Dharani
Dharani
ఒకప్పుడు డబ్బులు డ్రా చేయాలంటే.. బ్యాంకుకు వెళ్లాల్సి వచ్చేది. అయితే ఏటీఎం కార్డుల వినియోగం వచ్చాక.. 24/7 ఎప్పుడు ఎక్కడ డబ్బులు అవసరం వచ్చినా సరే.. వెంటనే ఏటీఎం సెంటర్‌కు వెళ్లి.. కార్డు పెట్టి డ్రా చేసుకుంటే చాలు. ఇక కోవిడ్ తర్వాత.. ఏటీఎం కార్డుల వినియోగం కూడా చాలా వరకు తక్కువ అయ్యింది. మొత్తం డిజిటల్ పేమెంట్స్, ఆన్‌లైన్ ట్రాన్సాక్షన్స్ కావడంతో.. చేతిలో ఐదు వందల రూపాయలు కూడా ఉంచుకునే పరిస్థితి లేదు. నేటి కాలంలో డిజిటల్ పేమెంట్స్, లేదంటే ఏటీఎం ట్రాన్సాక్షన్స్ అంతే. డబ్బులు కావాలంటే బ్యాంకులకు వెళ్లాల్సిన పనే లేదు. మరి మన దగ్గర ఉన్న ఏటీఎం కార్డు ద్వారా కేవలం డబ్బులు డ్రా చేయడం మాత్రమే కాదు, ఐదు లక్షల రూపాయల వరకు ఉచిత బీమా సౌకర్యం పొందవచ్చనే విషయం మీకు తెలుసా. పైగా మీరు దీన్ని చాలా సులభంగా క్లెయిమ్ చేసుకోవచ్చు. ఏటీఎం కార్డు ఉంటే.. బీమా సౌకర్యం ఎలా పొందుతాం.. అది కూడా ఉచితంగా అని ఆలోచిస్తున్నారా.. అయితే ఇది చదవండి.
ప్రస్తుతం కాలంలో జన్‌ధన్ ఖాతాలు సహా ప్రతి బ్యాంక్.. తన ఖాతాదారులకు ఏటీఎం కార్డులు అదే డెబిట్ కార్డులు ఇస్తోన్న సంగతి తెలిసిందే. అలా మమీరు ఏదైనా బ్యాంకు ఏటీఎం కార్డ్‌ని గనుక 45 రోజుల కంటే ఎక్కువ రోజుల పాటు ఉపయోగించినట్లయితే, మీరు ఈ ఉచిత బీమా సౌకర్యానికి అర్హులు. వీటిలో ప్రమాద బీమా , జీవిత బీమా రెండూ ఉన్నాయి. మీరు ఈ రెండు పరిస్థితుల్లోనూ బీమాను క్లెయిమ్ చేయగలుగుతారు. కార్డు కేటగిరీని బట్టి బీమా మొత్తాన్ని నిర్ణయిస్తారు. క్లాసిక్ కార్డ్ హోల్డర్లు రూ. 1 లక్ష వరకు, ప్లాటినం రూ. 2 లక్షల వరకు, మాస్టర్ రూ. 5 లక్షల వరకు, వీసా రూ. 1.5 నుంచి 2 లక్షల వరకు , సాధారణ మాస్టర్ కార్డ్ రూ. 50,000 వరకు బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేయవచ్చు.
అలానే ప్రధాన మంత్రి జన్ ధన్ యోజన ఖాతాదారుల బ్యాంకు ఏటీఎం కార్డులపై కూడా ప్రత్యేక ఉచిత బీమా పాలసీ ఉంది. దీని కింద, మీరు సుమారు రూ.1-2 లక్షల వరకు ఉచిత బీమా రక్షణను క్లెయిమ్ చేసుకోవచ్చు. అంతే కాదు ప్రమాదంలో మరణిస్తే రూ.5 లక్షలు, కొన్ని కారణాల వల్ల వికలాంగులైతే రూ.50 వేలు తీసుకునే అవకాశం ఉంటుంది. అంతే కాకుండా రెండు కాళ్లు లేదా చేతులు పూర్తిగా దెబ్బతిన్నట్లయితే రూ.1 లక్ష వరకు, మరణిస్తే రూ.1-5 లక్షల వరకు బీమా సౌకర్యం లభిస్తుంది.
బ్యాంక్ ఏఈఎం కార్డుపై లభించే ఉచిత బీమాను క్లెయిమ్ చేసుకునే ప్రక్రియ చాలా సులభంగా ఉంటుంది. ఏటీఎం కార్డు మీద లభించే బీమీ మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవాలంటే.. మీరు ముందుగా ఖాతాదారుల నామినీని జోడించిన సమాచారాన్ని తెలుసుకోవాల్సిన అవసరం ఉంటుంది. మీరు ఆసుపత్రి చికిత్స ఖర్చులు, సర్టిఫికేట్, పోలీసు ఎఫ్ఐఆర్ కాపీలను చూపించి బీమాను క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇక్కడ చెప్పిన కారణాలు కాకుండా.. ఒకవేళ ఖాతాదారుడు మరణిస్తే, అటువంటి పరిస్థితిలో నామినీ మరణ ధృవీకరణ పత్రాన్ని సమర్పించి బీమా మొత్తాన్ని క్లెయిమ్ చేసుకోవచ్చు. ఇదే కాకా మీరు డెబిట్ కార్డ్ ద్వారా ఆన్‌లైన్‌లో షాపింగ్ కూడా చేయవచ్చు. ప్రస్తుత కాలంలో పలు కంపెనీలు డెబిట్ కార్డుల పై భారీ ఆఫర్లను కూడా ప్రకటిస్తున్నాయి.