iDreamPost
android-app
ios-app

రిస్క్ లేని వ్యాపారం.. ఈ మొక్కలు పెంచితే లక్షల్లో సంపాదన..

  • Published Apr 08, 2024 | 5:04 PM Updated Updated Apr 08, 2024 | 5:04 PM

Aloe Vera Gel And Powder Manufacturing Unit: తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసి అధిక లాభాలు ఆర్జించాలనుకునే వారి కోసం ఇక్కడ ఓ వ్యాపార ైడియాను పరిచయం చేస్తున్నాం. ఆ వివరాలు..

Aloe Vera Gel And Powder Manufacturing Unit: తక్కువ పెట్టుబడితో వ్యాపారం చేసి అధిక లాభాలు ఆర్జించాలనుకునే వారి కోసం ఇక్కడ ఓ వ్యాపార ైడియాను పరిచయం చేస్తున్నాం. ఆ వివరాలు..

  • Published Apr 08, 2024 | 5:04 PMUpdated Apr 08, 2024 | 5:04 PM
రిస్క్ లేని వ్యాపారం.. ఈ మొక్కలు పెంచితే లక్షల్లో సంపాదన..

వ్యాపారం చేయాలనుకునే వారు ముందుగా ఆలోచించేది.. రిస్క్, పెట్టుబడి తక్కువగా ఉండి.. ఓ మోస్తరుగా లాభాలు వచ్చినా చాలనుకుంటారు. అలా కాకుండే ముందే భారీ ఎత్తున పెట్టుబడి పెట్టి.. వ్యాపారరంగంలోకి ప్రవేశిస్తే.. నష్టపోయే అవకాశాలే అధికం. మీరు కూడా ఇలానే బిజినెస్ చేయాలనే ఆలోచనలో ఉంటే మీ కోసం మంచి బిజినెస్ ఐడియా గురించి చెప్పబోతున్నాం. ఇప్పుడు మేం చెప్పబోయే వ్యాపారం ప్రారంభించడానికి పెట్టుబడి తక్కువ. నష్టాలు వచ్చే అవకాశం తక్కువే.. పైగా దీనికి ప్రభుత్వం నుంచి సబ్సిడీ కూడా లభిస్తుంది. ఇంతకు ఆ బిజినెస్ ఏంటంటే..

ఎక్కువ శ్రమ లేకుండా తక్కువ పెట్టుబడితో వ్యాపారాన్ని ప్రారంభించి ఎక్కువ లాభం పొందాలి అనుకుంటున్నారా. అయితే మీ కోసమే ఈ బిజినెస్ ఐడియా. అదే కలబంద మొక్కల పెంపకం. ప్రస్తుతం మార్కెట్ లో దీనికి ఎంత భారీ డిమాండ్ ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. అందం, ఆరోగ్యం కోసం కలబంద గుజ్జును వాడే వారు సమాజంలో ఎందరో ఉన్నారు. ఆ కారణంగా అలోవెరాకు చాలా డిమాండ్ ఏర్పడింది.

మీరు వ్యాపారం చేయాలనుకుంటే.. అలోవెరా జెల్ ప్రాసెసింగ్ ఫ్యాక్టరీని ప్రారంభించవచ్చు. కలబంద ఆకుల నుండి అలోవేరా జెల్, పొడిని తయారు చేస్తారు. అలోవెరా జెల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు ఎంత ఖర్చవుతుంది అనే దాని గురించి ఖాదీ అండ్ విలేజ్ ఇండస్ట్రీస్ కమిషన్ ఓనివేదిక ఇచ్చింది. దీని ప్రకారం అలోవెరా జెల్ తయారీ యూనిట్ ఏర్పాటుకు రూ.24.83 లక్షలు అవసరం. అమ్మో అంత భారీ పెట్టుబడా అని మీరు భయపడాల్సిన పని లేదు.

Money earn by alovera tree

ఈ మొత్తంలో మీరు చెల్లించాల్సింది కేవలం రూ. 2.48 లక్షలు మాత్రమే. మిగిలిన పెట్టుబడి మొత్తాన్ని లోన్ రూపంలో పొందవచ్చు. కేంద్ర ప్రభుత్వం అందించే ముద్రా యోజన కింద మీరు లోన్ తీసుకొని ఈ అలోవేరా జెల్ తయారీ యూనిట్ ని ప్రారంభించవచ్చు. అలోవెరా జెల్ యూనిట్‌ను ప్రారంభించడానికి జీఎస్టీ రిజిస్ట్రేషన్ అవసరం. మీ ప్రోడక్ట్ కి బ్రాండ్ పేరు, ట్రేడ్‌మార్క్ కూడా పొందాలి. అన్ని ఏర్పాట్లు పూర్తి చేసిన తర్వాత, మీరు అలోవెరా జెల్ తయారు చేయడం ప్రారంభించవచ్చు.

మీరు కనక స్వచ్ఛమైన, నాణ్యమైన జెల్‌ను తయారు చేసి మరింత ప్రచారం చేస్తే.. వ్యాపారం ప్రారంభించిన తొలి నాళ్ల నుంచే సంపాదన మొదలవుతుంది. ఒక్కసారి కనుక మీ ప్రొడక్ట్ క్లిక్ అయితే తక్కువ కాలంలోనే మీరు సంవత్సరానికి రూ. 13 లక్షల వరకు సంపాదించవచ్చు. మీరు మొదటి సంవత్సరంలో దాదాపు రూ.4 లక్షల లాభం పొందుతారు. మీరు అలోవెరా జెల్ ఫ్యాక్టరీని పెద్ద ఎత్తున మాత్రమే కాకుండా చిన్న స్థాయిలో కూడా తయారు చేయవచ్చు.

మీరు మీ ఇంట్లో కలబంద మొక్కను పెంచడం, అలోవెరా ఆకులను అమ్మడం ద్వారా కూడా డబ్బు సంపాదించవచ్చు. అలోవెరా జెల్ ఇంట్లో కూడా తయారు చేసుకోవచ్చు. అలోవెరా జెల్‌లో విటమిన్ ఎ, సి, విటమిన్ బి12, యాంటీ ఇన్‌ఫ్లమేటరీ ఇంకా యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు పుష్కలంగా ఉంటాయి.