Reusable Sanitary Pads: ఇవి ఉంటే పదే పదే శానిటరీ ప్యాడ్స్ కొనే అవసరం ఉండదు.. బోలెడంత డబ్బు ఆదా!

ఇవి ఉంటే పదే పదే శానిటరీ ప్యాడ్స్ కొనే అవసరం ఉండదు.. బోలెడంత డబ్బు ఆదా!

Reusable Sanitary Pads: పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు ఎంత చిరాకుగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అయితే ప్యాడ్స్ ని అస్తమానూ మార్చాల్సి ఉంటుంది. దీని వల్ల డబ్బు వృధా. అదే ఈ రీయూజబుల్ ప్యాడ్స్ ని వాడితే కనుక మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.

Reusable Sanitary Pads: పీరియడ్స్ సమయంలో అమ్మాయిలకు ఎంత చిరాకుగా ఉంటుందో ప్రత్యేకించి చెప్పాల్సిన పని లేదు. పీరియడ్స్ టైంలో అధిక రక్తస్రావం అయితే ప్యాడ్స్ ని అస్తమానూ మార్చాల్సి ఉంటుంది. దీని వల్ల డబ్బు వృధా. అదే ఈ రీయూజబుల్ ప్యాడ్స్ ని వాడితే కనుక మీకు చాలా డబ్బు ఆదా అవుతుంది.

మహిళలకు పీరియడ్స్ వచ్చినప్పుడు శానిటరీ ప్యాడ్స్ ధరించడం గురించి తెలిసిందే. అయితే కొంతమందికి ఒక రోజులో నాలుగైదు శానిటరీ ప్యాడ్స్ ని మార్చాల్సి వస్తుంది. ఇలా పీరియడ్స్ వచ్చిన ప్రతిసారీ ప్యాడ్స్ కోసం బోలెడంత డబ్బు ఖర్చు చేయాల్సి ఉంటుంది. అయితే మీరు మళ్ళీ మళ్ళీ వాడుకునే శానిటరీ ప్యాడ్స్ ని తీసుకున్నట్లైతే మీకు చాలా డబ్బు అనేది ఆదా అవుతుంది. ప్రతిసారీ శానిటరీ ప్యాడ్స్ ని కొనే అవసరం ఉండదు. మరి ఆ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ఏంటి? వాటిలో ఎన్ని రకాలు ఉన్నాయి? వాటితో కలిగే ప్రయోజనాలు ఏంటి? ధర ఎంత? అనే వివరాలు మీ కోసం. 

ఈ శానిటరీ ప్యాడ్స్ లో చాలా రకాలు ఉన్నాయి. వీటిలో ఎక్కువగా రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్, రీయూజబుల్ మెన్స్ట్రువల్ కప్స్, పీరియడ్ అండర్ వేర్, రీయూజబుల్ ట్యాంపన్లు, రీయూజబుల్ క్లాత్ ప్యాడ్స్ వంటివి ఉన్నాయి. ఇవి సాధారణ శానిటరీ ప్యాడ్స్ లా యూజ్ అండ్ త్రో ప్యాడ్స్ కాదు.. వీటిని శుభ్రం చేసుకుని ఎన్ని సార్లు అయినా వాడుకోవచ్చు. బీఎంసీ హెల్త్ అధ్యయనం ప్రకారం.. రీయూజబుల్ శానిటరీ ప్రాడెక్ట్స్ ని వాడే మహిళలు 37 శాతం మంది ఉన్నారు. వీరిలో పీరియడ్ అండర్ వేర్ ప్యాడ్స్ వాడేవాళ్లు 24 శాతం, మెన్స్ట్రువల్ కప్స్ వాడేవారు 17 శాతం మంది, రీయూజబుల్ ప్యాడ్స్ ని వాడేవారు 5 శాతం మంది ఉన్నారు.   

మెన్స్ట్రువల్ కప్స్:

మెన్స్ట్రువల్ కప్స్ అనేవి శానిటరీ ప్యాడ్స్ తో పోలిస్తే చాలా అడ్వాన్స్డ్ గా ఉంటాయి. ఇవి ధరించిన తర్వాత 8 గంటల సేపు మీరు రిలాక్స్డ్ గా ఉండచ్చు. ఎలాంటి ఇబ్బంది కలిగించదు. ఇవి బయట మార్కెట్లోనూ అలానే ఆన్ లైన్ లో కూడా దొరుకుతున్నాయి. ఆన్ లైన్ లో 250 రూపాయల నుంచి 550 రూపాయల మధ్యలో ఉన్నాయి. పీ సేఫ్, సిరోనా, ఐ-యాక్టివ్ వంటి వివిధ కంపెనీలకు చెందిన మెన్స్ట్రువల్ కప్స్ ఉన్నాయి. వీటిని ధరించడం కూడా సులువే. సైజులను బట్టి మీకు సూట్ అయ్యేదాన్ని ఎంపిక చేసుకోవచ్చు.  

