iDreamPost
android-app
ios-app

Mercedes Benz: ఒకేసారి 3 బెంజ్ కార్లు కొన్న బార్బర్.. ఖరీదు కోట్లలో.. ఎవరంటే..

  • Published Apr 04, 2024 | 7:39 AM Updated Updated Apr 04, 2024 | 7:39 AM

ఓ బార్బర్ ఒకేసారి మూడు మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు కొని వార్తల్లో నిలిచాడు. ఇంతకు ఎవరతను.. అంటే..

ఓ బార్బర్ ఒకేసారి మూడు మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కార్లు కొని వార్తల్లో నిలిచాడు. ఇంతకు ఎవరతను.. అంటే..

  • Published Apr 04, 2024 | 7:39 AMUpdated Apr 04, 2024 | 7:39 AM
Mercedes Benz: ఒకేసారి 3 బెంజ్ కార్లు కొన్న బార్బర్.. ఖరీదు కోట్లలో.. ఎవరంటే..

ఒకప్పుడు కారంటే విలాసవంతమైన వస్తువుల జాబితాలో ఉండేది. మరి ఇప్పుడో.. కనీస అవసరంగా మారింది. మన దేశంలో కార్లకు డిమాండ్ పెరగడంతో.. ధరలు కూడా అందుబాటులోకి వచ్చాయి. లగ్జరీ కార్లు మినహా.. మిగతా అన్నింటి ధరలు అందుబాటులో ఉండటంతో.. మధ్యతరగతి వారు సైతం కారు కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. ఇక సెలబ్రిటీలు అయితే మార్కెట్ లోకి వచ్చిన ప్రతి కొత్త మొడల్ లగ్జరీ కారు తమ గ్యారెజ్ లో ఉండాలని భావిస్తారు. చాలా మందికి కార్ల కొనగోలు హాబీగా ఉంటుంది.

అయితే ఓ సామాన్య బార్బర్ మాత్రం సెలబ్రిటీలకు పోటీ వస్తున్నాడు. ఇప్పటికే అతడి గ్యారేజ్ లో వందల సంఖ్యలో కార్లు ఉండగా.. తాజాగా ఒకేసారి ఏకంగా మూడు మెర్సిడెస్ బెంజ్ కార్లు కొనుగోలు చేసి టాక్ ఆఫ్ ది టౌన్ గా నిలిచాడు. ఇంతకు ఎవరా వ్యక్తి.. ఎందుకు ఇంత ఖరీదైన కార్లు కొన్నాడు అంటే..

రమేష్ బాబు అంటే జనాలకు పెద్దగా తెలియదు కానీ.. బెంగళూరుకు చెందిన బిలియనీర్ బార్బర్ రమేష్ బాబు అంటే చాలా మంది గుర్తు పడతారు. కొనేళ్ల క్రితం రోల్స్ రాయిస్ ఘోస్ట్ కారు కొని వార్తల్లో నిలిచాడు. ఇక ఇప్పుడు ఏకంగా ఖరీదైన, లగ్జరీ మెర్సిడెస్ బెంజ్ కార్లు.. అది కూడా ఒకేసారి మూడు కొని వార్తల్లో నిలిచాడు. మెర్సిడెస్ బెంజ్ ఈ-క్లాస్ సెడాన్‌లను తన గ్యారేజ్ లోకి తీసుకొచ్చాడు రమేష్ బాబు. ఒక్క కారు ధర 72.80 లక్షలుగా ఉంది. మూడు కార్లంటే 2.20 కోట్ల రూపాయల పైచిలుకు అన్నమాట.

రమేష్ బాబు గ్యారేజిలో రోల్స్ రాయిస్ మాత్రమే కాకుండా దాదాపు అనేక లగ్జరీ కార్లు ఉన్నాయి. ఇందులో మెర్సిడెస్ బెంజ్ మేబ్యాక్ (రూ. 2.7 కోట్లు), బీఎండబ్ల్యూ 7 సిరీస్, మెర్సిడెస్ బెంజ్ ఎస్ క్లాస్, ఈ క్లాస్, బీఎండబ్ల్యూ 5 సిరీస్, అనేక వోల్వో కార్లు, టయోటా క్యామ్రి, హోండా అకార్డ్, హోండా సీఆర్-వీ మొదలైనవి ఉన్నాయి.

ఎవరీ రమేష్ బాబు..

రమేష్ బాబు విషయానికి వస్తే.. పేద కుటుంబం నుంచి వచ్చాడు. ఓపూట తింటే.. మరో పూట తిండి లేని పరిస్థితుల నుంచి బిలయనీర్ గా ఎదిగాడు. తండ్రి బార్బర్ గా పని చేసేవాడు. అతడు రమేష్ కు ఏడేళ్ల వయసప్పుడు చనిపోయాడు. అప్పటి నుంచి రమేష్ తల్లికి చేదోడువాదోడుగా ఉంటూ.. సాయం చేసేవాడు. పదో తరగతితో చదువుకు గుడ్ బై చెప్పాడు.

తండ్రి నడిపిన బార్బర్ షాప్ ను తిరిగి ప్రారంభించి.. అనతి కాలంలో దానికి మంచి గుర్తింపు తీసుకువచ్చాడు. ఈ క్రమంలో ఒక్క కారుతో ట్రావెల్స్ వ్యాపారం ప్రారంభించాడు. అది లాభసాటిగా మారడంతో.. ప్రభుత్వ సాయంతో 2004లో రమేష్ టూర్స్ అండ్ ట్రావెల్స్‌ని లాంచ్‌ చేసి లగ్జరీ కార్ రెంటల్ అండ్‌ సెల్ఫ్ డ్రైవ్ వ్యాపారంలోకి ప్రవేశించాడు. ప్రస్తుతం అతడి వద్ద 300 మంది పని చేస్తున్నారు.

రమేష్‌ అన్ని కార్లను డ్రైవ్‌ చేయగలడు. అతని క్లయింట్ల జాబితాలో ఉన్నవారంతా సెలబ్రిటీలు, బిలియనీర్లే. బాలీవుడ్‌ సీనియర్‌ నటుడు అమితాబ్‌ బచ్చన్‌, సల్మాన్ ఖాన్, ఐశ్వర్య రాయ్, అమీర్ ఖాన్ లాంటి వారితోపాటు, ప్రముఖ రాజకీయ నాయకులు ధనిక పారిశ్రామికవేత్తలు రమేష్ బాబు కస్టమర్లే. ఒక రోజుకు వసూలు చేసే అద్ద 50వేల రూపాయలకు పై మాటే. వ్యాపారం బాగా నడుస్తున్నప్పటికి అతడు తన వృత్తిని వదులుకోకపోవడం విశేషం. మెర్సిడెస్ లేదా రోల్స్ రాయిస్‌లోని తన దుకాణానికి వెళ్తాడు. 2 బిలియన్‌ డాలర్ల నెట్‌వర్త్‌తో ప్రపంచంలోనే రిచెస్ట్‌ బార్బర్‌గా ఫోర్బ్స్‌ గుర్తించింది.

 

View this post on Instagram

 

A post shared by Mercedes-Benz Sundaram Motors (@sundarammotorsbangalore)