్ కి ఇచ్చిన మద్దతు ఇప్పుడు 5జీని తీసుకువస్తే ఆ నెట్ వర్క్ లోకి వెళ్లేందుకు యూజర్లు తెగ ఉత్సాహంగా ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతుంది. అదే జరిగితే ఇక జియో,ఎయిర్‌టెల్, వీఐ వంటి బడా సంస్థలకు పెద్ద దెబ్బే పడబోతున్నట్లు వార్తలు వస్తున్నాయి.అప్పుడైనా ఆయా కంపెనీలు నెట్ వర్క్ ప్లాన్లో మార్పులు తెస్తారో.. బీఎస్ఎన్ఎల్ దెబ్బకు తట్టుకుంటారో చూడాలి. ఇప్పటికే సోషల్ మీడియాలో బాయ్‌కాట్ జియో, బీఎస్ఎన్ఎల్ కి ఘర్ వాపసీ అనే ట్యాగ్స్ ట్రెండింగ్ లోకి వచ్చాయి. మరోవైపు సుమారు పాతిక లక్షల మంది జియో, ఎయిర్‌టేల్, వీఐ కస్టమర్లు మొబైల్ నంబర్ పోర్టబలిటి ద్వారా బీఎస్ఎన్ఎల్ కి మారినట్లు నివేదికలు వస్తున్నాయి.