Dharani
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలని భావిస్తున్నారా.. అయితే మీకోసం మేం ఇప్పుడు ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాం. దీనిలో నో రిస్క్.. భారీగా లాభాలు పొందే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు..
తక్కువ పెట్టుబడితో మంచి లాభాలు పొందాలని భావిస్తున్నారా.. అయితే మీకోసం మేం ఇప్పుడు ఒక బెస్ట్ బిజినెస్ ఐడియా చెప్పబోతున్నాం. దీనిలో నో రిస్క్.. భారీగా లాభాలు పొందే ఛాన్స్ ఉంది. ఆ వివరాలు..
Dharani
నేటి కాలంలో వ్యాపారం చేయాలనుకునే వారి సంఖ్య భారీగా పెరుగుతోంది. అయితే బిజినెస్ అంటే చాలా డబ్బులు పెట్టుబడి పెట్టాలి. సక్సెస్ అవుతామనే గ్యారెంటీ లేదు. మరి ఏం చేయాలి. అలాంటి వారికి బెస్ట్ ఆప్షన్.. సీజనల్ వ్యాపారాలు. పండగలు, కాలాలకు తగ్గట్టుగా వ్యాపారం చేసే వారికి లాభమే తప్ప నష్టం ఉండదు. పైగా ఈ సీజనల్ బిజినెస్‌లకు పెట్టుబడి తక్కువ.. రిస్క్ ఉండదు. లాభం మాత్రం పక్కా. మన అదృష్టం బాగుంటే.. నెలల వ్యవధిలోనే లక్షలు సంపాదించగలం. అలా ఈ వేసవి కాలానికి సెట్ అయ్యే ఒక బిజినెస్ ఐడియా గురించి ఇప్పుడు మీకు చెప్పబోతున్నాం. దీనిలో రిస్క్ తక్కువ.. లాభం గ్యారెంటీ. అన్ని కలిసి వస్తే.. నెలల వ్యవధిలోనే మీరు లక్షలు సంపాదించుకోవచ్చు. ఇంతకు ఆ బిజినెస్ ఐడియా ఏంటి అంటే..
వేసవి కాలానికి బెస్ట్ బిజినెస్ ఐడియా.. కొబ్బరి బోండాల వ్యాపారం. ఎండాకాలంలో వీటికి ఉండే డిమాండ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. వాస్తవానికి ఏడాదంతా ఈ వ్యాపారం చేసుకోవచ్చు. కానీ వేసవిలో మాత్రమే దీనికి డిమాండ్ ఎక్కువ.. భారీగా లాభాలు పొందేందుకు అవకాశం ఉంది. వేసవి తాపాన్ని తగ్గించుకోవడం కోసం జనాలు ఎండాకాలంలో ఎక్కువగా కొబ్బరి నీళ్లు తాగుతుంటారు. ఇక నేటి కాలంలో అందరికి ఆరోగ్యం మీద స్పృహ పెరిగింది. దాంతో కూల్‌డ్రింక్స్ వైపు వెళ్లకుండా కొబ్బరి నీళ్లు తాగడానికే ఆసక్తి చూపుతున్నారు. దాంతో వేసవిలో వీటికి డిమాండ్ ఎక్కువ. మీరు గనక ఈ వ్యాపారం ప్రారంభిస్తే.. లాభమే తప్ప నష్టం ఉండదు అంటున్నారు నిపుణులు.
ఇక కొబ్బరి బొండాల బిజినెస్ ప్రారంభానికి భారీగా డబ్బులు అక్కర్లేదు. 20-30 వేల రూపాయలు చాలు అంటున్నారు. మీ వద్ద ఉన్న డబ్బుతో.. పట్టణాల్లో, సిటీల్లో, ఓ హైవే పక్కనే ఓ పెద్ద నీడ ఉన్న చెట్టు చూసుకుని.. కొబ్బరి బోండాలు బిజినెస్ ఎంచక్కా సెట్ చేసుకోవచ్చు. మనకి ప్రస్తుతం ఏపీలోని గోదావరి జిల్లాలతో పాటు బెంగళూరు నుంచి బోండాలు సరఫరా అవుతున్నాయి. ఒకవేళ మీరు గోదావరి బోండాల వ్యాపారం పెట్టాలనుకుంటే.. ఒక్కో బోండం మీ వద్దకు చేరేసరికి 25 నుంచి 30 రూపాయలు పడుతుంది. ఇక ఇప్పుడు వేసవిలో ఒక్కో బోండం 50 నుంచి 60 రూపాయల వరకు అమ్ముడవుతుంది. అంటే ఒక్కో బోండానికి 20 రూపాయల లాభం ఎటూ పోదు.
ఇలా రోజుకు తక్కువలో తక్కువ 200 కాయలు అమ్ముకున్నా.. 4000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అలా నెల రోజులకు చూసుకుంటే.. మీకు లక్షా 20 వేలు ఆదాయం వస్తుంది. పైన 20 వేలు వివిధ కారణాల వల్ల తీసేసుకున్నా లక్ష రూపాయల లాభం ఎటూ పోదు. అలా ఎండాకాలం తీవ్రత ఉండే ఈ 2 నెలలు వీటిని అమ్ముకున్నా.. కొద్ది రోజుల్లోనే 2 లక్షలు మీరు వెనకేసుకోవచ్చు. అయితే ఇక్కడ మీరు ప్రారంభించే వ్యాపారం విజయం సాధించాలంటే ముఖ్యంగా చేయాల్సింది.. సరైన ప్రాంతం ఎంపిక చేసుకోవడం చాలా ముఖ్యమైన విషయం. రద్దీ బాగా ఉండే ప్రాంతాన్ని ఎంపిక చేసుకుంటే.. ఎక్కువ వ్యాపారం జరిగి.. లాభాలు కళ్ల చూస్తారు అంటున్నారు నిపుణులు.