nagidream
Budget Laptops: బడ్జెట్ లో బెస్ట్ ల్యాప్ టాప్స్ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్ టాప్ కొనాలంటే కనీసం 40, 50 వేలు పైనే పెట్టుబడి పెట్టాలి. అయితే మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు అంతకంటే తక్కువ బడ్జెట్ లో 8 బెస్ట్ ల్యాప్ టాప్స్ ని మీ కోసం తీసుకొచ్చాం. మరి ఆ ల్యాప్ టాప్స్ లో మీకు బాగా సూటయ్యే ల్యాప్ టాప్ ఏంటో తెలుసుకోండి.
Budget Laptops: బడ్జెట్ లో బెస్ట్ ల్యాప్ టాప్స్ కొనాలని ప్రతి ఒక్కరికీ ఉంటుంది. మంచి పెర్ఫార్మెన్స్ ఇచ్చే ల్యాప్ టాప్ కొనాలంటే కనీసం 40, 50 వేలు పైనే పెట్టుబడి పెట్టాలి. అయితే మంచి పెర్ఫార్మెన్స్ తో పాటు అంతకంటే తక్కువ బడ్జెట్ లో 8 బెస్ట్ ల్యాప్ టాప్స్ ని మీ కోసం తీసుకొచ్చాం. మరి ఆ ల్యాప్ టాప్స్ లో మీకు బాగా సూటయ్యే ల్యాప్ టాప్ ఏంటో తెలుసుకోండి.
nagidream
ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ల్యాప్ టాప్ అనేది చాలా అవసరం. ప్రాజెక్ట్ వర్క్ కోసం, ప్రాక్టికల్ నాలెడ్జ్ కోసం, వినోదం కోసం ఇలా అనేక రకాల అవసరాల కోసం ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి ల్యాప్ టాప్ అనేది చాలా అవసరం. అయితే ఎలాంటి ల్యాప్ టాప్ కొనాలి? ఏ బడ్జెట్ లో కొనాలి? ఎలాంటి ల్యాప్ టాప్ సూట్ అవుతుంది వంటి వాటిలో అవగాహన ఉండాలి. అయితే ఈ కథనంలో ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కోసం బెస్ట్ బడ్జెట్ ల్యాప్ టాప్స్ ని తీసుకురావడం జరిగింది.
హానర్ మ్యాజిక్ బుక్ 14 ల్యాప్ టాప్ 14 అంగుళాల డిస్ప్లే సైజ్ తో వస్తుంది. ఇది స్టూడెంట్స్ కి, బిజినెస్ ప్రొఫెషనల్స్ కి బాగా సూట్ అవుతుంది. ఏఎండీ రైజెన్ 5 ప్రాసెసర్ తో వస్తుంది. 1.5 కేజీ బరువుతో.. 65 వాట్ యూఎస్బీ సీ ఛార్జర్ ఆప్షన్ తో ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఫాస్ట్ గా వర్క్ చేసుకునేందుకు 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ కెపాసిటీతో వస్తుంది. ఆన్ లైన్ లో ఇది రూ. 33,900కే అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్పైక్లిక్ చేయండి.
బడ్జెట్ లో దొరికే ల్యాప్ టాప్స్ లో యాసర్ యాస్పైర్ ల్యాప్ టాప్ కూడా ఒకటి. ఇది 15.6 అంగుళాల స్క్రీన్ తో వస్తుంది. ఇది స్లిమ్ మెటల్ బాడీతో 1.59 కిలోల బరువుతో వస్తుంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో వస్తుంది. మల్టీటాస్కింగ్ ల్యాప్ టాప్ గా ఇది వస్తుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ స్టోరేజ్ స్పేస్ తో వస్తుంది. ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తున్న ఈ ల్యాప్ టాప్ విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంతో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 52,990 కాగా ప్రస్తుతం ఆఫర్ లో రూ. 31,999కే అందుబాటులో ఉంది. హెచ్డీఎఫ్సీ క్రెడిట్ కార్డ్స్ మీద 1000 డిస్కౌంట్ లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
లెనోవో ఐడియా ప్యాడ్ స్లిమ్ 3 ల్యాప్ టాప్.. ఇది 14 అంగుళాల స్క్రీన్ సైజ్ తో వస్తుంది. ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్, 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. విండోస్ 11 ఓఎస్ తో వస్తుంది. అలానే మైక్రోసాఫ్ట్ ఆఫీస్, ఓవర్ నైట్ 3 నెలల ఫ్రీ గేమ్ పాస్ తో వస్తుంది. స్టూడెంట్స్ కి, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కి ఈ ల్యాప్ టాప్ బాగా సెట్ అవుతుంది. మరో విశేషం ఏంటంటే ఇది అలెక్సా ఫీచర్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ.58,690 కాగా ఆఫర్ లో రూ. 41,990 కే అందుబాటులో ఉంది. హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు మీద 1500 వరకూ తగ్గింపు పొందవచ్చు. ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
లెవోవో ఐడియా ప్యాడ్ ఇంటెల్ కోర్ 12వ జనరేషన్ ల్యాప్ టాప్.. స్టూడెంట్స్, క్యాజువల్ యూజర్స్ ని బాగా ఆకర్షిస్తోంది. ఇది 15.6 అంగుళాల డిస్ప్లే సైజ్ తో వస్తుంది. 12వ జనరేషన్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో, 512 జీబీ ఎస్ఎస్డీ స్టోరేజ్ తో వస్తుంది. ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తున్నందున మూవీస్ చూసేందుకు, డాక్యుమెంట్స్ టైపింగ్ కి ఇది చాలా బాగుంటుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్, 3 నెలల గేమ్ పాస్ తో వస్తుంది. ఇందులో గ్రాఫిక్ కార్డు ఇన్స్టాల్ చేయబడి ఉంటుంది. వీడియో ఎడిటింగ్ కి ఉపయోగపడుతుంది. వీడియో గేమ్స్ కి ఉపయోగపడుతుంది కానీ రెండూ ఒకేసారి సపోర్ట్ చేయదు. గేమ్స్ ఆడితే ఎడిటింగ్ చేయకూడదు. ఎడిటింగ్ చేస్తే గేమ్స్ ఆడకూడదు. ఆన్ లైన్ లో ఈ ల్యాప్ టాప్ అసలు ధర రూ. 58,390 కాగా ఆఫర్ లో రూ. 36,490కే అందుబాటులో ఉంది. ఏ ల్యాప్ టాప్ ని కొనేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఆసస్ వివో బుక్ గో 15 ల్యాప్ టాప్ ని స్టూడెంట్స్, వర్కింగ్ ప్రొఫెషనల్స్ కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. ఏఎండీ రైజన్ 5 ప్రాసెసర్ తో వస్తుంది. మార్కెట్లో ఈ ప్రాసెసర్ కి మంచి డిమాండ్ ఉంది. 15.6 అంగుళాల స్క్రీన్ తో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. 512 జీబీ ఎస్ఎస్డీ స్టోర్ స్పేస్ తో వస్తుంది. విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టం, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తో పాటు అదనంగా ఏడాది వారంటీతో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 67,990 కాగా ఆఫర్ లో రూ. 45,990కే అందుబాటులో ఉంది. ఈ ల్యాప్ టాప్ ను కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
40 వేల లోపు బడ్జెట్ లో హెచ్పీ 15ఎస్ ల్యాప్ టాప్ ఇంజనీర్స్ కోసం బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ప్రొడక్టివిటీ, ఎంటర్టైన్మెంట్, ట్రావెలింగ్ పర్పస్ ఈ ల్యాప్ టాప్ అద్భుతంగ పెర్ఫార్మ్ చేస్తుంది. 12వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ5 ప్రాసెసర్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ స్టోరేజ్ తో వస్తుంది. ఇది 15.6 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. విండోస్ 11 ఓఎస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ తో వస్తుండడంతో అదనంగా ఈ సాఫ్ట్ వేర్స్ కోసం డబ్బు ఖర్చు ఉండదు. 7.5 గంటలకు పైగా లాంగ్ బ్యాటరీ లైఫ్ తో, ఫాస్ట్ ఛార్జింగ్ తో వస్తుంది. ఇది ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి బెస్ట్ ఛాయిస్ అని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 48,419 ఉండగా ఆఫర్ లో రూ. 36,970కే లభిస్తుంది. ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఇది 15.6 అంగుళాల స్క్రీన్ సైజ్ లో ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో.. 11వ జనరేషన్ ఇంటెల్ కోర్ ఐ3 ప్రాసెసర్ తో వస్తుంది. 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ స్టోరేజ్ తో వస్తుంది. ఫుల్ ఛార్జ్ చేసిన తర్వాత 11 గంటల పాటు పనిచేసేలా లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. స్టూడెంట్స్ కి, ప్రొఫెషనల్స్ కి ఇది ఎక్స్ లెంట్ చాయిస్ అని చెప్పవచ్చు. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 52,990 ఉండగా.. ఆఫర్ లో రూ. 33,990కే సొంతం చేసుకోవచ్చు. హెచ్ఎస్బీసీ క్రెడిట్ కార్డు ద్వారా అదనంగా 1500 వరకూ తగ్గింపు పొందవచ్చు. ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.
ఆసస్ వివో బుక్ గో 14 2023 ల్యాప్ టాప్ అనేది బడ్జెట్ ఫ్రెండ్లీ ల్యాప్ టాప్ గా పేరొందింది. ఇది 35 వేల కంటే తక్కువ ధరకే లభిస్తుండడం విశేషం. పైగా ఈ ల్యాప్ టాప్ కి ఫ్రీగా క్యారీ బ్యాగ్ వస్తుంది. ఇందులో ఏఎం డీ రైజన్ 3 ప్రాసెసర్ ని ఉంచారు. ఇది 8 జీబీ ర్యామ్, 512 జీబీ ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ తో వస్తుంది. 14 అంగుళాల ఫుల్ హెచ్డీ డిస్ప్లేతో వస్తుంది. విండోస్ 11 ఓఎస్, మైక్రోసాఫ్ట్ ఆఫీస్ సాఫ్ట్ వేర్ ప్రీ ఇన్స్టాల్ చేసి ఉండడం వల్ల ఇంజనీరింగ్ స్టూడెంట్స్ కి, ప్రొఫెషనల్స్ కి డబ్బు ఆదా అవుతుంది. లాంగ్ బ్యాటరీ లైఫ్ తో వస్తుంది. ఆన్ లైన్ లో దీని అసలు ధర రూ. 51,990 ఉండగా ఆఫర్ లో రూ. 31,990కే సొంతం చేసుకోవచ్చు. ఈ ల్యాప్ టాప్ ని కొనుగోలు చేసేందుకు ఈ లింక్ పై క్లిక్ చేయండి.