iDreamPost
android-app
ios-app

సామాన్యుల కోసం BSNLలో బీభత్సమైన ఆఫర్! ఇక మిగతా కంపెనీలు..!

  • Published Jul 12, 2024 | 9:29 PM Updated Updated Jul 12, 2024 | 9:29 PM

ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలు పెంచడంతో పాటు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారికిగా ఆయా నెట్ వర్క్ యూజర్లు ధరల పెంపుతో ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా BSNL మాత్రం కస్టమర్లను ఆకర్షించేందుకు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలు పెంచడంతో పాటు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారికిగా ఆయా నెట్ వర్క్ యూజర్లు ధరల పెంపుతో ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. ఇలాంటి సమయంలో తాజాగా BSNL మాత్రం కస్టమర్లను ఆకర్షించేందుకు అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

  • Published Jul 12, 2024 | 9:29 PMUpdated Jul 12, 2024 | 9:29 PM
సామాన్యుల కోసం BSNLలో బీభత్సమైన ఆఫర్! ఇక  మిగతా కంపెనీలు..!

ఇప్పుడు ఫోన్ వినియోగించని వారంటూ ఎవరూ ఉండరు. మరి ఈ ఫోన్ వినియోగించాలంటే దానికి రీఛార్జ్ చేయడం కోసం చాలా అవసరం. కానీ, ఈ మద్య కాలంలో మొబైల్ ఫోన్ విరియోగదారులకు షాకుల మీద షాకులు తగిలిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దేశంలో రీఛార్జ్ ధరల పెంపుతో మొబైల్ ఫోన్ యూజర్లకు భారీ షాక్ తగిలిందనే చెప్పవచ్చు. కాగా, ఇప్పటికే జియో, ఎయిర్టెల్, వొడఫోన్ ఐడియాలు వరుసగా ఒకదాని తర్వాత ఒకటి రీఛార్జ్ ధరలు పెంచడంతో పాటు అమలులోకి తీసుకువచ్చిన విషయం తెలిసిందే. దీంతో ఒక్కసారికిగా ఆయా నెట్ వర్క్ యూజర్లు ధరల పెంపుతో ఉక్కిరిబిక్కిరి అవతున్నారు. ఎందుకంటే.. ప్రస్తుతం ఉన్న రీఛార్జ్ ప్లాన్ ధరల కంటే రెట్టింపు ధరలు చేశాయి.

దీంతో మొబైల్ యూజర్లు పెరిగిపోయిన భారీ ధరలను చూసి ఆందోళన చెందుతున్నారు. కానీ, ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ BSNL మాత్రం రీఛార్జ్ ధరల పెంపు విషయం ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు. దీంతో కస్టమర్లు ఆ నెట్ వర్క్ మారుదమని ఆలోచన చేస్తున్నారు. కాగా, ఇప్పటికే తాజాగా బీఎస్ఎన్ఎల్ దేశవ్యాప్తంగా 4జీ సేవలను అందుబాటులోకి తీసుకొస్తున్న విషయం తెలిసిందే.ఈ క్రమంలోనే ఫోన్ వినియోగదారులకను ఆకర్షించేందుకు BSNL తాజాగా రూ. 108 ప్లాన్ ను అందుబాటులోకి తీసుకొచ్చింది. ఆ వివరాళ్లోకి వెళ్తే..

ఇప్పటికే వివిధ నెట్ వర్క్స్ కు చెందిన యూజర్స్ బీఎస్ఎన్ఎల్ కు మారిపోయే ఆలోచనలు చేస్తున్న క్రమంలో తాజాగా BSNL సంస్థ అదిరిపోయే రీఛార్జ్ ప్లాన్లను అందుబాటులోకి తీసుకొస్తుంది. ఇందులో భాగంగానే BSNL తాజాగా రూ.108 ప్లాన్ ను అందుబాటులోకి తెచ్చింది. ఈ ఫ్లాన్..ఇతర టెలికం ఆపరేటర్ల ధరలతో పోలిస్తే తక్కువ, ఎక్కువ బెనిఫిట్స్ లభిస్తున్నాయి. మరి ఆ ప్లాన్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

BSNL కొత్త రీచార్జ్ ప్లాన్
ఈ BSNL రీఛార్జ్ ప్లాన్ రూ.108.మాత్రమే. ఇక దీని  వ్యాలిడిటీ 28 రోజులు పాటు ఉంటుంది. అలాగే ఇందులో అన్ లిమిటెడ్ వాయిస్ కాల్స్, రోజుకు 1GB డేటాను 28 రోజులు పాటు అందిస్తుంది. అయితే ఇందులో రోజుకు ఉచిత 100 SMS లు మాత్రం లేవు.  ఇదిలా ఉంటే.. ప్రస్తుతం జియో , ఎయిర్ టెల్, వొడాఫోన్ ఐడియా రీఛార్జ్ ప్లాన్స్  పోలిస్తే BSNL రూ. 108 రీచార్జ్ ప్లాన్ చాలా తక్కువ ఖర్చు, ఎక్కువ బెనిఫిట్స్ ను అందిస్తుంది. ఇతర టెలికం ఆపరేటర్ల తో పోల్చినప్పుడు 28 రోజులపాటు 1GB డేటాను అన్ లిమిటెడ్ కాల్స్ ను కేవలం రూ. 108ల కే అందిస్తుంది. అయితే బీఎస్ ఎన్ ఎల్ ఇప్పుడు 2G/3G నెట్ వర్క్ తోనే పనిచేస్తుంది. అలాగే  కొన్ని సెలక్ట్ చేసిన నగరాల్లో మాత్రం 4G సేవలు అందిస్తుంది. ఇక మరో నెల రోజుల్లో దేశవ్యాప్తంగా 4G సేవలను అందించేందుకు చర్యలు చేపట్టింది. మరి, ప్రస్తుతం అందుబాటులోకి వచ్చిన BSNL కొత్త రీఛార్జ్ ప్లాన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.