iDreamPost
android-app
ios-app

19 ఏళ్ల పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. మీ ఖాతాల్లో 14 లక్షలు! పోస్టాఫీస్ నుంచి మరో స్కీం

  • Published May 25, 2024 | 9:16 AM Updated Updated May 25, 2024 | 9:16 AM

14 Lakhs In Parent Account: 19 ఏళ్ళ వయసున్న పిల్లలు ఉన్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. పోస్ట్ ఆఫీస్ నుంచి అద్భుతమైన పథకం ఉంది. ఈ పథకంలో చేరితే తల్లి లేదా తండ్రి ఖాతాలో 14 లక్షల రూపాయలు పడతాయి. ఆ పథకం ఏంటంటే?

14 Lakhs In Parent Account: 19 ఏళ్ళ వయసున్న పిల్లలు ఉన్నారా? అయితే ఈ గుడ్ న్యూస్ మీ కోసమే. పోస్ట్ ఆఫీస్ నుంచి అద్భుతమైన పథకం ఉంది. ఈ పథకంలో చేరితే తల్లి లేదా తండ్రి ఖాతాలో 14 లక్షల రూపాయలు పడతాయి. ఆ పథకం ఏంటంటే?

19 ఏళ్ల పిల్లలున్న వారికి గుడ్ న్యూస్.. మీ ఖాతాల్లో 14 లక్షలు! పోస్టాఫీస్ నుంచి మరో స్కీం

రూపాయే కదా అని తేలిగ్గా తీసి పడేయడానికి లేదు. ప్రతి రోజూ రూపాయి చొప్పున పొదుపు చేస్తే ఏడాదయ్యేసరికి 365 రూపాయలు అవుతాయి. అదే 10 రూపాయల చొప్పున పొదుపు చేస్తే 3650 రూపాయలు. అదే 100 రూపాయల చొప్పున దాస్తే 36,500 అవుతుంది. చిన్న అమౌంట్ అయితే కాదు ఇది. అయితే ఈ మొత్తాన్ని ఇంట్లో పొదుపు చేసే కంటే పోస్టాఫీస్ పథకంలో పెట్టుబడి పెడితే వడ్డీ వస్తుంది. దాంతో పాటు అనేక ఇతర ప్రయోజనాలు పొందవచ్చు. పిల్లలు ఎదిగే సమయానికి లక్షల్లో డబ్బు చేతికి వస్తుంది. ఆ సమయంలో వారికి ఆ డబ్బు చాలా ఉపయోగకరంగా ఉంటుంది. పైగా పోస్ట్ ఆఫీస్ పథకాలు రిస్క్ లేని పథకం. పెట్టిన ప్రతి రూపాయి రెట్టింపు అయ్యి మీ ఖాతాల్లో పడుతుంది. దీని కోసం మీరు ఈ పథకంలో చేరాలి.

అదే పోస్ట్ ఆఫీస్ గ్రామ్ సుమంగళ్ డాక్ జీవన బీమా యోజన. 19 ఏళ్ల వయసున్న పిల్లలున్న కుటుంబాలకు ఆర్థిక ప్రయోజనాలను అందించేందుకు ఈ పథకాన్ని ప్రవేశపెట్టారు. ఇది కాలానుగుణంగా రాబడితో పాటు లైఫ్ ఇన్సూరెన్స్ కవరేజ్ ని అందించే మనీ బ్యాక్ ప్లాన్ గా ఉపయోగపడుతుంది. 19 ఏళ్ల వయసున్న వారి నుంచి 45 ఏళ్ల మధ్య వయసున్న వారి వరకూ ఏ వయసు వారైనా ఈ పథకంలో చేరవచ్చు. రోజూ 95 రూపాయల పెట్టుబడితో మెచ్యూరిటీ సమయంలో 14 లక్షల రూపాయలు పొందవచ్చు. పాలసీ వ్యవధి 15 ఏళ్ళు, 20 ఏళ్ళు రెండు రకాల పథకాలు ఉన్నాయి. 15 ఏళ్ల వ్యవధిలో పాలసీదారుడు.. ఆరేళ్ళు, తొమ్మిదేళ్లు, పన్నెండేళ్ళు తర్వాత 20 శాతం వరకూ.. అలానే మెచ్యూరిటీ సమయంలో బోనస్ తో పాటు మిగిలిన 40 శాతం కూడా పొందవచ్చు. 20 ఏళ్ల వ్యవధిలో పాలసీదారుడు.. 8 ఏళ్ళు, 12 ఏళ్ళు, 16 ఏళ్ల తర్వాత 20 శాతం వరకూ.. అలానే మెచ్యూరిటీ సమయంలో బోనస్ తో పాటుగా మిగిలిన 40 శాతం పొందవచ్చు.

ఒకవేళ పాలసీదారులు మధ్యలో చనిపోతే బోనస్ తో పాటు మొత్తాన్ని నామినీగా ఎవరైతే ఉంటారో వారు అందుకుంటారు. రోజూ 95 రూపాయల చొప్పున 20 ఏళ్ల వరకూ 7 లక్షలు పెట్టుబడి పెడితే మెచ్యూరిటీ సమయంలో 14 లక్షల రాబడి వస్తుంది.రోజూ 95 రూపాయలు పెట్టకపోయినా నెలకు రూ. 2,853, మూడు నెలలకు ఒకసారి రూ. 8,850, ఆరు నెలలకొకసారి రూ. 17,100 చొప్పున కట్టచ్చు. ఈ పథకంలో చేరాలంటే సమీప పోస్ట్ ఆఫీస్ కి వెళ్లి అప్లై చేసుకోవాలి. కావాల్సిన డాక్యుమెంట్స్ ని సబ్మిట్ చేసి ఖాతా తెరవచ్చు. ఇక మీకు ఎప్పుడు వీలయితే అప్పుడు డబ్బు డిపాజిట్ చేస్తూ వెళ్ళాలి. ఇలా చేస్తే మెచ్యూరిటీ సమయానికి మీ పిల్లల భవిష్యత్తు కోసం 14 లక్షల రూపాయలు వస్తాయి. ప్రభుత్వ పథకం కాబట్టి రిస్క్ తక్కువ ఉంటుంది. పాలసీదారు చనిపోతే వచ్చే జీవిత బీమా.. వారి కుటుంబ భవిష్యత్తుకు భద్రతగా నిలుస్తుంది. మరి ఇన్ని ప్రయోజనాలు ఉన్న ఈ పథకంలో చేరి మీ పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట వేయండి.