iDreamPost
android-app
ios-app

కార్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన వాహన ధరలు

  • Published Aug 22, 2024 | 5:01 PM Updated Updated Aug 22, 2024 | 5:01 PM

Huge Discounts On These Cars: కార్లు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. పలు కార్ల కంపెనీల వారు, డీలర్లు కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. మీరు కనుక కారు కొనాలి అని ఫిక్స్ అయితే కనుక ఏ కారుపై ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో చూసుకోండి.

Huge Discounts On These Cars: కార్లు కొనాలని అనుకుంటున్నారా? అయితే మీకో గుడ్ న్యూస్. పలు కార్ల కంపెనీల వారు, డీలర్లు కార్లపై భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. మీరు కనుక కారు కొనాలి అని ఫిక్స్ అయితే కనుక ఏ కారుపై ఎక్కువ డిస్కౌంట్ వస్తుందో చూసుకోండి.

కార్లు కొనాలనుకునేవారికి గుడ్ న్యూస్.. తగ్గిన వాహన ధరలు

మునుపెన్నడూ లేని విధంగా కార్ల రిటైల్ మార్కెట్లో డిస్కౌంట్ల జోరు నడుస్తుంది. 2023 ఆగస్టు నెలతో పోలిస్తే ఈ ఏడాది కార్ల ధరలపై తగ్గింపు రెండు రెట్లు పెరిగిందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. డిసెంబర్ వరకూ ఈ డిస్కౌంట్లు కొనసాగే అవకాశం ఉందని మార్కెట్ వర్గాలు చెబుతున్నాయి. విక్రయాలు బాగా తగ్గిపోవడంతో కంపెనీల వద్ద, డీలర్ షిప్ కేంద్రాల వద్ద కార్ల నిల్వలు పేరుకుపోయాయి. దీంతో ఈ నిల్వలను క్లియర్ చేసేందుకు కంపెనీలు, డీలర్లు భారీ డిస్కౌంట్లు ఆఫర్ చేస్తున్నారు. టాటా మోటార్స్, మారుతి సుజుకీ, హ్యుందాయ్, హోండా, టాటా స్కోడా వంటి ప్రముఖ కంపెనీలు భారీగా డిస్కౌంట్లను ఇస్తున్నాయి. కార్ల ధర తగ్గింపు, ఎక్స్ ఛేంజ్ బోనస్ సహా పలు ఇతర ప్రయోజనాలను కల్పిస్తున్నాయి.

పాపులర్ కార్ మోడల్స్ కి ఈ డిస్కౌంట్స్ ని అందిస్తున్నాయి. 2019-20 తర్వాత ఇప్పుడే అధిక డిస్కౌంట్లు ఉన్నాయని ఆటోమొబైల్ పరిశ్రమ ప్రతినిధి చెప్పారు. భారత్ స్టేజ్ ఎమిషన్ స్టాండర్డ్స్ (బీఎస్ 6) 2020 ఏప్రిల్ 1 నుంచి అమలులోకి వచ్చాయి. ఈ క్రమంలో నిల్వలను క్లియర్ చేసుకోవడానికి పలు కార్ల కంపెనీలు 2019-2020 ఏడాదిలో డిస్కౌంట్లను ప్రకటించాయి. ప్రస్తుత ఆర్థిక ఏడాది ప్రారంభంలో సుమారు 3 లక్షల యూనిట్ల స్థాయిలో కార్ల నిల్వలు నమోదయ్యాయి. 30 రోజుల డిమాండ్ కి తగ్గా యూనిట్లు. కానీ అమ్మకాలు మందగించడం వల్ల ఈ పరిస్థితి నెలకొంది. ఈ కొద్ది రోజుల్లోనే ఈ నిల్వలకు మరో లక్ష యూనిట్లు తోడయ్యాయి. దీంతో పేరుకుపోయిన నిల్వలను క్లియర్ చేయడం కోసం కార్ల కంపెనీలు, డీలర్లు భారీగా డిస్కౌంట్లు ఇస్తున్నాయి.

2023-24 ఏడాదిలో దేశవ్యాప్తంగా ప్యాసింజర్ వాహనాల అమ్మకాలు గరిష్టంగా 42.3 లక్షల యూనిట్లు నమోదయ్యాయి. సెమీ కండక్టర్ల కొరత ప్రభావం తగ్గడం, డిమాండ్ కొనసాగడం కారణంగా గరిష్ట విక్రయాలు నమోదయ్యాయి. అయితే మూడేళ్ల పాటు విక్రయాల విషయంలో పరుగులు పెట్టిన ప్యాసింజర్ వాహన పరిశ్రమ ప్రస్తుత ఆర్థిక ఏడాదిలో బాగా డల్ అయ్యింది. విక్రయాలు మందగించాయి. దీంతో పలు మోడల్స్ పై భారీ డిస్కౌంట్లను ప్రకటించాయి. మారుతి కంపెనీ బ్రీజా కారుపై 25 వేల రూపాయలు, గ్రాండ్ విటారాపై రూ. 1,28,000 తగ్గింపుని అందిస్తుంది. హ్యుందాయ్ కంపెనీ ఎక్స్ టర్ మోడల్ పై 40 వేలు, ఆల్కజార్ మోడల్ పై  90 వేల రూపాయల వరకూ తగ్గింపు అందిస్తుంది. టాటా మోటార్స్ కంపెనీ నెక్సాన్ మోడల్ పై 16 వేల నుంచి లక్ష రూపాయల వరకూ ఆఫర్స్, బెనిఫిట్స్ ని అందిస్తుంది.