  • సిరోనా రీయూజబుల్ మెన్స్ట్రువల్ కప్స్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • పీ సేఫ్ రీయూజబుల్ మెన్స్ట్రువల్ కప్స్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • ఐ-యాక్టివ్ మెన్స్ట్రువల్ కప్స్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

రీయూజబుల్ ప్యాడ్స్:

రీయూజబుల్ ప్యాడ్స్.. ఇవి సాధారణ శానిటరీ ప్యాడ్స్ లానే ఉంటాయి. పీ సేఫ్, సిరోనా వంటి బ్రాండ్స్ ఈ రీయూజబుల్ ప్యాడ్స్ ని విక్రయిస్తున్నాయి. 3 రెగ్యులర్ ప్యాడ్స్+ ఒక ఓవర్ నైట్ ప్యాడ్ తో మొత్తం 4 ప్యాడ్స్ ని ఇస్తున్నారు. వీటి వల్ల ర్యాషెస్ రావు, స్కిన్ ఫ్రెండ్లీగా ఉంటాయి. వీటిలో పీ సేఫ్ కంపెనీకి చెందిన శానిటరీ ప్యాడ్స్ 60 వాష్ ల వరకూ మన్నుతుంది. ఇవి 300 రూపాయలుగా ఉన్నాయి. ఆన్ లైన్ లో కూడా అందుబాటులో ఉన్నాయి.  

  •  పీ సేఫ్ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • సిరోనా రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • రీప్యాడ్ రీయూజబుల్ శానిటరీ ప్యాడ్స్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

పీరియడ్ అండర్ వేర్:

ఇవి చూడ్డానికి అండర్ వేర్ లా ఉంటాయి. కానీ ఇవి చాలా సౌకర్యవంతంగా ఉంటాయి. లీకేజీ టెన్షన్ ఉండదు. రెండేళ్ల వరకూ కూడా మళ్ళీ మళ్ళీ వాడుకునే విధంగా వీటిని తయారు చేశారు. అయితే వీటిని ఒకరోజు మాత్రమే వాడుకోవాలి. ఆ తరువాత శుభ్రం చేసి పూర్తిగా ఆరిన తర్వాత మళ్ళీ వాడుకోవచ్చు. పైన చెప్పిన వాటితో పోలిస్తే ఇవి కాస్త ధర ఎక్కువగా ఉంటాయి. 499 రూపాయల నుంచి 1199 రూపాయల రేంజ్ లో ఉన్నాయి. 

  • మహిన పీరియడ్ అండర్ వేర్ కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 
  • హెల్త్ ఫ్యాబ్ పీరియడ్ అండర్ వేర్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి. 

ఒక మహిళ తన జీవిత కాలంలో 350 ప్యాకెట్ల శానిటరీ ప్యాడ్స్ వాడుతున్నట్లు నివేదికలు చెబుతున్నాయి. ఈ శానిటరీ ప్యాడ్స్ భూమిలో కరగడానికి 800 ఇల్లు పడుతుంది. అయితే రీయూజబుల్ ఉత్పత్తులు వాడడం వల్ల పర్యావరణానికి మేలు జరగడమే గాక మహిళలకు కూడా ప్రయోజనకరంగా ఉంటాయి. అయితే వీటి వల్ల ఇన్ఫెక్షన్స్ వస్తాయన్న భయం అక్కర్లేదు. సాధారణ శానిటరీ ప్యాడ్స్ తో పోలిస్తే ఈ రీయూజబుల్ ఉత్పత్తులను సరైన పద్ధతిలో వాడితే ఇన్ఫెక్షన్ ప్రభావం తక్కువగా ఉంటుందని నిపుణులు చెబుతున్నారు. అయితే మీరు ఈ ఉత్పత్తులను కొనుగోలు చేసే ముందు, చేసిన తర్వాత ఎలా వినియోగించాలో అనేది తెలుసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. కాబట్టి ఈ కథనాన్ని మీ బంధు మిత్రులకు షేర్ చేయండి. వారిలో మహిళలు ఉంటే వారు ఈ రీయూజబుల్ ఉత్పత్తులపై అవగాహన పెంచుకుంటారు.      

Show comments