iDreamPost
android-app
ios-app

BSA Gold Star: భారత మార్కెట్లోకి బ్రిటిష్ బైక్! ఆగస్టు 15న లాంచ్ చేస్తున్న మహీంద్రా కంపెనీ!

  • Published Aug 10, 2024 | 9:52 PM Updated Updated Aug 10, 2024 | 9:52 PM

British Compnay Bike Launch On Independence Day: ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తేదీ నాడు భారత్‌లో బ్రిటిష్ కంపెనీ తయారు చేసిన కొత్త బైక్ ఒకటి లాంచ్ అవుతుంది. దీన్ని ప్రముఖ భారత దిగ్గజ కంపెనీ లాంచ్ చేస్తుంది. మరి ఆ బైక్ ప్రత్యేకతలు ఏమిటో చూడండి.

British Compnay Bike Launch On Independence Day: ఇండియాకి ఫ్రీడమ్ వచ్చిన తేదీ నాడు భారత్‌లో బ్రిటిష్ కంపెనీ తయారు చేసిన కొత్త బైక్ ఒకటి లాంచ్ అవుతుంది. దీన్ని ప్రముఖ భారత దిగ్గజ కంపెనీ లాంచ్ చేస్తుంది. మరి ఆ బైక్ ప్రత్యేకతలు ఏమిటో చూడండి.

BSA Gold Star: భారత మార్కెట్లోకి బ్రిటిష్ బైక్! ఆగస్టు 15న లాంచ్ చేస్తున్న మహీంద్రా కంపెనీ!

దేశమంతా ఆగస్టు 15న సంబరాలు చేసుకోవడానికి సిద్ధమైంది. బ్రిటిష్ వారి నిరంకుశ పాలన నుంచి విముక్తి లభించిన రోజు సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను దేశమంతా ఘనంగా జరుపుకుంటారు. అయితే ఇంత మంచి పర్వదినాన దేశీయ దిగ్గజ కంపెనీ బ్రిటిష్ కంపెనీకి చెందిన బైక్ ని భారత్ మార్కెట్లోకి తీసుకొస్తుంది. బ్రిటిష్ కంపెనీతో చేతులు కలిపిన ప్రముఖ దేశీయ ఆటోమొబైల్ కంపెనీ సరికొత్త మోటార్ సైకిల్స్ ని ఇండియన్ మార్కెట్లో ప్రవేశపెడుతుంది.     

దేశీయ ఆటోమొబైల్ దిగ్గజం మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ గురించి తెలిసే ఉంటుంది. ట్రాక్టర్లు, కార్లు, ట్రక్కులు వంటి వాహనాల తయారీలో దేశంలోనే దిగ్గజ ఆటోమొబైల్ కంపెనీల జాబితాలో ఉంది. తాజాగా మహీంద్రా అండ్ మహీంద్రా కంపెనీ.. యూకేకి చెందిన క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ బైక్ ని భారత్ మార్కెట్లో ప్రవేశపెడుతుంది. బీఎస్ఏ గోల్డ్ స్టార్ పేరుతో సరికొత్త వింటేజ్ మోటార్ సైకిల్ ని లాంచ్ చేస్తుంది. క్లాసిక్ లెజెండ్స్ ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీ మహీంద్రా గ్రూప్ కి అనుబంధ సంస్థగా ఉంది. ఈ కంపెనీలో మహీంద్రా కంపెనీ వాటా 60 శాతంగా ఉంది. మహీంద్రా కంపెనీ బ్రిటిష్ కంపెనీని 2016లో కొనుగోలు చేసింది. ఈ బైక్ ఉత్పత్తి ఆగిపోయిన 50 ఏళ్ల తర్వాత అంటే 2021లో మహీంద్రా నుంచి మొదటి బైక్ వచ్చింది. మోడర్న్ క్లాసిక్ బీఎస్ఏ గోల్డ్ స్టార్ 650 పేరుతో మొదటి బైక్ ని లాంచ్ చేసింది. ఈ మోటార్ సైకిల్ తొలిసారిగా 1910లో బ్రిటిష్ కంపెనీ లాంచ్ చేసింది.

యుద్ధాల సమయంలో ఈ బైక్స్ ని సైన్యం బాగా వాడేది. రెండవ ప్రపంచ యుద్ధం తరువాత ఈ మోటార్ సైకిల్ కి క్రేజ్ వచ్చింది. 1960లో ప్రపంచవ్యాప్తంగా పాపులారిటీ సంపాదించుకుంది. అయితే 1970లో ఈ మోటర్ సైకిల్ తయారీ నిలిచిపోయింది. మళ్ళీ ఇన్నాళ్లకు ఈ బైక్ వస్తుంది. ఇప్పటికే అంతర్జాతీయ మార్కెట్లో ఈ మోటార్ సైకిల్ విక్రయాలు జరుగుతున్నాయి. భారత మార్కెట్లో మాత్రం ఆగస్టు 15న రానున్నాయి. ఇది రెండు ఎడిషన్స్ లో వస్తుంది. గోల్డ్ స్టార్, లెగసీ ఎడిషన్స్ లో వస్తుంది. ఇన్సిగ్నియ రెడ్, మిడ్ నైట్ బ్లాక్, డాన్ సిల్వర్, హైల్యాండ్ గ్రీన్, షాడో బ్లాక్ ఎడిషన్స్ లో అలానే.. సిల్వర్ షీన్ లెగసీ ఎడిషన్ లో వస్తుంది. ఇది 12 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ కెపాసిటీతో వస్తుంది. సింగిల్ సిలిండర్, 652 సీసీ లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ తో వస్తుంది. 5 స్పీడ్ గేర్ బాక్స్ తో వస్తుంది. ఇక దీని ధర 3 లక్షల నుంచి 3.5 లక్షల రేంజ్ లో ఉంటుందని అంచనా. మరి ఆగస్టు 15న ఈ బ్రిటిష్ బైక్ ని మహీంద్రా కంపెనీ తీసుకొస్తుండడంపై మీ అభిప్రాయమేమిటో కామెంట్ చేయండి.