iDreamPost

ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి శుభవార్త.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

ఎఫ్‌డీ చేయాలనుకునే వారికి శుభవార్త.. భారీగా పెరిగిన వడ్డీ రేట్లు

ఈ రోజుల్లో డబ్బుల విషయంలో ఎవర్నీ నమ్మలేని పరిస్థితి. మన దగ్గర పెద్ద మొత్తంలో డబ్బు ఉంటే.. వడ్డీ వస్తుందన్న ఆశతో ఇతరులకు అప్పు ఇస్తూ ఉంటారు. అయితే అవి తిరిగి వస్తాయన్న నమ్మకం లేదు. అందుకే చాలా మంది పోస్టాఫీసుల్లో, బ్యాంకుల్లో తమ డబ్బును దాస్తూ ఉంటారు. సేఫ్ అండ్ సెక్యూర్డ్ మనీ కోసం చూసే వాళ్లు అనేక మంది ఉన్నారు. పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టడం, కాస్త లేటయినా పర్వాలేదు భద్రత, రాబడి ముఖ్యం అనుకునే వారికి బెస్ట్ ఆప్షన్ ఫిక్స్‌డ్ డిపాజిట్. ఇందులో ఒకేసారి డబ్బులు దాచుకుని.. కాల పరిమితి దాటిపోయిన తర్వాత వడ్డీతో సహా తిరిగి తీసుకోవచ్చు. పోస్టాఫీసుల్లో ఓ వడ్డీ ఉండగా.. బ్యాంకులను బట్టి వడ్డీ రేట్లు ఉంటాయి.

తాజాగా ప్రముఖ బ్యాంకు యాక్సిస్ బ్యాంక్ తన ఖాతాదారులకు గుడ్ న్యూస్ చెప్పింది. ఎఫ్‌డీ వడ్డీ రేట్లను ప్రైవేట్ బ్యాంక్ సవరించింది. 15 నెలల నుండి 5 సంవత్సరాల కాల వ్యవధికి సాధారణ ప్రజలకు గరిష్టంగా 7.10 శాతం వడ్డీ, 5 నుండి 10 సంవత్సరాల కాల వ్యవధికి 7 శాతం వడ్డీని అందిస్తుంది. అలాగే సీనియర్ సిటిజన్లకు 5-10 శాతం సంవత్సరాల ఎఫ్‌డీపై 7.75 శాతం అందించనుంది. రూ. 2 కోట్ల లోపు ఉన్న ఎఫ్‌డీలపై మాత్రమే ఈ కొత్త వడ్డీ రేటు అమలులో ఉంటుంది. 7-10 ఏళ్లలోపు మెచ్యూరిటీ ఉన్న ఎఫ్ డీలపై సాధారణ ప్రజలకు 3-7 శాతం, సీనియర్ సిటిజన్లకు 3-5 ఏళ్ల డిపాజిట్లపై గరిష్టంగా 7.75 శాతం ఉంటుంది. ఆర్బీఐ రెపో రేటు సవరించిన ప్రతిసారి వడ్డీరేట్లలో మార్పు కనిపిస్తుంది.

వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి