iDreamPost
android-app
ios-app

Electric Cars: తక్కువ ధర, మంచి ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్ కావాలా? వీటిని ట్రై చెయ్యండి.

  • Published Sep 16, 2024 | 8:32 PM Updated Updated Sep 16, 2024 | 8:32 PM

Electric Cars: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. మీరు మంచి ఫీచర్లతో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారుని కొనాలని భావిస్తున్నట్లయితే కొన్ని కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Electric Cars: ప్రస్తుతం ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. మీరు మంచి ఫీచర్లతో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారుని కొనాలని భావిస్తున్నట్లయితే కొన్ని కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి.

Electric Cars: తక్కువ ధర, మంచి ఫీచర్లతో ఎలక్ట్రిక్ కార్ కావాలా? వీటిని ట్రై చెయ్యండి.

ప్రస్తుతం సిటీలల్లో ఎలక్ట్రిక్ కార్ల హవా పెరిగిపోతుంది. మార్కెట్లో వీటికి డిమాండ్‌ అనేది భారీగా పెరిగిపోతుందనే చెప్పాలి. మీరు కూడా మంచి ఫీచర్లతో అదిరిపోయే ఎలక్ట్రిక్ కారుని కొనాలని భావిస్తున్నట్లయితే రూ .11 లక్షల లోపు కొన్ని కార్లు మార్కెట్‌లో అందుబాటులో ఉన్నాయి. టాటా నుంచి వచ్చిన పంచ్ ఈవీ యమా పాపులర్ అయ్యింది. ఇది మార్కెట్‌లో మంచి డిమాండ్‌ కలిగి ఉన్న ఎలక్ట్రిక్ ఎస్‌యూవీగా దూసుకుపోతుంది. ఈ కార్ ధర రూ.9.99 లక్షల నుంచి రూ.14.29 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) మధ్యలో ఉంది. ఈ కారులో 25 కిలోవాట్ల, 35 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్‌స్ ఉంటాయి. ఈ కారుని ఫుల్ గా ఛార్జ్ చేస్తే ఏకంగా 265 నుంచి 365 కిలోమీటర్ల దాకా ప్రయాణించవచ్చు. ఈ కారులో 5 మంది ప్రశాంతంగా ప్రయాణించవచ్చు. ఇందులో 10.25 అంగుళాల డ్యూయల్ డిస్ ప్లే, ఆండ్రాయిడ్ ఆటో, యాపిల్ కార్ ప్లే, ఎయిర్ ప్యూరిఫైయర్, యాంబియంట్ లైటింగ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, సన్‌రూఫ్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. ఇంకా ఇందులో సేఫ్టీ కోసం 6 ఎయిర్ బ్యాగ్స్‌, 360 డిగ్రీల కెమెరా వంటి ఫీచర్లు ఉంటాయి.

ఇక తాజాగా విడుదలైన ఎంజీ విండ్సర్ కార్ కూడా బాగా ఆకట్టుకుంటుంది. ఈ కార్ అందుబాటు ధరలోనే మార్కెట్లో విడుదల అయ్యింది. ఈ కార్ ఎక్స్ షోరూమ్ ధర రూ.9.99 లక్షల నుంచి ఉంటుంది. ఈ కారులో 38 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్ ఆప్షన్ ఉంది. దీన్ని ఫుల్ గా ఛార్జ్ చేస్తే లీటరుకు ఏకంగా 331 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఈ కారులో ఐదు మంది సౌకర్యంగా కూర్చొని ప్రయాణించవచ్చు.ఈ ఎంజీ విండ్సర్ ఈవీ ఫీచర్ల విషయానికి వస్తే ఈ కారులో 15.6 అంగుళాల టచ్‌స్క్రీన్‌ ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్, డిజిటల్ ఇన్‌స్ట్రూమెంట్ క్లస్టర్, యాంబియంట్ లైటింగ్, ఆటోమేటిక్ క్లైమేట్ కంట్రోల్, యాంబియంట్ లైటింగ్, వైర్‌లెస్‌ ఫోన్ ఛార్జింగ్ పోర్ట్ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. అలాగే ఈ కారులో 6-ఎయిర్ బ్యాగ్స్‌, 360-డిగ్రీల కెమెరా వంటి సూపర్ ఫీచర్లు కూడా ఉన్నాయి.

ఇక ఎంజీ కామెట్ కూడా బెస్ట్ ఈవీ ఎలక్ట్రిక్ కార్లలో ఒకటి. ఈ కార్ ధర రూ .6.99 లక్షల నుంచి రూ .9.53 లక్షల (ఎక్స్‌-షోరూమ్‌) దాకా ఉంది. ఈ కార్ 17.3 కిలోవాట్ల బ్యాటరీతో వస్తుంది. ఇది సింగిల్‌ ఛార్జ్‌పై ఏకంగా 230 కిలోమీటర్ల రేంజ్‌ని అందిస్తుంది. ఇందులో నలుగురు మాత్రమే ప్రయాణించవచ్చు. ఇంకా ఈ కారులో 10.25 అంగుళాల డ్యూయల్ స్క్రీన్ (ఇన్ఫోటైన్మెంట్ సిస్టమ్ & ఇన్స్ట్రుమెంట్ క్లస్టర్), ఆండ్రాయిడ్ ఆటో, ఆపిల్ కార్ ప్లే, కీలెస్ ఎంట్రీ వంటి సూపర్ ఫీచర్లు ఉన్నాయి. సేఫ్టీ ఫీచర్ల విషయానికి వస్తే.. ఈ కారులో ప్యాసింజర్ సేఫ్టీ కోసం డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌, రివర్స్ పార్కింగ్ కెమెరా వంటి ఫీచర్లు ఉన్నాయి.

కొత్త టాటా టియాగో కూడా బెస్ట్ ఈవీ అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ కారులో 7 ఇంచెస్‌ టచ్‌స్క్రీన్‌ ఇన్‌ఫోటైన్మెంట్ సిస్టమ్, 4-స్పీకర్ హర్మన్ సౌండ్ సిస్టమ్, ఆటో ఏసీ, పుష్-బటన్ స్టార్ట్ / స్టాప్, క్రూయిజ్ కంట్రోల్, స్టీరింగ్-మౌంటెడ్ కంట్రోల్ వంటి ఫీచర్లు ఉంటాయి. అలాగే డ్యూయల్ ఫ్రంట్ ఎయిర్ బ్యాగ్స్‌, టీపీఎంఎస్‌ (టైర్ ప్రెజర్ మానిటరింగ్ సిస్టమ్) వంటి సేఫ్టీ ఫీచర్లతో ఈ కార్ వస్తుంది. ఈ కార్ ధర రూ .7.99 లక్షల నుంచి రూ .11.49 లక్షల (ఎక్స్-షోరూమ్) దాకా ఉంటుంది. ఈ కారులో 19.2 కిలోవాట్స్‌, 24 కిలోవాట్ల బ్యాటరీ ప్యాక్‌ లు ఉంటాయి. ఈ కారు ఫుల్ ఛార్జ్‌పై 225 కిలోమీటర్ల దాకా ప్రయాణిస్తుంది. ఈ కారులో 5 మంది కంఫర్ట్ గా ప్రయాణించవచ్చు. మరి ఈ ఎలక్ట్రిక్ కార్లపై మీ అభిప్రాయం ఏంటో కామెంట్ రూపంలో తెలియజేయండి.