nagidream
Land Rates Near Hyderabad Airport: స్థలం మీద పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు పొందాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎయిర్ పోర్ట్ కి అతి దగ్గరలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా మరో సిటీగా ఆవిర్భవించనుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి లాభాలను పొందవచ్చు.
Land Rates Near Hyderabad Airport: స్థలం మీద పెట్టుబడి పెట్టి భారీగా లాభాలు పొందాలనుకునేవారికి ఇదే మంచి అవకాశం. ఎయిర్ పోర్ట్ కి అతి దగ్గరలో ఒక ఏరియా ఉంది. ఆ ఏరియా మరో సిటీగా ఆవిర్భవించనుంది. ఇప్పుడు ఇన్వెస్ట్ చేస్తే కనుక మంచి లాభాలను పొందవచ్చు.
nagidream
పెట్టుబడి పెట్టాలని అనుకున్నప్పుడు ఆల్రెడీ డెవలప్ అయిన ప్రాంతంలో కాకుండా డెవలప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ప్రాంతాన్ని ఎంచుకోవడం మంచిదని రియల్ ఎస్టేట్ నిపుణులు సూచిస్తుంటారు. హైదరాబాద్ సిటీలో డెవలప్ అయ్యేందుకు సిద్ధంగా ఉన్న ప్రాంతాలు అంటే దొరకడం కష్టం. కనీసం ఒక 30 కి.మీ. అవతలకి అయినా వెళ్ళాలి. అది కూడా బడ్జెట్ లోపు పెట్టుబడిలో దొరుకుతుందన్న గ్యారంటీ లేదు. బడ్జెట్ లోపు సామాన్యులు సైతం పెట్టుబడి పెట్టగలిగే ఏరియాలు కొన్ని ఉన్నాయి. అలాంటి ఏరియాల్లో పెట్టుబడి పెడితే ఫ్యూచర్ లో మంచి లాభాలను చూడవచ్చు. ఇప్పుడు మనం చెప్పుకోబోయే ప్రాంతం కూడా అలాంటిదే. ఇది ఎయిర్‌పోర్ట్‌కి అతి దగ్గరలో ఉంది. దీంతో ఈ ఏరియాకి ఫ్యూచర్ లో ఫుల్ డిమాండ్ ఏర్పడుతుంది.
శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కి 8 కి.మీ. దూరం ఉంది కొంగరకలాన్. ఈ ఏరియాలో స్థలాలు చాలా తక్కువ ధరకే అందుబాటులో ఉన్నాయి. ఇప్పుడు ఈ ఏరియాలో స్థలాల మీద ఇన్వెస్ట్ చేస్తే కనుక కొన్ని నెలల్లోనే లక్షల్లో లాభాలను పొందే అవకాశం ఉందని నిపుణులు అంటున్నారు. హైదరాబాద్ నుంచి 28 కి.మీ. దూరంలో ఉంది ఈ ఏరియా. ప్రస్తుతం ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం రూ. 3 వేలుగా ఉంది. 3 నెలల క్రితం ఈ ఏరియాలో చదరపు అడుగు స్థలం యావరేజ్ గా రూ. 2800గా ఉండేది. ఫాక్స్ కాన్ కంపెనీ ఈ ఏరియాలో పెట్టుబడి పెట్టిన తర్వాత ఈ ప్రాంతానికి డిమాండ్ పెరిగింది. 2014లో 7 వేలుగా ఉన్న గజం స్థలం.. ఫాక్స్ కాన్ ఇన్వెస్ట్మెంట్ తర్వాత 25 వేలకు పెరిగింది.
ఈ కంపెనీ పెట్టుబడి పెడితేనే ఈ స్థాయిలో పెరిగాయంటే.. ఈ కంపెనీ కార్యకలాపాలు పూర్తయితే ఇంకే స్థాయిలో ఉంటాయో అంచనా వేయవచ్చు. కొంగరకలాన్ కూడా మరో సిటీగా రూపాంతరం చెందుంతుందని నిపుణులు చెబుతున్నారు. ఈ ఏరియా అవుటర్ రింగ్ రోడ్ కి 1 కి.మీ. దూరంలో ఉంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్, రంగారెడ్డి కలెక్టరేట్ వంటివాటికి దగ్గరలో ఉంది. ఇప్పుడు గజం 27 వేలు ఉంది. ఒక 150 గజాల స్థలం కొనాలంటే 40 లక్షల వరకూ అవుతుంది. ఈ గజం విలువ నాలుగేళ్లలో 70 వేల నుంచి లక్ష రూపాయలు అవుతుందని నిపుణులు చెబుతున్నారు. ఇక ఈ ఏరియాలో రోడ్ కనెక్టివిటీ బాగుండడం.. హెచ్ఎండీఏ జెన్యూన్ లేఅవుట్స్ ఉన్నాయి.
గమనిక: అంతర్జాలంలో దొరికిన సమాచారం ఆధారంగా ఇవ్వబడింది. ధరల్లో మార్పులు ఉండవచ్చు. గమనించగలరు.