iDreamPost
android-app
ios-app

Holiday: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. ఈ వారంలో 4 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే

  • Published Jul 15, 2024 | 2:51 PMUpdated Jul 15, 2024 | 2:51 PM

Bank Holiday On July 17-Muharram Festival: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడంటే..

Bank Holiday On July 17-Muharram Festival: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. ఈ వారంలో నాలుగు రోజులు సెలవులు ఉన్నాయి. ఎప్పుడెప్పుడంటే..

  • Published Jul 15, 2024 | 2:51 PMUpdated Jul 15, 2024 | 2:51 PM
Holiday: బ్యాంక్‌ కస్టమర్లకు అలర్ట్‌.. ఈ వారంలో 4 రోజులు సెలవులు.. ఎప్పుడెప్పుడంటే

డిజిటల్‌ చెల్లింపులు, యూపీఐ యాప్స్‌ వినియోగం పెరిగిన తర్వాత బ్యాంకులకు వెళ్లే అవసరం చాలా వరకు తగ్గింది. చెల్లింపు ప్రక్రియలన్ని ఆన్‌లైన్‌లోనే చేసేస్తున్నాం. చాలా వరకు బ్యాంక్‌లు లోన్‌ ఇచ్చే ప్రాసెస్‌ను కూడా ఆన్‌లైన్‌ చేశాయి. దాంతో బ్యాంకులకు వెళ్లే అవసరం చాలా వరకు తగ్గింది. బాంక్‌ బుక్స్‌కు సంబంధించిన పనులు, గోల్డ్‌ లోన్‌ వంటి వాటి కోసం బ్యాంకులకు వెళ్లక తప్పని పరిస్థితి. మీరు ఈ వారంలో బ్యాంకుకు వెళ్లే పని పెట్టుకుంటున్నారా.. అయితే మీకోసమే ఈ అలర్ట్‌. ఎందుకంటే ఈ వారలో సుమారు నాలుగు రోజులు బ్యాంకులు పని చేయవు.. సెలవులు. మరి దేశమంతా ఈ హాలీడేలు వర్తిస్తాయా.. ఎక్కడ.. ఎప్పుడెప్పుడు ఈ సెలవులు ఉన్నాయి.. అనే వివరాలు మీ కోసం..

దేశవ్యాప్తంగా ఈ వారంలో సుమారు నాలుగు రోజులు బ్యాంకులకు సెలవులు వచ్చాయి. అయితే రాష్ట్రాలను బట్టి సెలవులు మారుతుండగా.. కొన్ని దేశమంతా బ్యాంకులకు ఒకే రకంగా వర్తిస్తాయి. మరి ఇంతకు ఈ బ్యాంక్‌ సెలవులు ఎప్పుడెప్పుడు ఉన్నాయో.. అది కూడా ఏ ప్రాంతాల్లో అన్నది ఇప్పుడు మనం చూద్దాం. ఈ వారంలో ఒక పండుగ వచ్చింది. దాంతో దేశంలోని బ్యాంకులన్నింటికి తప్పనిసరిగా సెలవు ఉంటుంది. ఇంతకు ఆ పండుగ ఏదంటే..మొహర్రం. దేశంలోని చాలా రాష్ట్రాల్లో ఈ పండుగ జరుపుకుంటారు.

ఇస్లామిక్‌ క్యాలెండర్‌ ప్రకారం చూస్తే.. మొహరం అనేది తొలి మాసం. అందువల్ల దీనికి అధిక ప్రాధాన్యత ఉంటుంది. మరి ఈ పండుగ ఎప్పుడు వచ్చిందంటే.. మే 17 బుధవారం నాడు. దాంతో ఈ రోజున అన్ని పబ్లిక్‌, ప్రైవేటు రంగ బ్యాంకులకు సెలవు. తెలుగు రాష్ట్రాల్లో కూడా మొహరం సందర్భంగా బ్యాంకులకు సెలవు ఉంటుంది. అందువల్ల జూలై 17, ఆ రోజున బ్యాంకులు పని చేయవు.

అలాగే జూలై 16న కూడా బ్యాంకులు పని చేయవు. అయితే ఇది అన్ని రాష్ట్రాలకు వర్తించదు. కేవలం డెహ్రాడూన్‌ ప్రాంతం వరకు మాత్రమే ఈ సెలవు. కారణం..  హరేల సందర్బంగా అక్కడ జూలై 16 బ్యాంకులకు సెలవు. ఇకపోతే జూలై 20న కూడా బ్యాంకులకు హాలీడే ఉంది. అది కూడా కేవలం అగర్తలలో మాత్రమే ఈ హాలిడే. ఖార్చి పూజ కారణంగా జూలై 20న అగర్తాలలో బ్యాంకులు పని చేయవు. ఇక లాస్ట్‌కు జూలై 21న దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు సెలవు. కారణం ఆదివారం.

ఇక ఈ హాలీడేలు దేశమంతా ఒకే విధంగా ఉడవు. ప్రాంతాలను బట్టి మారుతుంటాయి. కనుక మీకు ఈ వారంలో బ్యాంకుల్లో పని ఉంటే.. బ్యాంకులకు ఎప్పుడెప్పుడు సెలవులు ఉన్నాయో ముందుగానే తెలుసుకుని ఆ మేరకు పనులు ప్లాన్‌ చేసుకుంటే మంచిది. అయితే బ్యాంక్‌లకు సెలవులు ఉన్నా.. ఆన్‌లైన్‌ సేవలు పొందవచ్చు. మొబైల్‌ బ్యాంకింగ్‌, ఆన్‌లైన్‌ బ్యాంకింగ్, యూపీఐ, నెట్‌ బ్యాంకింగ్‌, ఏటీఎంలు పని చేస్తాయి.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి