nagidream
8 Seater Cars: నలుగురు ఉన్న చిన్న కుటుంబానికి 5 సీటర్ కారు సరిపోతుంది. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నవారికి 7 సీటర్ కావాలి. అయితే ఒకరిద్దరు ఎక్కువగా ఉంటే ఏంటి పరిస్థితి? ఏముంది 8 సీటర్ కి వెళ్లడమే. బడ్జెట్ లో 8 సీటర్ కారు వస్తున్నప్పుడు 5, 7 సీటర్ కార్లు ఎందుకు అనే ప్రశ్న తలెత్తడం సహజమే.
8 Seater Cars: నలుగురు ఉన్న చిన్న కుటుంబానికి 5 సీటర్ కారు సరిపోతుంది. ఎక్కువ మంది కుటుంబ సభ్యులు ఉన్నవారికి 7 సీటర్ కావాలి. అయితే ఒకరిద్దరు ఎక్కువగా ఉంటే ఏంటి పరిస్థితి? ఏముంది 8 సీటర్ కి వెళ్లడమే. బడ్జెట్ లో 8 సీటర్ కారు వస్తున్నప్పుడు 5, 7 సీటర్ కార్లు ఎందుకు అనే ప్రశ్న తలెత్తడం సహజమే.
nagidream
ఎస్యూవీ కార్లకు దేశీయ మార్కెట్లో డిమాండ్ అనేది ఎప్పుడూ ఉంటుంది. అయితే ఇప్పుడు వీటికి గట్టి పోటీ ఇస్తున్న మోడల్ వాహనం ఏదైనా ఉందంటే అది ఎంపీవీనే. ఎంపీవీ అంటే మల్టీ పర్పస్ వెహికల్ అని అర్థం. అంటే వీటిని ఫ్యామిలీ, బిజినెస్ ట్రాన్స్ పోర్టేషన్ కి వాడుకోవచ్చు. అందుకే ఈ ఎంపీవీలు ఎస్యూవీ కార్లకు గట్టి పోటీనిస్తున్నాయి. పైగా స్పేస్ లో చూసుకున్నా, సీటింగ్ కెపాసిటీలో చూసుకున్నా కూడా ఎస్యూవీ కంటే పెద్దగా ఉంటాయి. ఈ ఎంపీవీ కార్లలో 8 నుంచి 9 మంది ప్రయాణించవచ్చు. కానీ చాలా మంది 5 సీటర్ కారు లేదా 7 సీటర్ కారు తీసుకుంటారు.
కారు కొనాలి అనుకున్నప్పుడు మైండ్ లో వచ్చేది 5 లేదా 7 సీటర్ గురించే. కారు తీసుకోవాలని అనుకునేవాళ్లు చాలా మంది 7 సీటర్ కారు తీసుకోవాలని అనుకుంటారు. 5 సీటర్ కారు కంటే ఇంకో రెండు ఎక్స్ ట్రా సీట్లు వస్తున్నాయి కదా అని 7 సీటర్ కి వెళ్తుంటారు. అయితే 7 సీటర్ కార్లు ప్రారంభ ధర 13 లక్షల నుంచి ఉంది. అయితే ఇదే ధరకు 8 సీటర్ కార్లు వస్తున్నప్పుడు ఇక 7 సీటర్ కారు తీసుకోవడం వల్ల ప్రయోజనం ఉండదు కదా. మహీంద్రా నుంచి టొయోటా వరకూ పలు 8 సీటర్ కార్లు అందుబాటులో ఉన్నాయి.
ఇది ఎంపీవీ కారు. బేస్ వేరియంట్ ఎం2లో 8 సీట్ల కెపాసిటీతో వస్తుంది. ఇందులో చాలా ఫీచర్లు ఉన్నాయి. మహీంద్రా మరాజో ధర రూ. 14.40 లక్షలుగా ఉంది. ఇది 6 స్పీడ్ మ్యాన్యువల్ గేర్ బాక్స్ తో వస్తుంది.
టయోటా ఇన్నోవాకి ఉన్న ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఎన్నో ఏళ్లుగా ఇది కస్టమర్ల మనసులను గెలుచుకుంది. ఎంతోమందిని ఎట్రాక్ట్ చేస్తుంది. పెద్ద కారుకి పోవాలనుకునేవారికి ఇదే ఫస్ట్ ఆప్షన్ అవుతుంది. 7 సీటర్ అంటే ఇన్నోవానే అనేలా పేరు తెచ్చుకుంది. అయితే ఇప్పుడు ఇన్నోవా 8 సీటర్ లో కూడా వస్తుంది. దీని ధర రూ. 19.99 లక్షలకు అందుబాటులో ఉంది.
టయోటా ఇన్నోవా హైక్రాస్ కారు 7 సీటర్ తో పాటు 8 సీటర్ తో కూడా వస్తుంది. ఈ 8 సీటర్ కారు ప్రారంభ ధర రూ. 19.82 లక్షలుగా ఉంది. ఇది మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది.
7 సీట్లతో పాటు 8 సీటర్ గా కూడా వస్తుంది ఈ మారుతి ఇన్విక్టో. అయితే పైన చెప్పిన వాటితో పోలిస్తే దీని ధర ఎక్కువ. 8 సీటర్ మారుతి ఇన్విక్టో ధర రూ. 25.35 లక్షలకు అందుబాటులో ఉంది. ఇది కూడా మ్యాన్యువల్, ఆటోమేటిక్ ట్రాన్స్ మిషన్ తో వస్తుంది.