iDreamPost
android-app
ios-app

ఈ ఒక్క కార్డ్‌ ఉంటే చాలు.. గుండె జబ్బు నుంచి క్యాన్సర్‌ వరకు ఉచితంగా చికిత్స.. ఎలా పొందాలంటే

  • Published Sep 30, 2023 | 3:42 PM Updated Updated Sep 30, 2023 | 3:42 PM
  • Published Sep 30, 2023 | 3:42 PMUpdated Sep 30, 2023 | 3:42 PM
ఈ ఒక్క కార్డ్‌ ఉంటే చాలు.. గుండె జబ్బు నుంచి క్యాన్సర్‌ వరకు ఉచితంగా చికిత్స.. ఎలా పొందాలంటే

నేటి కాలంలో వైద్యం, విద్య రెండు చాలా ఖరీదు అయిన అంశాలుగా మారాయి. ప్రభుత్వ సంస్థల్లో నాణ్యత సరిగా ఉండదు. మెరుగైన విద్య, వైద్యం కావాలంటే.. ప్రైవేల్‌ సంస్థలనే ఆశ్రయించాలి. ఇక అక్కడ ఎంత భారీగా డబ్బు ఖర్చు అవుతుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. ఈ ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని.. ఏపీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి.. పేదలకు మెరుగైన వైద్యం అందించడం కోసం ఆరోగ్యశ్రీని అ‍మలు చేయడమే కాక.. పేద విద్యార్థులకు నాణ్యమైన విద్య అందించడం కోసం ప్రభుత్వ పాఠశాలల్లో​ ఆంగ్ల మీడియం ప్రవేశ పెట్టడమే కాక.. అనేక మార్పులకు శ్రీకారం చుట్టారు. మరి మిగతా రాష్ట్రాల్లో పిరిస్థితి ఏంటి అంటే.. వారికి గుండెజబ్బు, క్యాన్సర్‌ వంటి ప్రాణాంతక వ్యాధులు వస్తే.. ప్రభుత్వ ఆస్పత్రులే దిక్కు. వారి అదృష్టం బాగుంటే.. మహమ్మారి నుంచి కోలుకుంటారు. లేదంటే ఇక అంతే సంగతుల.

Free treatment from cardiac arrest to cancer with 1 card

5 లక్షల వరకు ఉచిత చికిత్స..

ఈ పరిస్థితిని మార్చడం కోసం.. పేదలు, మధ్య తరగతి వారికి మెరుగైన వైద్యం అందించడం కోసం ప్రధాని నరేంద్ర మోదీ ప్రపంచంలోనే అతిపెద్ద ఆరోగ్య బీమా పథకంగా గుర్తింపు పొందిన ఆయుష్మాన్ భారత్ యోజన లేదా ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకాన్ని తీసుకువచ్చారు. దీని ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న లక్షలాది మంది పేద, దిగువ మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన ఆరోగ్య సేవలను అందుబాటులోకి తెచ్చారు. ఈ పథకం కింద గుండె జబ్బులు మొదలు క్యాన్సర్‌ వరకు ఉచితంగా చికిత్స అందిస్తారు. ప్రస్తుత ప్రధాన మంత్రి జన్ ఆరోగ్య యోజన కింద 5 లక్షలు వరకు ఉచిత చికిత్స పొందే అవకాశం ఉంది.

ఈ పథకం కింద బీపీఎల్ కుటుంబానికి చెందిన వారు.. సంవత్సరానికి సుమారు 5 లక్షలు. వరకు ఉచిత వైద్యం పొందే అవకాశం ఉంది. క్యాన్సర్, గుండె శస్త్రచికిత్స వంటి ఖరీదైన చికిత్సలను కూడా ఈ పథకం కింద కవర్ చేస్తున్నారు. ఇప్పటికే ఐదు పూర్తి చేసుకున్న ఈ ప్రాజెక్టుకు కేం‍ద్ర ప్రభుత్వం ఈ ఏడాది బడ్జెట్‌లో రూ.1,600 కోట్లు కేటాయించింది. ఆయుష్మాన్ భారత్ యోజన మూడవ దశ సెప్టెంబర్ 17 నుంచి ప్రారంభించారు. కనుక ఇంకా ఈ పథకంలో చేరని వారు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవచ్చు. ఈసారి చేరిక ప్రక్రియను కూడా సులభతరం చేశారు.

ఎలా చేరాలంటే..

ఆయుష్మాన్ భారత్ యోజన ప్రధాన మంత్రి జన్‌ ఆరోగ్య యోజన పథకంలో నమోదు చేసుకున్న వారికి ఆయుష్మాన్ కార్డు ఇస్తారు. మొబైల్ అప్లికేషన్ ద్వారా ఈ పథకంలో చేరవచ్చు. ఆయుష్మాన్ కార్డ్ యాప్ ఆయుష్మాన్ భారత్ డౌన్‌లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఆ తర్వాత మీ మొబైల్ నంబర్ ఎంటర్ చేసి రిజిస్టర్ చేసుకోవాలి. ఆపై వేలిముద్ర, ఓటీనపీ, ముఖం ఆధారిత బయోమెట్రిక్‌ ద్వారార రిజిస్ట్రేషన్ చేస్తారు. ఇది కాకుండా రేషన్ కార్డ్, ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, నివాస ధృవీకరణ పత్రం, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోను అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది. అన్ని వివరాలు సరిగ్గా ఉన్నాయని నిర్థారించుకున్న​ తర్వాత ఎంటర్‌ బటన్‌ ప్రెస్‌ చేయాలి. అప్పుడు మీర పేరు మీద కార్డ్‌ జనరేట్‌ అవుతుంది.

ఏమేం ప్రయోజనాలు లభిస్తాయంటే..

ఈ పథకం కింద అప్లై చేసుకున్న బీపీఎల్ కుటుంబాలు ఏడాదికి రూ.5 లక్షల వరకూ బీమా కవరేజీ పొందవచ్చు. ఇప్పుడు ఈ పథకం కింద జాబితా చేయబడిన ఏదైనా ఆసుపత్రిలో (ప్రైవేట్‌తో సహా) 5 లక్షల వరకు ఉచితంగా చికిత్స పొందవచ్చు. అలాగే, ఈ కవరేజ్‌లో 3 రోజుల ప్రీ-హాస్పిటలైజేషన్, 15 రోజుల పోస్ట్-హాస్పిటలైజేషన్ ఖర్చులను కవర్ చేస్తుంది. అంతేకాక పథకం పేదలపై ఆసుపత్రి ఖర్చుల భారాన్ని తగ్గిస్తుంది. ఈ పథకం ద్వారా ఏటా ఆరు కోట్ల మంది లబ్ధి పొందుతున్నారు. ఆయుష్మాన్ కార్డ్ హోల్డర్ దేశవ్యాప్తంగా ఉన్న ఏదైనా లిస్టెడ్ హాస్పిటల్‌లో ఉచిత చికిత్స పొందవచ్చు.

ఏ వ్యాధులు కవర్‌ అవుతాయి అంటే..

  • తీవ్రమైన, ఇంటెన్సివ్ కేర్ సేవల ఖర్చు కూడా పీఎంజేఏవై కింద కవర్ చేయబడుతుంది.
  • గుండె జబ్బుల చికిత్స నుండి క్యాన్సర్ చికిత్స వరకు ఈ పథకం కింద ఉచిత ట్రీట్‌మెంట్‌ పొందవచ్చు.
  • ప్రోస్టేట్ క్యాన్సర్
  • కరోనరీ ఆర్టరీ బైపాస్ గ్రాఫ్టింగ్
  • డబుల్ వాల్వ్ రీప్లేస్‌మెంట్
  • కరోటిడ్ యాంజియోప్లాస్టీ విత్ స్టంట్
  • పల్మనరీ వాల్వ్ రీప్లేస్‌మెంట్
  • స్కల్ బేస్ సర్జరీ
  • పూర్వ వెన్నెముక ఫిక్సేషన్
  • కాలిపోయిన గాయానికి టిష్యూ ఎక్స్‌పాండర్ చికిత్స

పైన పేర్కొన్న వ్యాధులన్నింటికి ఆయుష్మాన్‌ భారత్‌ కింద ఉచితంగా చికిత్స అందిస్తారు. కాబట్టి అర్హులైన వాళ్లు కార్డు తీసుకుని తమ దగ్గర పెట్టుకుంటే మంచిది.