iDreamPost
android-app
ios-app

Bottle Umbrella: చేతిలో ఇమిడిపోయే క్యాప్సుల్ ఫోల్డింగ్ బాటిల్ గొడుగులు..

  • Published Sep 02, 2024 | 9:02 PM Updated Updated Sep 02, 2024 | 9:02 PM

Capsule Folding Bottle Umbrella: ఇప్పుడంతా కాలం మారిపోయింది. చేతిలో ఇమిడిపోయేలా వస్తువులని చిన్నగా తయారు చేస్తున్నారు. వాడేటప్పుడు పెద్దగా ఉన్నా మడతపెట్టేటప్పుడు చేతిలో ఇమిడిపోయే సైజులో తయారు చేస్తున్నారు. గొడుగులు కూడా ఇప్పుడు జబ్బు చేస్తే వేసుకునే ట్యాబ్లెట్స్ సైజులో వచ్చేశాయి.

Capsule Folding Bottle Umbrella: ఇప్పుడంతా కాలం మారిపోయింది. చేతిలో ఇమిడిపోయేలా వస్తువులని చిన్నగా తయారు చేస్తున్నారు. వాడేటప్పుడు పెద్దగా ఉన్నా మడతపెట్టేటప్పుడు చేతిలో ఇమిడిపోయే సైజులో తయారు చేస్తున్నారు. గొడుగులు కూడా ఇప్పుడు జబ్బు చేస్తే వేసుకునే ట్యాబ్లెట్స్ సైజులో వచ్చేశాయి.

Bottle Umbrella: చేతిలో ఇమిడిపోయే క్యాప్సుల్ ఫోల్డింగ్ బాటిల్ గొడుగులు..

వర్షాకాలంలో బయటకు వెళ్లే ప్రతి ఒక్కరి దగ్గర ఖచ్చితంగా ఉండాల్సిన వస్తువులు గొడుగు, రెయిన్ కోట్. రెయిన్ కోట్ అంటే మళ్ళీ పైన రెయిన్ షర్ట్, కింద ప్యాంటు.. వేసుకోవాలి. బైక్ పై వెళ్లేవారికి రెయిన్ కోటే ఉండాలి. నడిచి వెళ్లేవారికి, బస్సుల్లో వెళ్లేవారికి మాత్రం గొడుగు అనేది మంచి ఛాయిస్. పైగా రెయిన్ కోట్ కొనాలంటే 500 రూపాయలు పైనే. ఆ రెయిన్ కోట్ ఒకేసారి ఒకరికి మాత్రం ఉపయోగం ఉంటుంది. అదే గొడుగు అయితే ఇద్దరు అడ్జస్ట్ చేసుకోవచ్చు. మంచి గొడుగు తక్కువ ధరకే చిన్నగా చేతిలో ఇమిడిపోయే గొడుగు కొనాలి అనుకునేవారికి ఈ గొడుగులు బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆక్వాగో వైన్ బాటిల్ గొడుగులు ఉన్నాయి. వైండ్ ప్రూఫ్ డబుల్ లేయర్ గొడుగులు ఇవి.

యూవీ, రెయిన్ ప్రొటెక్షన్ కోసం బాటిల్ కవర్ తో వస్తుంది. ఇది పురుషులకు, స్త్రీలకు, పిల్లలకు బాగా సూట్ అవుతుంది. చూడ్డానికి ఇది అచ్చం వాటర్ బాటిల్ లానే ఉంటుంది. వాటర్ బాటిల్ సైజులో ఉంటుంది. కాబట్టి వర్షాలు లేనప్పుడు సులువుగా క్యారీ చేయవచ్చు. తెరిస్తే గొడుగు, మూస్తే వాటర్ బాటిల్ లా ఉంటుంది. దీని అసలు ధర రూ. 599 కాగా ఆఫర్ లో రూ. 209కే అందుబాటులో ఉంది. ఇది నీలం, తెలుపు, ఎరుపు, ఆకుపచ్చ సహా అనేక రంగుల్లో లభిస్తుంది. గొడుగుని మడిస్తే 30 సెంటీమీటర్ల పొడవు ఉంటుంది. ఒక స్కేల్ అంత పొడవు ఉంటుంది. తెరిస్తే 58 సెంటీమీటర్ల పొడవు, 100 సెంటీమీటర్ల వెడల్పు వస్తుంది. అడుగుల్లో చెప్పాలంటే సుమారు రెండు అడుగుల పొడవు, 3 అడుగుల కన్నా ఎక్కువ వెడల్పు కలిగి ఉంటుంది.

ఇందులోనే మరొక రకం గొడుగు ఉంది. ఇదైతే మనం వేసుకునే మాత్ర సైజులో ఉంటుంది. గొట్టం ట్యాబ్లెట్ సైజులో ఉంటుంది. దీని పేరు క్యాప్సుల్ ఫోల్డింగ్ బాటిల్ గొడుగు. ఇది కూడా చేతిలో ఇమిడిపోయే సైజులో ఉంటుంది. వర్షాలు ఎప్పుడు పడతాయో తెలియదు కాబట్టి దీన్ని డైలీ సులువుగా క్యారీ చేయవచ్చు. చిన్నగా ఉండడం వల్ల ప్రత్యేకించి ఒక వస్తువు మోస్తున్న ఫీలింగ్ ఉండదు. దీని అసలు ధర రూ. 999 కాగా ఆఫర్ లో రూ. 419కే అందుబాటులో ఉంది. ఈ గొడుగుని ఓపెన్ చేస్తే 99 సెంటీమీటర్ల వెడల్పు వస్తుంది. ఇది పసుపు, మెరూన్, పింక్ వంటి పలు రంగుల్లో లభిస్తుంది. మన్నికైన అల్లాయ్ స్టీల్ మెటీరియల్ తో తయారు చేయబడింది ఈ గొడుగు.