Arjun Suravaram
కొందరు రాత్రికి రాత్రే విపరీతమైన డబ్బులు సంపాదించాలని కలలు కంటు ఉంటారు. మరికొందరు ఏదైన పనిచేసి డబ్బులు సంపాదిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉద్యోగాలు చేసి కొందరు కష్ట పడుతుంటే, బిజినెస్ లో మరికొందరు రాణిస్తుంటారు
కొందరు రాత్రికి రాత్రే విపరీతమైన డబ్బులు సంపాదించాలని కలలు కంటు ఉంటారు. మరికొందరు ఏదైన పనిచేసి డబ్బులు సంపాదిస్తుంటారు. ఈ క్రమంలోనే ఉద్యోగాలు చేసి కొందరు కష్ట పడుతుంటే, బిజినెస్ లో మరికొందరు రాణిస్తుంటారు
Arjun Suravaram
ప్రతి ఒక్కరికీ అధికంగా సంపాదించాలనే కోరిక ఉంటుంది. అయితే చాలా మందికి ఉండే ఎక్కువ సంపాదించేలానే కోరిక..కోరికగానే మిగిలి పోతుంది. కారణం.. వారికి సరైన ఐడియాలు లేకపోవడం, పరిస్థితులు అనుకూలించకపోవడం. అయితే కొందరు మాత్రం తమకు ఉన్న అవకాశాలను సద్వినియోగం చేసుకుని భారీగా సంపాదిస్తున్నారు. ఇలాంటి నేపథ్యంలో లక్షలు సంపాదించేందుకు కొన్ని ఐడియాలు మనకు తారసపడుతుంటాయి. అలాంటి ఓ ఐడియానే మీ ముందుకు వచ్చింది. అది కూడా అతి తక్కువ ఖర్చుతో భారీగా ఆదాయం సంపాదించే ఆలోచన. అటవీ శాఖలో అందిస్తున్నబంపర్ ఆఫర్ ఇది. మరి.. ఆ వివరాలు ఏమిటో ఇప్పుడు చూద్దాం…
ప్రస్తుతం కాలంలో చాలా మంది సొంత వ్యాపారం చేయాలని కోరుకుంటారు. అయితే కొందరు మాత్రమే బిజినెస్ లు ప్రారంభించి.. రాణిస్తుంటారు. ఎక్కువ మంది బిజినెస్ ను ప్రారంభించకపోవడానికి కారణం పెట్టుబడి సమస్య. ఎక్కువ పెట్టుబడి పెట్టే సామర్థ్యం లేక వెనుకడుగు వేస్తుంటారు. అయితే తక్కువ పెట్టుబడితో కూడా లక్షల ఆదాయం సంపాదించవచ్చు. చాలా మంది వ్యవసాయంలో కూడా తమ టాలెంట్ చూపించి బాగా రాణిస్తుంటారు. కొన్నిరకాల మొక్కలను నాటి కాపాడితే అవి పెరిగి పెద్ద అయ్యాక మార్కెట్ లో వాటిని కళ్లు చెదిరే డిమాండ్ ఉంటుంది. ఆ విషయం చాలా తక్కువ మందికి మాత్రమే తెలుసు. నేటికాలంలో చాలా మంది ఇలాంటి చెట్లు పెట్టి కొందరు కోటిశ్వరులౌతున్నారు.
నిపుణుల అభిప్రాయం ప్రకారం…ప్రత్యేక జాతుల చెట్లను పెంచితే బాగా డబ్బులు సంపాదించవచ్చు. టేకు, రోజ్ వుడ్, మహోగని మొక్కలు ఈ జాబితాలో ఉన్నాయి. కొన్ని చెట్లను నరికి వేసే ముందు అటవీ శాఖకు తెలియజేయడం తప్పనిసరి. అదే విధంగా టేకు, రోజ్ వుడ్ వంటి చెట్లను పెంచాలంటే సంబంధిత అధికారుల అనుమతి తప్పని సరిగా తీసుకోవాలి. బిహార్ లోని సారయ్యమన్ పక్షుల అభయారణ్యం పరిధిలో వచ్చే ఫారెస్ట్ డివిజన్ బెత్తయ్య ఉద్యోగి విపిన్ కుమార్ కొన్ని కీలక విషయాలను వెల్లడించారు. ఎవరైన అటవీ శాఖ నుంచి విలువైన చెట్లను మొక్కలను కేవలం 10 రూపాయలకు కొనుగోలు చేయవచ్చు. మహోగని, టేకు, శిషాం, యూకలిప్టస్, అర్జున్, గంహర్, గోల్డ్ మోహర్, జామ, కరంజ్ మొదలైన చెట్లు ఉన్నాయి. అటవీ శాఖ నుంచి ఈ మొక్కలను కొనుగోలు చేయడానికి రెండు మార్గాలు ఉన్నాయని విపిన్ తెలిపారు.
ముఖ్యమంత్రి అటవీ పథకం కింద .. మొక్కులు కొనుగోలు చేస్తే ఒక్కొక్క మొక్కుకు రూ.10 మాత్రమే కాకుండా మూడేళ్ల తరువాత పెరిగిన మొక్కల సంరక్షణ కోసం ప్రభుత్వం రూ.60 చెల్లిస్తుంది. అంతేకాక పెరిగిన మొక్కల కొనుగోలు చేస్తే వచ్చిన మొత్తం కూడా మీకు తిరిగి వస్తుంది. మరో మార్గం ఏమిటంటే.. ఈ ప్రత్యేక మొక్కలను అటవీ డివిజన్ నుంచి సాధారణ ప్రక్రియ ద్వారా కొనుగోలు చేయవచ్చు. నిపుణుల అభిప్రాయం ప్రకారం..మహోగని, టేకు, శిషం, గంహర్, అర్జున్ మొదలైన మొక్కలు చాలా విలువైనవి. అవి ఎదగడానికి 10-15 సంవత్సరాలు పడుతుంది, కానీ ఆ తర్వాత అవి మిమ్మల్ని లక్షాధికారిని చేయగలదని తెలిపారు. మరి.. ఈ మొక్కల పెంపకం ఐడియాపై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.