iDreamPost
android-app
ios-app

డిసెంబర్లో బ్యాంకులకు 18 రోజులు సెలవు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే

  • Published Nov 29, 2023 | 10:15 AMUpdated Nov 29, 2023 | 12:53 PM

డిసెంబర్లో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 రోజులు సెలవులు వచ్చాయి. ఆ వివరాలు..

డిసెంబర్లో బ్యాంకులకు భారీగా సెలవులు వస్తున్నాయి. ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 18 రోజులు సెలవులు వచ్చాయి. ఆ వివరాలు..

  • Published Nov 29, 2023 | 10:15 AMUpdated Nov 29, 2023 | 12:53 PM
డిసెంబర్లో బ్యాంకులకు 18 రోజులు సెలవు.. తెలుగు రాష్ట్రాలకు ఎన్నంటే

ఎంత డిజిటల్ లావాదేవీలు ఎంత పెరిగినా సరే.. బ్యాంకులకు వెళ్లాల్సిన అవసరం తప్పకుండా ఉంటుంది. లోన్లు, గోల్డ్ లోన్ వంటి వాటి కోసం బ్యాంక్ కు కచ్చితంగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే ప్రతి నెల బ్యాంక్ లకు రెండో శనివార, నాల్గవ శనివారం, ఆదివారాలు సెలవు ఉంటాయి. ఇవే కాక నేషనల్ హాలీడేలతో పాటు.. స్థానికంగా ఉండే పండుగల సందర్భంగా కూడా బ్యాంకులకు సెలవులు ఇస్తారు. ఇవ నవంబర్ నెల ముగియడానికి మరో రెండు రోజుల సమయం మాత్రమే ఉంది. ఆ తర్వాత డిసెంబర్ ప్రారంభం అవుతుంది. అయితే వచ్చే నెలలో బ్యాంకులకు 18రోజులు సెలవు వచ్చాయి. మరి ఏ రోజులు సెలవు ఉన్నాయి.. తెలుగు రాష్ట్రాల్లో బ్యాంకులకు ఎన్ని రోజులు సెలవులు ఉన్నాయి వంటి వివరాలు..

డిసెంబర్‌ నెలలో ఆర్థికపరమైన అంశాల్లో కొన్ని మార్పులు జరగనున్నాయి. అలానే బ్యాంకులకు సంబంధించి పని వేళలు, సెలవు దినాల సమాచారం కోసం జనాలు ఎదురు చూస్తుంటారు. మరి డిసెంబర్లో బ్యాంకులకు 18 రోజులు సెలవులు వచ్చాయి. ఆ వివరాలు..

  • ఇటానగర్‌, కోహిమాలోని బ్యాంకులు డిసెంబర్‌ 1వ తేదీన పనిచేయవు. ఇండిజీనియెస్‌ ఫెయిత్‌ డే సందర్భంగా డిసెంబర్ 1న అక్కడ బ్యాంకులకు సెలవు ప్రకటించారు
  • ఇక డిసెంబర్‌ 4వ తేదీన పనాజీలో బ్యాంకులకు సెలవు. సెంట్​ ఫ్రాన్సిస్​ జెవియర్​ ఫీస్ట్ సందర్భంగా సెలవు ఇచ్చారు.
  • డిసెంబర్‌ 12వ తేదీ మంగళవారం షిల్లాంగ్లోని బ్యాంకులకు సెలవు. పా-టోగన్​ నెంజ్​మింగ్​ సాగ్మను పురస్కరించుకొని సెలవు ప్రకటించారు.
  • ఇక డిసెంబర్‌ 13, 14 తేదీల్లో బుధవారం, గురువారం.. నాన్‌సూంగ్‌ను పురస్కరించుకొని గ్యాంగ్​టక్​లోని బ్యాంకులకు సెలవులు ప్రకటించారు.
  • డిసెంబర్ 18వ తేదీ సోమవారం.. షిల్లాంగ్‌లోని బ్యాంకులకు సోసో థామ్​ వర్థంతి సందర్భంగా సెలవును ప్రకటించారు.
  • డిసెంబర్‌ 19వ తేదీ మంగళవారం.. పనాజీలో గోవా లిబరేషన్​ డేను పురస్కరించుకొని బ్యాంక్‌లు పనిచేయవు.
  • డిసెంబర్‌ 25వ తేదీ సోమవారం రోజు క్రిస్మస్‌ సందర్భంగా దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు ప్రకటించారు.
  • ఇక డిసెంబర్‌ 26వ తేదీన మంగళవారం.. క్రిస్మస్​ వేడుకలను పురస్కరించుంకొని.. ఐజ్వాల్​, కోహిమా, షిల్లాంగ్​లోని బ్యాంక్​లకు సెలవు ప్రకటించారు.
  • క్రిస్మస్‌ వేడుకల్లో భాగంగా డిసెంబర్‌ 27వ తేదీన బుధవారం.. కోహిమాలోని బ్యాంక్​లకు సెలవు ప్రకటించారు.
  • షిల్లాంగ్‌లోకి బ్యాంకులకు డిసెంబర్‌ 30వ తేదీ శనివారం.. యూ కయాంగ్​ నాంగ్​బాహ్ సందర్భంగా బ్యాంక్‌లకు హాలీడేగా డిక్లేర్ చేశారు.
  • ఇవే కాక డిసెంబర్‌ 3వ తేదీ ఆదివారం, డిసెంబర్​ 9 రెండో శనివారం, డిసెంబర్​ 10, డిసెంబర్​ 17 ఆదివారం, డిసెంబర్​ 23వ తేదీ నాలుగో శనివారం, డిసెంబర్​ 24, డిసెంబర్​ 31వ తేదీ ఆదివారం సందర్భంగా దేశవ్యాప్తంగా ఉన్న అన్ని బ్యాంకులకు సెలవులు. కనుకు బ్యాంకుకు వెళ్లే పని ఉంటే.. సెలవులు చూసుకుని దానికి తగ్గట్టుగా ప్లాన్ చేసుకొండి.

ఇదిలా ఉంటే బ్యాంకులకు సెలవులు ఉన్నా.. మొబైల్‌ బ్యాంకింగ్, ఇంటర్నెట్ బ్యాంకింగ్, యూపీఐ సేవలు​, ఏటీఎం సేవలు మాత్రం యధావిథిగా పనిచేస్తాయి. ఆన్‌లైన్‌ ద్వారా మనీ ట్రాన్స్‌ఫర్‌ చేసుకోవచ్చు. అలాగే ఏటీఎమ్‌ల ద్వారా క్యాష్‌ విత్‌డ్రాతో పాటు డిపాజిట్ మిషన్‌తో డిపాజిట్ కూడా చేసుకోవచ్చు.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి