Dharani
Airtel Q1 Results: ఎయిర్‌టెల్ పంట పండింది.. భారీ లాభాలు చవి చూసింది. తాజాగా వెల్లడించిన త్రైమాసిక ఫలితాల్లో ఎయిర్‌టెల్ భారీ లాభాలను నమోదు చేసింది. ఆ వివరాలు..
Airtel Q1 Results: ఎయిర్‌టెల్ పంట పండింది.. భారీ లాభాలు చవి చూసింది. తాజాగా వెల్లడించిన త్రైమాసిక ఫలితాల్లో ఎయిర్‌టెల్ భారీ లాభాలను నమోదు చేసింది. ఆ వివరాలు..
Dharani
జియో రాకముందు వరకు కూడా టెలికాం రంగంలో నంబర్ వన్ స్థానంలో దూసుకుపోయింది ఎయిర్‌టెల్. జియో తెచ్చిన ఆఫర్ల వల్ల కొన్నాళ్ల పాటు వెనకబడ్డ ఆ తర్వాత పుంజుకుంది. వినియోగదారులకు మెరుగైన సౌకర్యాలు అందిస్తూ.. టెలికాం రంగంలో అగ్రగామిగా నిలుస్తోంది. ఇలా ఉండగా తాజాగా ఎయిర్‌టోల్ త్రైమాసిక ఫలితాలన్ని ప్రకటించింది. లాభాలను భారీగా పెంచుకుంది. గత ఏడాది ఇదే సమయంతో పోలిస్తే.. ఈ సంవత్సరానికి భారీ లాభాలను నమోదు చేసింది. ఈ విషయాలను కంపెనీ తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఆ వివరాలు..
తాజాగా ఎయిర్‌టెల్ త్రైమాసిక ఫలితాల్ని ప్రకటించింది. సమీక్షా త్రైమాసికంలో ఎయిర్‌టెల్ ఏకీకృత ప్రాతిపదికన రెండున్నర రెట్ల లాభం నమోదు చేసింది. అంతకు ముందు ఏడాది ఇదే సమయంలో ఎయిర్‌టెల్ లాభం.. రూ.1612.5 కోట్లు ఉండగా.. ఈ ఆర్థిక సంవత్సరం మొదటి త్రైమాసికంలో ఈ లాభం రూ.4160 కోట్లకు చేరింది. అలానే కంపెనీ కార్యకలాపాల ఆదాయం 2.8శాతం ఎగబాకి.. రూ.37,440 కోట్ల నుంచి 38,506.4 కోట్లకు చేరినట్లు.. తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఇదేకాక దేశీయంగా వచ్చే రాబడి 10.1 శాతం వృద్దితో రూ.29,046కోట్లకు చేరింది. టెలికాం సంస్థల ఆదాయాల్ని కొలవడంలో కీలకమైన పాయింట్.. ఆర్పు(ఏఆర్‌పీయూ). అంటే టెలికాం కంపెనీకి ఒక వ్యక్తి నుంచి వచ్చే సగటు ఆదాయం అన్నమాట. ఇక ఈ ఏడాది ఎయిర్‌టెల్ ఆర్పు 211 రూపాయలకు పెరగడం విశేషం.
అంతకుముందు ఇదే సమయంలో ఆర్పు.. రూ. 200 గా ఉంది. అయితే జూలైలో ఎయిర్‌టెల్ రీఛార్జ్ ప్లాన్స్ ధరలను భారీగా పెంచింది. దాంతో ఈ ఆర్పు పెరిగిందని చెప్పొచ్చు. ఆర్పు విషయంలో ఎయిర్‌టెల్.. ఇతర టెలికాం సంస్థల్ని పక్కకు పెట్టి.. ముందువరుసలో ఉండటం విశేషం. అలానే 4జీ, 5జీ కస్టమర్ల సంఖ్య కూడా క్యూ1లో 67 లక్షల మందికిపైగా పెరిగినట్లు ఫలితాల వెల్లడి సందర్భంగా సంస్థ ప్రకటించింది. డేటా వినియోగం 26 శాతం పెరిగిందని.. దీంతో ఒక్కో కస్టమర్ సగటున నెలకు 23.7 జీబీ డేటా వినియోగిస్తున్నట్లు ఎయిర్‌టెల్ చెప్పుకొచ్చింది.
ఎన్నికలు ముగిసిన తర్వాత ముందుగా జియో.. రీఛార్జ్ ప్లాన్ రేట్లను పెంచగా.. తర్వాత వెంటనే ఎయిర్‌టెల్ కూడా రీఛార్జి ధరల్ని పెంచుతున్నట్లు ప్రకటించింది. ఒక్కో ప్లాన్ రేటుపై సుమారు 11 నుంచి 21 శాతం వరకు రేట్లు పెంచగా.. ప్రస్తుతం రీఛార్జి ధరలు ఎయిర్‌టెల్‌లోనే ఎక్కువగా ఉన్నాయి.