iDreamPost
android-app
ios-app

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే భూమి! ఇప్పుడే కొంటే లక్షల్లో లాభం!

  • Published Apr 26, 2024 | 4:40 PM Updated Updated Apr 26, 2024 | 4:40 PM

హైదరాబాద్ లో ఇప్పుడు చెప్పుకోబోయే ప్రాంతాల్లో తక్కువ ధరకే భూమి దొరకడమే కాదు. ఫ్యూచర్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టే విధంగా భూముల ధరలు పెరగనున్నాయి. మరి ఇప్పుడు కొంటే లక్షల్లో లాభాలు తెచ్చిపెట్టే ఏరియాల వివరాలు మీ కోసం. 

హైదరాబాద్ లో ఇప్పుడు చెప్పుకోబోయే ప్రాంతాల్లో తక్కువ ధరకే భూమి దొరకడమే కాదు. ఫ్యూచర్ లో భారీ లాభాలను తెచ్చిపెట్టే విధంగా భూముల ధరలు పెరగనున్నాయి. మరి ఇప్పుడు కొంటే లక్షల్లో లాభాలు తెచ్చిపెట్టే ఏరియాల వివరాలు మీ కోసం. 

హైదరాబాద్‌లోని ఈ ప్రాంతాల్లో తక్కువ ధరకే భూమి! ఇప్పుడే కొంటే లక్షల్లో లాభం!

సిటీలోపల తక్కువ ధరకి భూములు దొరకడం అంటే అసాధ్యం. గజం లక్ష పైనే ఉంది. సిటీకి 20, 30 కిలోమీటర్లు వెళ్లినా గానీ గజం 30 వేల నుంచి 50 వేల రేంజ్ లో ఉంది. మరి ఇంకా తక్కువ ధరకు స్థలాలు ఎక్కడ దొరుకుతాయి అనంటే మీరు ఇంకొంచెం దూరం వెళ్లాల్సి ఉంటుంది. అలా అని ఆ ఏరియాలని తక్కువ అంచనా వేయడానికి వీల్లేదు. ఎందుకంటే హైదరాబాద్ అనేది ఇప్పుడు విస్తరిస్తోంది. ఒకప్పుడు హైదరాబాద్ అంటే కేవలం కొన్ని ఏరియాలు మాత్రమే అన్నట్టు ఉండేది. ఇప్పుడు సీన్ మారింది. భూమికి డిమాండ్ పెరుగుతుండడం.. ప్రాపర్టీలు కొనేవాళ్ళు పెరిగిపోతుండటం వంటి కారణాల వల్ల స్థలాల కొరత లేకుండా శివారు ప్రాంతాలను కూడా డెవలప్ చేస్తున్నారు. సిటీలోకి రావడం కోసం కనెక్టివిటీని కూడా బాగా డెవలప్ చేస్తున్నారు. దీని వల్ల ఎక్కడున్నా ఏ మూలన ఉన్నా గానీ హైదరాబాద్ సిటీలోకి సులువుగా రావచ్చు అనే ధీమాతో స్థలాలు కొనేందుకు ముందుకు వస్తున్నారు.

అలాంటి స్థలాలు ఉన్న ఏరియా గురించి చెప్పుకోవాలంటే ముందుగా బెంగళూరు హైవే గురించి చెప్పుకోవాలి. ఫ్యూచర్ లో బెంగళూరుని మించేలా ఇక్కడ ఐటీ హబ్ అనేది డెవలప్ అవుతోంది. హైదరాబాద్ లో బెంగళూరు హైవే అనేది పెట్టుబడికి అనువైన ప్రదేశంగా చాలా మంది చెబుతున్నారు. హైవే వెంబడి ఉన్న షాద్ నగర్, నందిగామ, మహేశ్వరం ఏరియాలు కూడా పెట్టుబడికి అనువైన ఏరియాలుగా ఉన్నాయి. ఇన్వెస్ట్ చేయాలనుకునేవారు దృష్టిని ఆకర్షించడానికి అనేక కారణాలు ఉన్నాయి. వీటిలో ప్రధానమైంది.. షాద్ నగర్ హైదరాబాద్-బెంగళూరు హైవేకి దగ్గరగా ఉంది. అలానే అవుటర్ రింగ్ రోడ్ కి కూడా దగ్గరగా ఉంది.

Lands in Hyd

ఒక్కసారి రీజనల్ రింగ్ రోడ్ ప్రారంభమైతే కనుక సిటీ అనేది మరింత విస్తరిస్తుంది. షాద్ నగర్ లో ఫార్మా సిటీ అనేది వస్తుంది. దీని వల్ల ధరలు విపరీతంగా పెరిగిపోతాయి. బెంగళూరు హైవే అనేది పూర్తిగా ఫ్యామిలీ మెంబర్స్ కి అనువైన రెసిడెన్షియల్ సెక్టార్ గా ఉంది. ఈజీగా ప్రయాణించేందుకు బెంగళూరు హైవే మెట్రోకి దగ్గరగా ఉంది. బ్యాంకులకు కూడా మంచి కనెక్టివిటీ కలిగి ఉంది ఈ బెంగళూరు హైవే. ఎటు చూసినా గానీ దాదాపు అన్ని బ్యాంకులు కనబడతాయి. చాలా స్కూల్స్ కి, కాలేజెస్ కూడా ఈ బెంగళూరు హైవే అనేది దగ్గరగా ఉంది. అలానే హాస్పిటల్స్ కి, మర్కెట్స్ కి కూడా దగ్గరగా ఉంది. ఇన్ని ప్రయోజనాలు ఉన్నాయి కాబట్టే రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కి బెంగళూరు హైవేకి డిమాండ్ పెరిగింది. ఫ్యూచర్ లో భూముల ధరలు పెరుగుతాయి కాబట్టి ఇప్పుడు కొనుక్కోవడం మంచిది.

బెంగళూరు హైవే వెంబడి ఉన్న షాద్ నగర్ లో స్థలం రేటు చదరపు అడుగు రూ. 1,550 గా ఉంది. అంటే గజం 15 వేల లోపే ఉంది. అలానే మహేశ్వరం ఏరియాలో చదరపునా అడుగు రూ. 1650 ఉంది. ఇక్కడ కూడా గజం 15 వేల లోపే ఉంది. ఆ తర్వాత పెట్టుబడికి అనుకూలంగా ఉన్న ఏరియా నందిగామ. ఇక్కడ చదరపు అడుగు స్థలం రూ. 2950గా ఉంది. గజం 25 వేల పైనే ఉంది. ఇక బెంగళూరు హైవే మీద స్థలం అయితే చదరపు అడుగు 1600 రూపాయలుగా ఉంది. ఇప్పుడు చెప్పిన ఏరియాల్లో 200 గజాల స్థలం కొనాలంటే 27 లక్షలు, 28 లక్షలు, 29 లక్షలు, 30 లక్షల రేంజ్ లో ఉన్నాయి. ఫ్యూచర్ లో గజం 30 వేలు, 50 వేలు అయితే సగాని కంటే ఎక్కువ లాభాలు పొందవచ్చునని నిపుణులు చెబుతున్నారు.