iDreamPost
android-app
ios-app

Best Budget Car: రూ.6 లక్షల్లోపే.. సిటీ లైఫ్ కి బెస్ట్ హ్యాచ్ బ్యాక్!

మారుతీ కంపెనీ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ కారు అందుబాటులో ఉంది. సిటీ లైఫ్ కి అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

మారుతీ కంపెనీ నుంచి ఒక బెస్ట్ బడ్జెట్ కారు అందుబాటులో ఉంది. సిటీ లైఫ్ కి అది బెస్ట్ ఆప్షన్ అవుతుంది.

Best Budget Car: రూ.6 లక్షల్లోపే.. సిటీ లైఫ్ కి బెస్ట్ హ్యాచ్ బ్యాక్!

మన అవసరాలను బట్టి ఎలా అయితే కారుని సెలక్ట్ చేసుకుంటామో.. మనం డ్రైవ్ చేసే పరిస్థితులను బట్టి కూడా కారును ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే మీరు డ్రైవ్ చేసే కండిషన్స్ కి తగిన కారుని మీరు ఎంపిక చేసుకోకపోతే నిత్యం అనేక ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఊర్లలో అయితే మీరు ఎలాంటి కారుని సెలక్ట్ చేసుకున్నా పెద్ద తేడా ఉండదు. కాకపోతే సిటీ అనేసరికి మీరు కచ్చితంగా డ్రైవింగ్ కండిషన్స్ కి తగిన కారుని కొనుగోలు చేయాల్సి ఉంటుంది. నగరాలు అనగానే ట్రాఫిక్, పార్కింగ్ ఇబ్బందులు ఎక్కువగా ఉంటాయి. అలాంటి కండిషన్స్ కి ఈ కారు అయితే పర్ఫెక్ట్ కాంబినేషన్ అవుతుంది.

ఇప్పుడు చెప్పుకోబోయేది మారుతీ సుజుకీకి చెందిన హ్యాచ్ బ్యాక్ ఇగ్నిస్ గురించి. ఈ ఇగ్నిస్ అనేది లుక్స్ పరంగా ఎంతో స్టైలిష్ గా ఉంటుంది. అంతేకాకుండా ట్రాఫిక్ లో అయితే ఈ కారుతో ఎంతో సులభంగా డ్రైవ్ చేయచ్చు. అంతేకాకుండా పార్కింగ్ సమస్యలు దాదాపుగా తగ్గిపోతాయని చెప్పాలి. ఎందుకంటే సాధారణ హ్యాచ్ బ్యాక్లతో పోలిస్తే.. ఈ కారుని పార్క్ చేయడానికి చాలా తక్కువ ప్లేస్ సరిపోతుంది. మరి.. ఈ కారు ఫీచర్స్, స్పెసిఫికేషన్స్, ధర గురించి తెలుసుకుందాం. మారుతీ ఇగ్నిస్ సిగ్మా, డెల్టా, జీటా, ఆల్ఫా అనే మొత్తం 4 వేరియంట్లలో లభిస్తోంది. దీని బేస్ మోడల్ ఎక్స్ షో రూమ్ ధర రూ.5.84 లక్షల నుంచి ప్రారంభం అవుతుంది. అలాగే వేరియంట్ మారుతున్న కొద్దీ ధర కూడా పెరుగుతూ ఉంటుంది. హైఎండ్ మోడల్ ఎక్స్ షోరూమ్ ధర రూ.8.16 లక్షలుగా ఉంది.

ఇంజిన్ విషయానికి వస్తే.. 1.2 లీటర్ పెట్రోల్ ఇంజిన్ తో వస్తోంది. ఇది 83పీఎస్/ 113 ఎన్ఎం టార్క్ ని ప్రొడ్యూస్ చేస్తుంది. ఇందులో మీకు మాన్యువల్, ఆటోమేటిక్ ట్రానిషన్స్ అందుబాటులో ఉన్నాయి. మీరు ఏ ట్రాన్సిషన్ ఎంచుకున్నా మైలేజ్ మాత్రం లీటరుకు 20.89 కిలోమీటర్లు ఇస్తుందని కంపెనీ క్లయిమ్ చేస్తోంది. ఇంక ఫీచర్స్ విషయానికి వస్తే.. ఇందులో 7 ఇంచెస్ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, యాపిల్ కార్ ప్లే, యాండ్రాయిడ్ ఆటో కూడా ఉన్నాయి. హీఆర్ఎల్ తో ఎల్ఈడీ ప్రొజెక్టెడ్ హెడ్ ల్యాంప్స్ ఉన్నాయి. ఆటోమేటిక్ క్లయిమెట్ కంట్రోల్ కూడా ఈ కారులో అందుబాటులో ఉంది. సేఫ్టీ గురించి కూడా మాట్లాడుకోవాలి.

ఈ ఇగ్నిస్ లో డ్యూయల్ ఎయిర్ బ్యాగ్స్ ఉన్నాయి. ఈబీడీతో కూడిన ఓబీఎస్ సిస్టమ్ ఉంది. అలాగే వెనుక వైపు పార్కింగ్ సెన్సార్స్ కూడా ఉన్నాయి. ఈ కారు టాటా టియాగో, మారుతీ వ్యాగన్ ఆర్, మారుతీకి చెందిన సెలేరియో మోడల్స్ తో పోటీ పడుతూ ఉంటుంది. ఈ కారు ముఖ్యంగా సిటీ లైఫ్ కి ఎందుకు బెటర్ అంటే ఈ కారు పవర్ విషయానికి వస్తే.. 83 పీఎస్ తో వస్తోంది. నిజానికి ఇది లాంగ్ డ్రైవ్, హైవే డ్రైవ్ కి సెట్ కాకపోవచ్చు. కానీ, సిటీ లైఫ్ కి మాత్రం చాలా బాగా యాప్ట్ గా ఉంటుంది. కాస్త తక్కువ పవర్ కాబట్టి ఇది మంచి మైలేజ్ ఇచ్చేందుకు దోహద పడుతుంది. అలాగే డైమెన్షన్స్, లుక్స్ పరంగా ఇగ్నిస్ కాస్త చిన్నగా ఉంటుంది. అలాగని కంఫర్ట్ విషయంలో పెద్దగా కాంప్రమైజ్ కాలేదు. సైజ్ కాస్త చిన్నగా ఉండటం వల్ల ట్రాఫిక్, పార్కింగ్ సమస్యలు చాలా తక్కువగా ఉంటాయి. మరి.. ఈ మారుతీ ఇగ్నిస్ ధర, ఫీచర్స్, స్పెసిఫికేషన్స్ పై మీ అభిప్రాయాలను కామెంట్స్ రూపంలో తెలియజేయండి.