iDreamPost
android-app
ios-app

ఇక సిమ్ తో పనిలే.. BSNL నుంచి సూపర్ సర్వీస్.. జియో, ఎయిర్టెల్ కి తిప్పలు తప్పవు!

  • Published Nov 07, 2024 | 11:20 AM Updated Updated Nov 07, 2024 | 11:20 AM

BSNL: బిఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

BSNL: బిఎస్ఎన్ఎల్ సంచలన నిర్ణయాలు తీసుకుంటుంది. తాజాగా మరో సంచలన నిర్ణయం తీసుకుంది.

ఇక సిమ్ తో పనిలే.. BSNL నుంచి సూపర్ సర్వీస్.. జియో, ఎయిర్టెల్ కి తిప్పలు తప్పవు!

భారతప్రభుత్వ రంగ సంస్థ అయిన బీఎస్ఎన్ఎల్(BSNL) టెలికాం రంగంలో సెన్సేషనల్ డెసిషన్స్ తీసుకుంటుంటుంది. టెలికాం రంగంలో కొత్త విప్లవాన్ని తెచ్చేందుకు ముండదుగులు వేస్తోంది. ఇప్పటికే లక్షల్లో యూజర్లను సొంతం చేసుకుంది. తాజాగా BSNL మరో సెన్శేషనల్ డెసిషన్ తీసుకుంది. ఇంతకీ BSNL తీసుకున్న తాజా డెసిషన్ ఏంటి? దాని గురించి పూర్తి వివరాలు ఇప్పుడు మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం.

BSNL ఇప్పటికే 4G నెట్ వర్క్‌ ని అందుబాటులోకి తీసుకొచ్చింది. చాలా తక్కువ ఖర్చుతో ఎక్కువ సర్వీసెస్ ఇవ్వడం స్టార్ట్ చేసింది. దీంతో కేవలం రెండు నెలల గ్యాప్ లోనే ఎన్నో లక్షల మంది యూజర్లను పెంచుకుంది. దీంతో JIO, Airtel వంటి సంస్థలు షాక్ అయ్యాయి. ఆకాశం నుంచి కిందకి దిగి వచ్చాయి. BSNL దెబ్బకి తమ ప్లాన్ రీఛార్జ్ ధరలను కూడా తగ్గించే ఆలోచనలోకి వచ్చాయి. అయినా కానీ BSNL ని ఆపలేకపోతున్నాయి. ఇక ఇదిలా ఉంటే తాజాగా BSNL మరో కొత్త టెక్నాలజీని అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలుస్తొంది. ఆ టెక్నాలజీ గురించి విన్నారంటే కచ్చితంగా వావ్ అంటారు. ఇంతకీ ఆ టెక్నాలజీ ఏంటంటే .. సిమ్ లేకుండానే కాల్స్ మెసేజ్‌లు చేసుకోవచ్చు. అలా చేసేలా సరి కొత్త టెక్నాలజీని BSNL కంపెనీ డెవలప్ చేస్తున్నట్లు తెలుస్తోంది.

ఈ కొత్త టెక్నాలజీ వల్ల ఫోన్ లో సిమ్ లేకపోయినా నెట్ వర్క్ లేకపోయినా ఈజీగా కాల్స్ చేయవచ్చు. ఈ టెక్నాలజీ వల్ల విపత్తులు, మారుమూల ప్రాంతాల్లో చిక్కుకుపోయిన, అటవీప్రాంతంలో తప్పిపోయినప్పటికి మనం సర్వీసెస్ ని పొందవచ్చని తెలుస్తుంది. ఈ టెక్నాలజీ పేరు డైరెక్ట్ టూ డివైజ్. అమెరికాకు చెందిన VIASAT (వయాశాట్) కంపెనీతో కలిసి BSNL ఈ టెక్నాలజీని టెస్ట్ చేస్తున్నట్లు సమాచారం తెలుస్తుంది. ఈ టెక్నాలజీ పని ఏంటంటే ఇది శాటిలైట్, లోకల్ మొబైల్ నెట్ వర్క్‌లను లింక్ చేస్తుంది. దాంతో ఇక పై అంతరిక్షంలో ఉన్న శాటిలైట్లే మనకు సెల్ ఫోన్‌ టవర్లుగా మారతాయి. దీని వలన మనకు ఎలాంటి సర్విస్ ప్రాబ్లం ఉండదు. ఎలాంటి మారుమూల ప్రాంతాల్లో అయినా సిగ్నల్స్ వస్తాయి. ఇంటర్నెట్ స్పీడ్ కూడా అద్భుతంగా ఉంటుంది. కాల్స్ చాలా క్లారిటీగా మాట్లాడుకోవచ్చు. మన మెసేజెస్ చాలా ఫాస్ట్ గా డెలివర్ అవుతాయి. త్వరలో ఈ సర్వీసెస్ మనకు రాబోతున్నాయి. ఈ టెక్నాలజీ దెబ్బతో జియో, ఎయిర్టెల్ కంపెనీలు ఔట్ అయ్యే ఛాన్స్ ఉంది. మరి చూడాలి ఈ కొత్త టెక్నాలజీ ఎలా ఉండబోతుందో.. ఇదీ సంగతి. నిజంగా ఇది అద్భుతం కదూ. మరి BSNL తీసుకొస్తున్న ఈ డైరెక్ట్ టూ డివైజ్ టెక్నాలజీ గురించి మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.