iDreamPost

లీక్ అయిన బజాజ్ సీఎన్జీ బైక్ వివరాలు.. ధర, ఫీచర్స్ ఇవే!

Bajaj CNG Bike Features Leaked: బజాజ్ ఆటో కంపెనీ నుంచి ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తున్న సంగతి తెలిసిందే. దీని ఫీచర్స్, ధర వంటి వివరాలు తెలుసుకోవాలని జనాలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కాగా ఈ సీఎన్జీ బైక్ కి సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి.

Bajaj CNG Bike Features Leaked: బజాజ్ ఆటో కంపెనీ నుంచి ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ వస్తున్న సంగతి తెలిసిందే. దీని ఫీచర్స్, ధర వంటి వివరాలు తెలుసుకోవాలని జనాలు ఇంట్రస్ట్ చూపిస్తున్నారు. కాగా ఈ సీఎన్జీ బైక్ కి సంబంధించి వివరాలు లీక్ అయ్యాయి.

లీక్ అయిన బజాజ్ సీఎన్జీ బైక్ వివరాలు.. ధర, ఫీచర్స్ ఇవే!

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైకుని పరిచయం చేసింది బజాజ్ ఆటో కంపెనీ. వినియోగదారులకు, ముఖ్యంగా సామాన్యులకు బడ్జెట్ లో అద్భుతమైన మైలీజే ఇచ్చే బైకులని అందించడంలో బజాజ్ ఆటో కంపెనీ ఒకటి. అలాంటి బజాజ్ నుంచి ఇప్పుడు సరికొత్త సీఎన్జీ బైక్ రాబోతుంది. అసలే పెట్రోల్ ధరలు చుక్కలు చూపిస్తున్నాయి. దీంతో కొంతమంది వాహనదారులు వేరే దారి లేక ఎలక్ట్రిక్ వాహనాల వైపు ఆసక్తి చూపిస్తున్నారు. మరి కొంతమంది మాత్రం వాటికి భయపడి పెట్రోల్ భారంతోనే బతుకు బండిని లాగించేస్తున్నారు. అయితే బజాజ్ ఆటో కంపెనీ ఎప్పుడైతే బజాజ్ సీఎన్జీ బైక్ ని ప్రకటించిందో అప్పటి నుంచి వాహనదారులు ఆ బైక్ రాక కోసం ఎంతగానో ఎదురుచూస్తున్నారు. ఆ బైక్ ఎలా ఉండబోతుంది? ఎంత మైలేజ్ ఇస్తుంది? ధర ఎంత ఉంటుంది? అసలు ఎప్పుడు వస్తుంది? దాని ఫీచర్స్ ఏంటి? అని తెలుసుకోవాలని తెగ ప్రయత్నాలు చేస్తున్నారు. అయితే తాజాగా ఈ సీఎన్జీ బైక్ గురించి కొన్ని వివరాలు లీక్ అయ్యాయి. 

ప్రపంచంలోనే తొలి సీఎన్జీ బైక్ ని తీసుకొస్తుంది బజాజ్ ఆటో కంపెనీ. ఈ బైక్ ని జూలై 5న విడుదల చేయనుంది. ఈ క్రమంలో వాహనదారులు ఈ బైక్ వివరాలు తెలుసుకునేందుకు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్రమంలో బజాజ్ సీఎన్జీ బైక్ కి సంబంధించి కొన్ని లీకులు బయటకొచ్చాయి. ఈ సీఎన్జీ బైక్ ను 125 సీసీ ఇంజిన్ సామర్థ్యంతో రూపొందించినట్లు తెలుస్తోంది. దీనికి బజాజ్ ఫ్రీడమ్ 125 అనే పేరుని పెట్టినట్లు సమాచారం. ఇక దీని ధర కూడా 80 వేల నుంచి లక్ష వరకూ ఉంటుందని తాజా లీకులు చెబుతున్నాయి. ఇక కంపెనీ ఇటీవల విడుదల చేసిన వీడియో ప్రకారం.. ఈ సీఎన్జీ బైక్ గతంలో వచ్చి బజాజ్ సీటీ 110 మోడల్ ని పోలి ఉన్నట్లు తెలుస్తోంది.

రౌండ్ హెడ్ ల్యాంప్ తో వస్తున్నట్లు తెలుస్తోంది. ఇందులో రెండు వేరియంట్లు ఉన్నట్లు తెలుస్తోంది. ఒకటి సాధారణ వేరియంట్ కాగా, మరొకటి ప్రీమియం వేరియంట్. ఇందులో ఉన్న ఇంకో అద్భుతమైన బెనిఫిట్ ఏంటంటే.. ఇది సీఎన్జీతో పాటు పెట్రోల్ ఆప్షన్ తో వస్తుంది. దీని కోసం ఒక బటన్ ను ఇచ్చారు. పెట్రోల్ తో నడపాలనుకుంటే పెట్రోల్ తో నడుపుకునేలా.. అలానే సీఎన్జీతో నడుపుకోవాలనుకుంటే సీఎన్జీ ఆప్షన్ తో నడుపుకునేలా దీన్ని తయారు చేశారు. పూర్తి స్థాయిలో సీఎన్జీ ఇంకా అందుబాటులోకి రాకపోవడంతో ఎలాంటి సమస్య రాకుండా ఉండేందుకు పెట్రోల్ ఆప్షన్ ని కూడా ఉంచినట్లు తెలుస్తోంది. 

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి